Brahmastra 2: పార్ట్-1కి పది రెట్లు ఉంటుంది - 'బ్రహ్మాస్త్ర 2' పై బిగ్ అప్డేట్ ఇచ్చిన రణ్ బీర్!
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటూ 'బ్రహ్మాస్త్ర' పార్ట్ 2 కి సంబంధించి పలు కీలకమైన అప్డేట్స్ అందించారు.
బాలీవుడ్లో రాబోయే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన 'బ్రహ్మాస్త్ర' పార్ట్ 2 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు రణబీర్ కపూర్. 'బ్రహ్మాస్త్ర 2' తో పాటు 'వార్ 2' గురించి కూడా మాట్లాడాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణ్ బీర్ ఈ విషయాలు పంచుకున్నారు. డీటెయిల్స్ లోకి వెళ్తే.. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'యానిమల్'(Animal). రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్లో విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే 'యానిమల్' సినిమా కోసం రణబీర్ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇందులో 'బ్రహ్మాస్త్ర పార్ట్ 2' గురించి కీలకమైన అప్డేట్స్ అందించారు. 'బ్రహ్మాస్త్ర 2' స్క్రిప్ట్ ని దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇప్పటికే సిద్ధం చేశారని, పార్ట్ వన్ తో పోలిస్తే 'పార్ట్ 2' 10 రెట్లు భారీగా ఉండేలా అనిపించిందని అన్నారు. వచ్చే ఏడాది చివర్లో లేక 2025 ఆరంభంలో 'బ్రహ్మాస్త్ర 2' షూటింగ్ మొదలవుతుందని ఈ సందర్భంగా రణబీర్ వెల్లడించారు." గత వారమే ఆయాన్ నాకు 'బ్రహ్మాస్త్ర 2' స్క్రిప్ట్ నెరేట్ చేశారు. పార్ట్ 2 కోసం ఆయన ఆలోచనలు, క్యారెక్టర్లు ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే పదిరెట్లు భారీగా ఉంటాయి. ప్రస్తుతం ఆయన 'వార్ 2' సినిమా కోసం పనిచేస్తున్నారు. 'వార్ 2' వచ్చే ఏడాది మధ్యలో పూర్తవుతుందని మేము ప్లాన్ చేసుకున్నాం. అందుకే వచ్చే ఏడాది చివర్లో లేక 2025 ప్రారంభంలో 'బ్రహ్మాస్త్ర 2' షూటింగ్ ప్రారంభిస్తాం. రైటింగ్ కు సంబంధించి ఇప్పటికే చాలా పనులు జరుగుతున్నాయి" అని అన్నారు.
అంతేకాకుండా గత ఏడాది విడుదలైన బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ పై వచ్చిన కొన్ని విమర్శల పై రణబీర్ స్పందిస్తూ.." సినిమాపై వచ్చిన కొన్ని విమర్శల గురించి మేము అర్థం చేసుకున్నాం. మూవీ లో ఏది బాగుంది, ఏది పనిచేయలేదు అనే విషయాలను తెలుసుకున్నాం. కొన్ని డైలాగ్స్ అలాగే శివ, ఈషా క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ మిస్ అయిందని కొందరు చెప్పారు. అన్నిటినీ పరిగణలోకి తీసుకుంటున్నాం. ఈసారి వాటిని రిపీట్ చేయకుండా అధిగమించేందుకు ప్రయత్నిస్తాం" అంటూ చెప్పుకొచ్చాడు రణబీర్ కపూర్.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర' పార్ట్ 1: శివ గత ఏడాది చివరిలో విడుదలైన విషయం తెలిసిందే. లెజెండరీ యాక్టర్ అమితాబచ్చన్, మౌని రాయ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో షారుక్ ఖాన్, నాగార్జున గెస్ట్ అపీరియన్స్ తో కట్టుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రూ.400 కోట్ల కలెక్షన్స్ ని అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఇక రణబీర్ 'యానిమల్' విషయానికొస్తే.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇందులో రణబీర్ ని ఊర మాస్ అవతార్ లో చూపించబోతున్నాడు రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్స్ బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : చికెన్ కబాబ్ ఫొటోలు చూస్తున్న బ్రాహ్మిణ్ అమ్మాయి - నయనతార కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్ చూశారా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial