Sahakutumbaanaam Teaser - స:కుటుంబానాం: ఇదొక ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ... ఆసక్తి పెంచిన టీజర్
Sahakutumbaanaam Movie: హీరోయిన్ మేఘా ఆకాష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'సఃకుటుంబానాం'. రామ్ కిరణ్ హీరో. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా టీజర్ విడుదలైంది.

అనగనగా ఓ కథానాయకుడు. ఆఫీసులో కొలీగ్స్ అందరూ అతడిని ఫ్యామిలీ మ్యాన్ అంటారు. అయితే అతడు మాత్రం ఫ్యామిలీని హేట్ చేస్తాడు. అది ఎందుకో తెలియాలంటే... 'సఃకుటుంబానాం' సినిమా చూడాలి.
రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా...
నట కిరీటి డా రాజేంద్ర ప్రసాద్, కామెడీ కింగ్ బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'సఃకుటుంబానాం'. ఇందులో రామ్ కిరణ్ హీరో. అతని సరసన మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటించారు. తాజాగా సినిమా టీజర్ విడుదల చేశారు.
'సఃకుటుంబానాం' టీజర్ విషయానికి వస్తే... ఓ సాఫ్ట్‌వేర్ ఆఫీసులో హీరో ఉద్యోగి. అతడి పేరు చెబితే అందరూ భయపడతారు. ముఖ్యంగా కొలీగ్ రోల్ చేసిన సత్య. మందు, సిగరెట్... హీరోని ఒక వైపు నుంచి అర్జున్ రెడ్డిలా ప్రజెంట్ చేస్తూ మరో వైపు ప్రధాన పాత్రలను పరిచయం చేశారు దర్శకుడు. హీరో గురించి తెలుసుకోవాలని మేఘా ఆకాష్ ఆసక్తి చూపిస్తుంది. 'కొంచెం డిటైల్డ్ గా చెబుతారా?' అని కూడా అడుగుతుంది. మరి అతడి కథ ఏమిటో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాలి. చాలా రోజుల తర్వాత సత్య, బ్రహ్మానందం కలిసి కామెడీ చేయబోతున్నారు.
Also Read: బ్లాక్ బస్టర్ 'కుబేర': రష్మిక అకౌంట్‌లో మరో హిట్, కానీ అభిమానులకు నిరాశ... కారణం ఏంటంటే?
టీజర్ విడుదలైన సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ... ''ఇటీవల కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మా సినిమా కూడా ఆ కోవలోకి వెళుతుంది. అందరితో 'ఫ్యామిలీ మ్యాన్' అనిపించుకుంటున్న కథానాయకుడు ఫ్యామిలీని ఎందుకు ద్వేషిస్తున్నాడు?' అనేది ఆసక్తికరం. ఈ టీజర్ విడుదల చేసిన కొన్ని క్షణాలకు అందరి నుంచి మంచి స్పందన లభించింది. మా దర్శక రచయిత ఉదయ్ శర్మ కొత్త తరహా కథ రాశారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం చిత్రానికి బలంగా నిలిచింది'' అని చెప్పారు.
Also Read: మెగా హీరోలకు బ్లాక్ బస్టర్ నెల... హరిహర వీరమల్లుకు సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?
Sahakutumbaanaam Movie Cast And Crew: రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటించిన 'స:కుటుంబానాం' సినిమాలో నట కిరీటి డా రాజేంద్ర ప్రసాద్, కామెడీ కింగ్ బ్రహ్మానందం, సత్య, 'శుభలేఖ' సుధాకర్, రాజశ్రీ నాయర్, 'రచ్చ' రవి, గిరిధర్, 'తాగుబోతు' రమేష్, భద్రం తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కళా దర్శకత్వం: పీఎస్ వర్మ, ఫైట్స్: అంజి - కార్తీక్, కూర్పు: శశాంక్ మలి, నృత్య దర్శకత్వం: చిన్ని ప్రకాష్ - భాను - విజయ్ పొలాకి, సాహిత్యం: అనంత శ్రీరామ్, ఛాయాగ్రహణం: మధు దాసరి, సంగీతం: మెలోడీ బ్రహ్మ మణిశర్మ, నిర్మాత: హెచ్ మహదేవ గౌడ్, రచన - దర్శకత్వం: ఉదయ్ శర్మ.





















