By: ABP Desam | Updated at : 01 Apr 2023 10:24 AM (IST)
అల్లు అర్జున్
'పుష్ప' సినిమా (Pushpa Movie) విడుదలైనప్పుడు ఎవరూ ఊహించలేదు. నార్త్ ఇండియాలో జనాలను ఆ సినిమా అంతలా ఆకట్టుకుంటుందని! తెలుగులో కంటే హిందీలో 'పుష్ప'కు ఎక్కువ లాభాలు వచ్చాయి. ఆ మాటకు వస్తే 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలైనప్పుడు ఎవరైనా విదేశీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఊహించారా? లేదు కదా! థియేటర్లలోనే కాదు, ఓటీటీలోనూ 'ఆర్ఆర్ఆర్'కు విదేశాల నుంచి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇప్పుడు తెలుగు సినిమాలకు డిమాండ్ పెరుగుతోంది.
'పుష్ప 2' డిజిటల్ రైట్స్ 200 కోట్లు?
'ఆర్ఆర్ఆర్' తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ ఉన్న తెలుగు సినిమా 'పుష్ప 2'. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ భారీ సక్సెస్ సాధించడం... రెండో పార్ట్ మీద అంచనాలు పెంచింది. ఆ క్రేజ్ ఓటీటీ రైట్స్ విషయంలో కనబడుతోంది. 'పుష్ప 2' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం 200 కోట్ల రూపాయలు కోట్ చేస్తున్నారట. అంత భారీ మొత్తం అయినా సరే ఇచ్చి, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ తీసుకోవాలని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ట్రై చేస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)కు మంచి వ్యూస్, సబ్‌స్క్రిప్షన్స్ రావడంలో 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ హెల్ప్ అయ్యింది. ఆ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ దృష్ట్యా 'పుష్ప 2' మీద దృష్టి సారించారు. ఆ సినిమాకు కూడా సేమ్ రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నారట.
'పుష్ప 2'... అంతకు మించి!
ఆల్రెడీ 'పుష్ప 2' షూటింగ్ స్టార్ట్ చేశారు. కొన్ని రోజులు హైదరాబాదులో, విశాఖలో కీలక సన్నివేశాలు షూటింగ్ చేశారు. హీరోయిన్ రష్మిక సైతం ఫిబ్రవరిలో కొన్ని రోజులు షూటింగ్ చేశారట. 'పుష్ప' కంటే 'పుష్ప 2' మరింత బావుంటుందని రష్మిక తెలిపారు. మైండ్ బ్లోయింగ్ అన్నారు. అంతే కాదు... ''ఒకవేళ మీరు సూపర్ స్టార్ అయితే అదే కథ అని చాలా మంది ఫీల్ అవుతారు. కానీ, సుకుమార్ సార్ రాసిన స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది. ఫస్ట్ పార్ట్ కంటే అంతకు మించి అనేలా సెకండ్ పార్ట్ ఉంటుంది. దట్స్ సమ్‌థింగ్ ఫ్యాబులస్. వావ్ అనేలా ఉంటుంది. ఆల్రెడీ నటీనటులు అందరూ 'పుష్ప' చేయడం వల్ల... తాము ఎటువంటి ప్రపంచంలో ఉంటున్నామనేది వాళ్ళకు తెలుసు. సో... ఈసారి నటనలో మరింత ఇంటెన్సిటీ ఉంటుంది'' అని రష్మిక చెప్పారు. రష్మిక మాటలతో ఐకాన్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
Also Read : గోపికమ్మ... ఎల్లువొచ్చి గోదారమ్మ... ఇప్పుడు బతుకమ్మ - బుట్ట బొమ్మ హిట్ సాంగ్స్!
కథ వినకుండా అల్లు అర్జున్ 'పుష్ప' ఓకే చేశాడని '18 పేజెస్' సినిమా వేడుకలో సుకుమార్ చెప్పారు. అంతే కాదు... ''ఐదు రోజులు 'పుష్ప 2' షూట్ చేశాం. అల్లు అర్జున్ ఎంత అద్భుతంగా నటిస్తున్నాడంటే... చిన్న చిన్న డీటెయిల్స్ పట్టుకుని ఒక్కో ఎక్స్‌ప్రెషన్ కోసం అతను ఎంతో కష్టపడుతున్నాడు. నేను ఎప్పుడూ, ఏ సినిమా గురించి చెప్పను గానీ'' అంటూ 'పుష్ప 2'కు ఆకాశమే హద్దు అన్నట్టు పైకి వేలు చూపించారు. 'పుష్ప 2'లో అస్సలు తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ చెప్పారు.
ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil), అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), సునీల్ తదితరులు 'పుష్ప 2'లో కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులోనూ రష్మిక హీరోయిన్. 'పుష్ప' విడుదలైన తర్వాత 'తగ్గేదే లే' పాపులర్ అయ్యింది. ఇప్పుడు 'అస్సలు తగ్గేదే లే' అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : హమ్మయ్యా, మహేష్ బాబుకు కొంచెం రెస్ట్ ఇస్తున్న త్రివిక్రమ్!
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!
ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి
రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!
వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..
YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్
Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?