Ram Pothineni Bull Fight : బోయపాటి సినిమాలో భారీ బుల్ ఫైట్ - ఇరగదీసిన రామ్
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రూపొందుతోన్న సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల చేశారు. సినిమాలోని బుల్ ఫైటింగ్ సీనులో లుక్ అది! ఆ ఫైట్ భారీగా ఉండబోతుంది.
దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు భారీగా ఉంటాయ్. ఊర మాస్ యాక్షన్ తీయడంలో ఆయన తర్వాతే ఎవరైనా! 'సింహా', 'లెజెండ్' నుంచి 'సరైనోడు', 'జయ జానకి నాయక', 'అఖండ' సినిమాల్లో ఫైట్స్ ఎలా ఉన్నాయో ప్రేక్షకులు చూశారు.
ఇప్పుడు యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni)తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు బోయపాటి శ్రీను. ఇటీవల సినిమాలో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దసరా సందర్భంగా అక్టోబర్ 20న సినిమా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫస్ట్ లుక్ చూస్తే... దున్నపోతును రామ్ లాక్కుని వెళుతున్నట్లు ఉంటుంది. అది సినిమాలో బుల్ ఫైటింగ్ సీనులోని స్టిల్ అని తెలిసింది.
ఒక్క ఫైట్ కోసం 11 రోజులు...
28 జెనరేటర్లు, పవర్ లైట్స్!
రామ్ పోతినేని, బోయపాటి శ్రీను సినిమా హైలైట్స్‌లో బుల్ ఫైటింగ్ సీన్ ఒకటి కానుందని తెలిసింది. పదకొండు రోజుల పాటు ఆ ఫైట్ తీశారట. దానికి భారీ ఖర్చు అయ్యిందని, నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని టాక్.
Ram Bull Fight Action Sequence : బుల్ ఫైటింగ్ యాక్షన్ సీక్వెన్సు కోసం భారీ లైట్స్ ఉపయోగించారు. హైదరాబాదులోని ఓ ప్రయివేట్ స్టూడియోలో ఆ సీన్ తీశారు. షూటింగ్ చేసేటప్పుడు లైట్స్ కోసం పవర్ కావాలి కదా! వాటికి 28 జెనరేటర్లు అవసరం అయ్యాయని, స్టూడియోలో అన్ని లేకపోవడంతో బయట నుంచి చాలా తెప్పించారని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
View this post on Instagram
ఐటమ్ సాంగ్ కోసం కూడా...
సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంది. అందులో రామ్ (Ram Urvashi Rautela Song)తో ఊర్వశి రౌటేలా స్టెప్పులు వేశారు. ఆ సాంగ్ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. దాని కోసం పవర్ లైట్స్ ఉపయోగించారని తెలిసింది. బడ్జెట్, క్వాలిటీ అవుట్ పుట్ విషయంలో యూనిట్ కాంప్రమైజ్ కావడం లేదు. సంక్రాంతి హిట్ 'వాల్తేరు వీరయ్య' సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో ఇంట్రడక్షన్ సాంగులో ఊర్వశి డ్యాన్స్ చేశారు.
Also Read : వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
ఈ సినిమాలో రామ్ జోడీగా యంగ్ సెన్సేషన్, కొత్త హీరోయిన్ శ్రీలీల (Sreeleela) నటిస్తున్నారు. 'పెళ్లి సందడి'తో తెలుగు తెరకు పరిచయమైన ఆమె, ఆ తర్వాత రవితేజ 'ధమాకా'తో భారీ హిట్ అందుకున్నారు. అలాగే, చాలా అవకాశాలు కూడా! ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. 'అఖండ' తర్వాత మరోసారి తమన్, బోయపాటి కాంబినేషన్ రిపీట్ అవుతోంది.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. 'ది వారియర్' తర్వాత రామ్ తో ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎడిటర్ : తమ్మిరాజు, సినిమాటోగ్రాఫర్ : సంతోష్ డిటాకే.
Also Read : గన్నులు, బుల్లెట్లు, బాంబులతో వస్తున్న వెంకటేష్ ‘సైంధవ్’ - రిలీజ్ డేట్ ఫిక్స్!