అన్వేషించండి

Swetha PVS : టాలీవుడ్ నుంచి మరో దర్శకురాలు - ఆర్జే నుంచి డైరెక్టర్‌గా మారుతున్న శ్వేత పీవీఎస్

Swetha PVS : టాలీవుడ్‌కు ఎంతోమంది డైరెక్టర్లను పరిచయం చేసిన బిగ్ బాస్ సినిమాస్.. ఆర్జే శ్వేతను కూడా దర్శకురాలిగా పరిచయం చేయనుంది. తాజాగా తను డైరెక్ట్ చేస్తున్న మూవీ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసింది.

Swetha PVS Introduces As Director: ఈరోజుల్లో చాలామంది అమ్మాయిలు కూడా సినిమాల్లో ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ ఉండడానికే ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా చాలామంది డైరెక్టర్లు అవ్వాలనే కలతో తమ కెరీర్లను ప్రారంభిస్తున్నారు. ఇక టాలీవుడ్‌లోని లేడీ డైరెక్టర్స్ లిస్ట్‌లోకి మరో పేరు యాడ్ అవ్వనుంది. అదే శ్వేత. మామూలుగా శ్వేత అని చెప్తే చాలామందికి అర్థం కాకపోవచ్చు. కానీ ఆర్జే శ్వేత అని లేదా శ్వేత పీవీఎస్ అని చెప్తే మాత్రం నెటిజన్లు చాలావరకు గుర్తుపట్టేస్తారు. ప్రస్తుతం ఆర్జేగా రాణిస్తున్న శ్వేత.. త్వరలోనే డైరెక్టర్‌గా మైక్రోఫోన్ పట్టుకోనుంది. తన మొదటి సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను మథర్స్ డే సందర్భంగా రివీల్ చేశారు మేకర్స్.

ఆర్జే, డబ్బింగ్ ఆర్టిస్ట్..

టాలీవుడ్‌లో కొత్త దర్శకులను పరిచయం చేయాలన్నా, యంగ్ టాలెంట్‌కు అవకాశాలు ఇచ్చి ప్రోత్సాహించాలన్నా బిగ్ బెన్ సినిమాస్ ఎప్పుడూ ముందే ఉంటుంది. నిర్మాత యష్ రంగినేని ఇప్పటికే తన బ్యానర్ ద్వారా ఎందరో యంగ్ దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అందులో ఇప్పుడు ఆర్జే శ్వేత కూడా యాడ్ అయ్యింది. ఆర్జేగా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా శ్వేత.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘ఉప్పెన’లో కృతి శెట్టికి డబ్బింగ్ చెప్పింది శ్వేత. ఇక తను దర్శకురాలిగా పరిచయమవుతున్న సినిమాకు ‘అమ్మ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అంతే కాకుండా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను కూడా రివీల్ చేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by P VENKATA SAI SWETHA (@swethapvs)

ఎంతోమంది యంగ్ డైరెక్టర్స్..

‘పెళ్లి చూపులు’, ‘డియర్ కామ్రేడ్’, ‘దొరసాని’, ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ లాంటి సినిమాలను నిర్మించింది బిగ్ బెన్ సినిమాస్. వారు నిర్మించే ప్రతీ సినిమాలో ప్రేక్షకులకు చాలా కనెక్ట్ అయ్యే అంశం తప్పకుండా ఉంటుంది. ఈ సంస్థ ద్వారానే తరుణ్ భాస్కర్, భరత్ కమ్మ, కేవి మహేంద్ర, సంజీవ్ రెడ్డి వంటి పలువురు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఇప్పుడు ‘అమ్మ’తో శ్వేత కూడా దర్శకురాలిగా ప్రేక్షకులను మెప్పించానికి సిద్ధమయ్యింది. ముందుగా రేడియో మిర్చిలో ఆర్జేగా తన కెరీర్‌ను ప్రారంభించింది శ్వేత. ఆ తర్వాత టాలీవుడ్‌లో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా మారింది.

‘ఉప్పెన’తో బ్రేక్..

‘ఉప్పెన’కంటే ముందు కూడా పలు చిత్రాల్లో హీరోయిన్స్ క్యారెక్టర్స్‌కు డబ్బింగ్ చెప్పింది శ్వేత. కానీ ‘ఉప్పెన’లో కృతి శెట్టి యాక్టింగ్‌కు శ్వేత డబ్బింగ్ యాడ్ అవ్వడం పెద్ద ప్లస్‌గా మారింది. ఆ తర్వాత నుంచి అటు ఆర్జేగా, ఇటు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా బిజీ అయిపోయింది శ్వేత. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు చాలా యాక్టివ్‌గా ఉంటుంది. హాయ్ డార్లింగ్స్ అంటూ లైఫ్ గురించి, లవ్ గురించి ఇంట్రెస్టింగ్ వీడియోలను షేర్ చేస్తుంటుంది. ఇక తను డైరెక్టర్‌గా మారుతుండడంతో తన సోషల్ మీడియా ఫాలోవర్స్ అందరూ తనకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.

Also Read: 'అమ్మ' ప్రేమను వెండితెరపై ఆవిష్కరించిన టాలీవుడ్ సినిమాలు ఇవే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
OLA EV Showroom: ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Telangana: కేటీఆర్ అరెస్టు ఖాయమా ? ఆ రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయి ?
కేటీఆర్ అరెస్టు ఖాయమా ? ఆ రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయి ?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
Embed widget