Saindhav: గన్నులు, బుల్లెట్లు, బాంబులతో వస్తున్న వెంకటేష్ ‘సైంధవ్’ - రిలీజ్ డేట్ ఫిక్స్!
వెంకటేష్, శైలేష్ కొలనుల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సైంధవ్’ డిసెంబర్ 22వ తేదీన విడుదల కానుంది.
Saindhav Release Date: వెంకటేష్, శైలేష్ కొలనుల కాంబినేషన్‌లో ‘సైంధవ్’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. క్రిస్మస్ సందర్భంగా 2023 డిసెంబర్ 22వ తేదీన ‘సైంధవ్’ విడుదల కానుంది.
రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కోసం ప్రత్యేకమైన పోస్టర్‌ను విడుదల చేశారు. ప్లాస్టిక్ ఎక్స్‌ప్లోజివ్స్ బాంబ్స్ సెట్ చేసిన కంటెయినర్ పైన చేతిలో ‘Koch HK416’ మెషీన్ గన్‌తో, ఒంటి నిండా గాయాలతో వెంకీ కూర్చుని ఉండటం చూడవచ్చు. వెంకటేష్ పక్కన జిలెటిన్ స్టిక్స్ కూడా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ను చూస్తే పోర్టులో జరుగుతున్న యాక్షన్ ఎపిసోడ్‌లో స్టిల్ అని అర్థం అవుతోంది.
ఇటీవలే విడుదల అయిన 'సైంధవ్' టైటిల్ గ్లింప్స్‌లో వెంకీ మామ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చాలా రాగా తన ఏజ్ కి తగ్గట్లుగా చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. చాలా మంది గ్లింప్స్ చూశాక కమల్ హాసన్ 'విక్రమ్' స్టైల్ లో దర్శకుడు శైలేష్ కొలను ఏదో చేస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఇచ్చిన బీజీఎం కూడా 'విక్రమ్' టెంప్లేట్ ను గుర్తు చేస్తోంది. శైలేష్ కొలను, వెంకటేష్... ఇద్దరూ ఎలాగో కమల్ హాసన్ ఫ్యాన్స్ కాబట్టి అలా అనుకోవటంలో తప్పులేదు. కానీ, గ్లింప్స్ ను జాగ్రత్తగా గమనిస్తే శైలేష్ మూడు క్లూలు వదిలాడు.
జాగ్రత్తగా గ్లింప్స్ గమనిస్తే... వెంకటేష్ బైక్ మీద ఉన్న ఓ బాక్స్ దగ్గరకు వెళతారు. ఆ బాక్స్ మీద ఓ సింబల్ ఉంది. దానికింద Genezo అని రాసి ఉంది. ఈ సింబల్ కు అర్థం ఏంటీ అంటే అది జీన్ సింబల్. అంటే ఇది జన్యువుల మీద వర్క్ చేసే కంపెనీకి సంబంధించిన మెడిసిన్ బాక్స్.
ఆ తర్వాత ఆ బాక్స్ ను ఓపెన్ చేసి ఓ లిక్విడ్ పైప్ ను తీసి చేత్తో పట్టుకుంటారు వెంకటేష్. దాని మీద కూడా ఈ కంపెనీ పేరుతో పాటు ఓనాసెమ్నోజీన్ అబేపార్వోవేక్ అని రాసి ఉంది. ఇందేటా అని ఆరా తీస్తే తేలింది ఏంటంటే... SMA అంటే Spine Muscular Atrophy అనే మోటార్ న్యూరాన్ డిసీజ్ కు వాడే జీన్ థెరపీ మెడికేషన్ అన్నమాట.
అసలు ఎవరీ సైంధవ్? అంటే... మహాభారతం ప్రకారం కౌరవులకు చెల్లెలైన దుశ్శలకు భర్త. అంటే... దుర్యోధనుడికి భావ. సైంధవుడికి శివుడు ఓ వరం ఇస్తాడు. అర్జునుడు తప్ప మిగిలిన పాండవులను అవసరమైనప్పుడు సైంధవుడు అడ్డుకోగలడు. ఆ వరంతోనే అర్జుణుడిని ఏమార్చి... అభిమన్యుడిని పద్మ వ్యూహంలోకి రప్పిస్తారు. అప్పుడు మిగిలిన పాండవులను సైంధవుడు అడ్డుకుంటే... అభిమన్యుడిని పద్మ వ్యూహంలో హతమారుస్తారు కౌరవులు. 'సైంధవుడిలా అడ్డుపడుతున్నాడు' అనే సామెతను ఇప్పటికీ తెలుగు జనాలు వాడుతూ ఉంటారు.
అటువంటి నెగిటివ్ క్యారెక్టర్ పేరు టైటిల్ రోల్ కు ఎందుకు పెట్టారు? వెంకటేష్ పాత్రలో గ్రే షేడ్స్ చూపిస్తారా? లేదా సైంధవుడు అందరికీ ఎలా అయితే అడ్డు పడగలడో? అలా ఎవరినైనా ఎదిరించి అడ్డుపడగలిగే క్యారెక్టర్ ఉన్నవాడు కాబట్టి వెంకటేష్ సినిమాకు ఆ పేరు పెట్టారా? వెయిట్ అండ్ సీ!