News
News
వీడియోలు ఆటలు
X

Mahesh Babu Vacation : హమ్మయ్యా, మహేష్ బాబుకు కొంచెం రెస్ట్ ఇస్తున్న త్రివిక్రమ్!

ఎప్పుడూ లేని విధంగా నిర్విరామంగా మహేష్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ జరుగుతోంది. సితార, నమ్రత విదేశాలకు వెళ్లినా సరే... మహేష్ ఇండియాలో ఉండి షూటింగ్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఆయన రెస్ట్ తీసుకోనున్నారు.

FOLLOW US: 
Share:

సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas) కలయికలో ఓ మాంచి మాస్ యాక్షన్ సినిమా రూపొందుతోంది. జనవరిలో చిత్రీకరణ మొదలు పెడితే... ఒకటి రెండు రోజులు రెస్ట్ తీసుకోవడం, వీకెండ్స్ హాలిడేస్ తప్ప షూటింగుకు బ్రేకులు వేయలేదు. పని చేస్తూ ఉన్నారు.

కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా మహేష్, త్రివిక్రమ్ నిర్విరామంగా చిత్రీకరణ చేస్తూ ఉన్నారు. సాంగ్స్ మినహా సినిమాలో మెజారిటీ టాకీ పార్ట్, భారీ యాక్షన్ సీన్లు చాలా వరకు తీసేశారు. పాటల కోసం విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, అంత కంటే ముందు మహేష్ బాబు ఓసారి విదేశాలు వెళ్లి రావాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. 

త్రివిక్రమ్ సినిమాకు రెండు వారాలు బ్రేక్!
త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ నుంచి మహేష్ బాబు రెండు వారాలు బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. వేసవిలో విదేశాలకు వెళతారట. ప్రస్తుతం మహేష్ భార్య నమ్రత, కుమార్తె సితార విదేశాల్లో ఉన్నారు. పారిస్ ట్రిప్ వేశారు. వాళ్ళతో మహేష్ బాబు జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

తండ్రి కృష్ణ జయంతికి మహేష్ సినిమా టైటిల్!
సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు తండ్రి, దివంగత సూపర్ స్టార్ కృష్ణ మే 31న జన్మించారు. ప్రతి ఏడాది ఆ రోజున తన కొత్త సినిమాకు సంబంధించి ఏదో ఒక కబురు చెప్పడం మహేష్ బాబుకు అలవాటు. అది ఆనవాయితీగా వస్తోంది. 

ఈ ఏడాది కృష్ణ జయంతి (Krishna Death Anniversary)కి త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న తాజా సినిమా టైటిల్ (SSMB 28 Title) అనౌన్స్ చేయాలని మహేష్ చెప్పారట. దాంతో అప్పటి వరకు టైటిల్ రివీల్ చేయవద్దని నిర్మాత నాగవంశీ చిత్ర బృందానికి చెప్పారట. 'అయోధ్యలో అర్జునుడు', 'అతడే తన సైన్యం', 'అమరావతికి అటు ఇటు' వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, అవి ఏవీ కావని... కొత్త టైటిల్ వైపు మహేష్, త్రివిక్రమ్ చూస్తున్నారని యూనిట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 

సంక్రాంతి హిట్ సెంటిమెంట్! 
'ఒక్కడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'సరిలేరు నీకెవ్వరు'... సంక్రాంతికి వచ్చిన మహేష్ బాబు సినిమాలు ఘన విజయాలు అందుకున్నాయి. 'అల వైకుంఠపురములో' సినిమాతో త్రివిక్రమ్ సైతం సంక్రాంతికి హిట్ అందుకున్నారు. ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను సృష్టించింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ సంక్రాంతికి వస్తున్నారు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Also Read : గోపికమ్మ... ఎల్లువొచ్చి గోదారమ్మ... ఇప్పుడు బతుకమ్మ - బుట్ట బొమ్మ హిట్ సాంగ్స్!

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'మహర్షి' తర్వాత మరోసారి మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో మరో కథానాయికగా శ్రీలీల నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. నవీన్ నూలి ఎడిటర్ కాగా... ఎఎస్ ప్రకాష్ కళా దర్శకత్వం వహిస్తున్నారు. 

Also Read : బాలీవుడ్‌కు కాజల్ భారీ పంచ్ - సౌత్‌తో కంపేర్ చేస్తూ గాలి తీసేసిందిగా!

Published at : 01 Apr 2023 09:47 AM (IST) Tags: Mahesh Babu Trivikram SSMB 28 Update Mahesh Summer Vacation

సంబంధిత కథనాలు

రజనీకాంత్‌తో కమల్ హాసన్ సినిమా - నిర్మాతగా బాధ్యతలు!

రజనీకాంత్‌తో కమల్ హాసన్ సినిమా - నిర్మాతగా బాధ్యతలు!

Dheekshith Shetty : ధరణి ఫ్రెండ్ సూరిగాడికి తెలుగులో ఇంకో వెబ్ సిరీస్ - ఈసారి కాలేజీ పోరగాడిగా!

Dheekshith Shetty : ధరణి ఫ్రెండ్ సూరిగాడికి తెలుగులో ఇంకో వెబ్ సిరీస్ - ఈసారి కాలేజీ పోరగాడిగా!

Daggubati Abhira: టాలెంట్ లేకే ఇన్నాళ్లు సినిమాల్లోకి రాలేదు: దగ్గుబాటి అభిరామ్

Daggubati Abhira: టాలెంట్ లేకే ఇన్నాళ్లు సినిమాల్లోకి రాలేదు: దగ్గుబాటి అభిరామ్

అప్పుడేం మాట్లాడలేదు, ఇప్పుడెలా నమ్మాలి : కమల్ హాసన్‌కు సింగర్ చిన్మయి కౌంటర్

అప్పుడేం మాట్లాడలేదు, ఇప్పుడెలా నమ్మాలి : కమల్ హాసన్‌కు సింగర్ చిన్మయి కౌంటర్

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

SSMB28 Mass Strike : మహేష్ బాబు 'మాస్ స్ట్రైక్'కు ముహూర్తం ఫిక్స్ - ఏ టైంకు అంటే?

టాప్ స్టోరీస్

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారం 

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారం 

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

Wrestlers Protest: పతకాలను గంగానదిలో పారేసి, ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్న రెజ్లర్లు!

Wrestlers Protest: పతకాలను గంగానదిలో పారేసి, ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్న రెజ్లర్లు!