News
News
వీడియోలు ఆటలు
X

Rashmika Mandanna: అలా చేస్తూపోతే భవిష్యత్‌లో నాకు బ్యాక్ పెయిన్ గ్యారెంటీ: రష్మిక మందన్న

ఇటీవల రష్మిక తన ఫ్యాన్స్ తో ఆన్ లైన్ లో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ సందర్భంగా ఓ అభిమాను ‘‘పుష్ప’ సినిమాలో ‘సామి సామి’ సాంగ్ కు మీతో డాన్స్ చేయాలనుంది’ అని అడిగితే..

FOLLOW US: 
Share:

టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో రష్మిక మందన్న ఒకరు. తెలుగులో ‘ఛలో’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అనతికాలంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చకుంది. వరుస హిట్ సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక అల్లు అర్జున్ సుకుమార్ కాంబో లో వచ్చిన ‘పుష్ప’ సినిమాలో నటించి నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఆ సినిమాలోని పాటలు దేశవ్యాప్తంగా మారుమోగిపోయాయి. ముఖ్యంగా ‘సామి సామి’ పాట అందరితో స్టెప్పులు వేయించింది. ఈ పాటలో రష్మిక డాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అందుకే రష్మిక ఎక్కడికి వెళ్లినా ‘సామి సామి’ పాటకు డాన్స్ వేయాలంటూ కోరేవారు. ఆమె కూడా కాదనకుండా స్టెప్పులు వేసేది. అయితే ఇటీవల రష్మిక ఆన్ లైన్ లో తన అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్బంగా ‘సామి సామి’ పాట గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అదిరిపోయే రిప్లైలతో ఆకట్టుకుంది. 

రష్మిక ఇటు సినిమాలతో పాటు అటు సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలు అప్లోడ్ చేయడమే కాకుండా అప్పుడప్పుడు తన అభిమానులతో లైవ్ లో మాట్లాడుతుంది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధాలిస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల రష్మిక తన ఫ్యాన్స్ తో ఆన్ లైన్ లో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ సందర్భంగా ఓ అభిమాను ‘‘పుష్ప.. సినిమాలో ‘సామి సామి’ సాంగ్ కు మీతో కలసి డాన్స్ చేయాలనుంది’ అని అడిగితే ఆ ప్రశ్నకు రష్మిక తన స్టైల్ లో సమాధానమిచ్చింది. ‘సామి సామి’ పాటకు ఇక తాను డాన్స్ చేయనని బదులిచ్చింది. ఇప్పటికే ఈ పాటకు చాలా సార్లు డాన్స్ చేశానని, ఇలాగే చేస్తూపోతే తనకు వయసు పెరిగిన తర్వాత బ్యాక్ పెయిన్ రావడం ఖాయమని అంది. అయినా కలిసిన ప్రతీసారి ఇదే ఎందుకు అడుగుతారు, ఈసారి కొత్తగా చేద్దామని చెప్పింది. 

ఈ చిట్ చాట్ లో ఫ్యాన్స్ అడిగిన మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది రష్మిక. ‘మీ ఫేవరేట్ సౌత్ ఇండియన్ డిష్ ఏది’ అని అడిగితే రైస్ తో పాటు సాంబార్, పప్పు పెరుగు ఏదైనా ఇష్టమే అని, కానీ రైస్ మాత్రం తప్పనిసరి అనిచ చెప్పుకొచ్చింది. అలాగే ‘వారిసు’ సినిమా షూటింగ్ సమయం గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇక నెగిటివ్ కామెంట్లను ఎలా ఎదుర్కోవాలో మాట్లాడుతూ.. అపరిమితంగా ప్రేమ కురిపిస్తే నెగిటివిటీ మొత్తం పాజిటివ్ అయిపోతుందని చెప్పింది. ఇలా తన ఫ్యాన్స్ తో కాసేపు మచ్చటిస్తూ ఎంటర్టైన్ చేసింది. ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే.. ఆమె ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఈ మూవీ తో పాటు ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వం వహిస్తోన్న ‘యానిమల్’స సినిమాలో నటిస్తోంది. ఈ మూవీలో రణ్ బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.

Read Also: ఇండస్ట్రీలో నానికి పోటీనిచ్చే హీరో లేడట! ‘దసరా’ బాగా తీయలేదంటూ నేచురల్ స్టార్ వ్యాఖ్యలు

Published at : 23 Mar 2023 01:07 PM (IST) Tags: Rashmika Mandanna Rashmika Rashmika Movies Saami Saami Song

సంబంధిత కథనాలు

Shubman Gill Orange Cap: ఈ సీజన్‌కు ఆరెంజ్ క్యాప్ దాదాపు గిల్‌దే - మిగతా వారికి ఎంతో దూరంలో!

Shubman Gill Orange Cap: ఈ సీజన్‌కు ఆరెంజ్ క్యాప్ దాదాపు గిల్‌దే - మిగతా వారికి ఎంతో దూరంలో!

Full Bottle Teaser : బాలయ్య బాబు ఫ్యాన్ ఇక్కడ, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తా - 'ఫుల్ బాటిల్'లో సత్యదేవ్ చింపేశాడుగా 

Full Bottle Teaser : బాలయ్య బాబు ఫ్యాన్ ఇక్కడ, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తా - 'ఫుల్ బాటిల్'లో సత్యదేవ్ చింపేశాడుగా 

ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు

ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు

ఎన్టీఆర్‌తో ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్లు - వీరి కాంబినేషన్‌ అస్సలు బోరుకొట్టదు!

ఎన్టీఆర్‌తో ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్లు - వీరి కాంబినేషన్‌ అస్సలు బోరుకొట్టదు!

Miss Shetty Mr Polishetty - Dhanush : హతవిధీ - నవీన్ పోలిశెట్టికి ఛాన్స్ ఇవ్వని ధనుష్! 

Miss Shetty Mr Polishetty - Dhanush : హతవిధీ - నవీన్ పోలిశెట్టికి ఛాన్స్ ఇవ్వని ధనుష్! 

టాప్ స్టోరీస్

KCR Press Meet: ఎమర్జెన్సీని గుర్తుచేస్తున్న కేంద్రం, ఢిల్లీ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్

KCR Press Meet: ఎమర్జెన్సీని గుర్తుచేస్తున్న కేంద్రం, ఢిల్లీ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్

New Parliament Inauguration Live: కొత్త పార్లమెంట్ భవనం, సెంగోల్‌ను ప్రతిష్ఠించిన ప్రధాని నరేంద్ర మోదీ

New Parliament Inauguration Live: కొత్త పార్లమెంట్ భవనం, సెంగోల్‌ను ప్రతిష్ఠించిన ప్రధాని నరేంద్ర మోదీ

New Parliament Inauguration: కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఏమిటి, దానిని ఏ సమయంలో ప్రారంభిస్తారు, ఎవరికి ఆహ్వానం పంపారు? అన్నీ తెలుసుకోండి

New Parliament Inauguration: కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఏమిటి, దానిని ఏ సమయంలో ప్రారంభిస్తారు, ఎవరికి ఆహ్వానం పంపారు? అన్నీ తెలుసుకోండి

New Parliament Building Inauguration: కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి ఎవరు హాజరవుతున్నారు, ఎన్ని పార్టీలు నిరసన తెలుపుతున్నాయి

New Parliament Building Inauguration: కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి ఎవరు హాజరవుతున్నారు, ఎన్ని పార్టీలు నిరసన తెలుపుతున్నాయి