News
News
వీడియోలు ఆటలు
X

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

మణిరత్నం మాగ్నమ్ ఓపస్ ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ బుధవారం విడుదల అయింది.

FOLLOW US: 
Share:

Ponniyin Selvan 2 Trailer: మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ సిరీస్‌లో రెండో భాగం ఏప్రిల్ 28వ తేదీన విడుదల కానుంది. చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శోభిత ధూళిపాళ, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ప్రభు, విక్రమ్ ప్రభు, జయరాం, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్ రాజ్ ... ఇలా లెక్క లేనంత స్టార్లతో ఈ సినిమా నిండిపోయింది. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం చెన్నైలో విడుదల చేశారు.

మొదటి భాగం ఎక్కడ ముగిసిందో రెండో భాగం సరిగ్గా అక్కడే మొదలు కానుంది. సముద్రంలో జరిగే ఫైట్‌తో ఈ ట్రైలర్ ప్రారంభించారు. వారసుడు అయిన ‘అరుల్‌మొళి వర్మన్ (జయం రవి)’ చనిపోయాడని భావించి రాజ్యాన్ని రెండు ముక్కలు చేయాలనే ఆలోచనలో ఉంటారు. చోళ రాజు అయిన ‘అరుల్‌మొళి వర్మన్’ను చంపామనుకుని పాండ్యులు ‘ఆదిత్య కరికాలుడు (విక్రమ్)’ని కూడా చంపాలని ప్లాన్ వేస్తారు. దీని తర్వాత జరిగే పర్యవసనాల నేపథ్యంలో సినిమా ఉండనుందని ఒక క్లారిటీ ఇచ్చారు.

మొదటి భాగంలో రెండో పార్ట్‌లోనే యుద్ధ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తుంది. కీలక తారాగణం అయిన చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శోభిత ధూళిపాళ, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ప్రభు, విక్రమ్ ప్రభు, జయరాం, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్ రాజ్ అందరినీ ట్రైలర్‌లో చూపించారు. థీమ్ మ్యూజిక్ మొదటి భాగం తరహాలోనే ఉంది.

తమిళం మొదటి భాగం బ్లాక్‌బస్టర్ సక్సెస్ అయినప్పటికీ, మిగతా భాషల్లో ఆశించిన స్థాయి స్పందన రాలేదు. పాత్రల పేర్లే అర్థం కాలేదని, సినిమా బాగా స్లోగా ఉందని కామెంట్లు వినిపించాయి. మరి రెండో భాగానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో చూడాలి.

‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాపై ముందు నుంచీ అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా మొదటి భాగం భారీ వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 450 కోట్లకు పైగానే వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. అంతే కాదు కేవలం ఒక్క తమిళ్ లోనే 200 కోట్లకు పైగా రాబట్టింది. తమిళనాడులో 200 కోట్లు సాధించిన మొదటి సినిమాగా నమోదైంది. ఈ సినిమాను దర్శకుడు మణిరత్నం ఎక్కువ శాతం తమిళ నేటివిటీతోనే తెరకెక్కించడంతో అక్కడ మాత్రం భారీ వసూళ్లు సాధించింది. మిగతా చోట్ల అంతగా ఆకట్టుకోలేకపోయింది. చాలా చోట్ల మిక్సిడ్ టాక్ రావడంతో ఆ ప్రభావం సినిమా కలెక్షన్స్ పై పడింది. అలాగే ఈ సినిమాపై కొన్ని చోట్ల మిశ్రమ స్పందన రావడంతో చాలా మంది థియేటర్లకు వెళ్లి చూడలేదు.

‘పొన్నియిన్ సెల్వన్’ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. ఈ చిత్రానికి ఓటీటీలో మాత్రం మంచి స్పందన వచ్చింది. చాలా రోజులు ప్రైమ్ వీడియోలో దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లో నిలిచిందీ మూవీ. కాగా, మొదటి పార్ట్ లో చిన్న చిన్న లోపాలు ఉండటం వలన సినిమాకు మొదట్లో కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది.

Published at : 29 Mar 2023 10:08 PM (IST) Tags: Maniratnam Vikram Aishwarya Rai Bachchan Ponniyin Selvan Telugu Trailer Ponniyin Selvan 2 Trailer PS2 Telugu Trailer

సంబంధిత కథనాలు

Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు

Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు

Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్‌ తండ్రి ఆవేదన!

Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్‌ తండ్రి ఆవేదన!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

NTR In Rest Mode : 'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?

NTR In Rest Mode : 'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి