SJ Surya: 'ఖుషీ 2' ఎప్పుడు? ఎస్‌జే సూర్యకు ప్రియాంక మోహన్ ఆసక్తికర ప్రశ్న - ఆయన రియాక్షన్ ఏంటంటే..!
Kushi 2: సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఖుషీ 2 ఎప్పుడు తీస్తున్నారంటూ నేరుగా ఎస్‌జే సూర్యను ప్రశ్నించింది ప్రియాంక మోహన్. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Priyanka Mohan Ask SJ Surya About Kushi 2: న్యాచులర్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ ఆరుళ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'సరిపోదా శనివారం'. ఆగస్టు 29న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మూవీ టీం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నాని, హీరోయిన్ ప్రియాంక, నటుడు ఎస్‌జే సూర్య పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్‌లో ఓ ఆసక్తిర సంఘటన చోటుచేసుకుంది. పవన్ స్టాన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరి తరపున ఎస్‌జే సూర్యను ఆమె ఆసక్తికర ప్రశ్న సంధించారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రలో హాట్‌టాపిక్‌గా నిలిచింది.
ఇంతక ప్రియాంక మోహన్ అడిగిన ఆ ప్రశ్న ఎంటంటే.. ఎస్ జే దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమికలు హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఖుషీ'. 2001లో విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీలో హిట్‌గా కొట్టింది. పవన్ కెరీర్‌లోనే ఖుషీ ఓ మైలుస్టోన్‌గా నిలిచింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడమే కాదు క్లాసికల్ హిట్ సినిమాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మైలుస్టోన్ మూవీ అయ్యింది. అప్పట్లో ఖుషీ మూవీ యువతను బాగా ఆకట్టుకున్న ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ అంతా ఆశ పడుతున్నారు. మూవీ వచ్చి ఇన్నేళ్లయినా 'ఖుషీ 2' కోసం ఇప్పటికీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు తరచూ ఎస్‌జే సూర్యకు దీనిపై ప్రశ్న ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇదే ప్రశ్నను ప్రియాంక మోహన్ ఎస్‌జే సూర్యను మరోసారి ప్రశ్నించారు.
మళ్లీ డైరెక్షన్ ఎప్పుడు చేస్తారు?
'సరిపోదా శనివారం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రియాంక మాట్లాడుతూ... "సూర్య సర్ మిమ్మల్ని ఒకటి అడగాలి. ఇది పవన్ కళ్యాణ్ సర్ ఫ్యాన్స్ అందరి తరపున అడుగుతున్నా. మళ్లీ ఎప్పుడు డైరెక్షన్ చేస్తారు. మళ్లీ మేం ఖుషీ 2 సినిమాను ఆశించవచ్చా. ప్లీజ్ ఖుషి 2 చేస్తే మాత్రం మళ్లీ మీరు పవన్ కల్యాణ్ సర్‌తోనే చేయండి. ఎందుకంటే ఇది క్లాసిక్ ఫిలిం" అని చెప్పింది. ప్రియాంక మోహన్ అలా అడుగుతున్నంతసేపు ఎస్‌జే సూర్య గట్టిగా నవ్వుతూనే ఉన్నారు. కానీ ఆమె మాటలకు మాత్రం ఆయన ఏలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో ఇప్పుడంతా ఖుషీ 2 చిత్రం కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రియాంక ఫ్యాన్స్ అందరి తరపున ఖుషీ 2 మూవీ గురించి అడగడంతో ఆమెకు థ్యాంక్స్ చెబుతున్నారు.
కాగా కొంతకాలంగా ఎస్‌జే సూర్య దర్శకత్వం పక్కన పెట్టి నటుడిగా ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. ప్రతికథానాయకుడి పాత్రలో ఆడియన్స్‌ని అలరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. సరిపోదా శనివారం ఆయన విలన్‌గా కనిపించనున్నారు. ఇందులో క్రూరమైన పోలీసు ఆఫీసర్‌గా ఎస్‌జే సూర్య ప్రతికథానాయకుడిగా తన విలక్షణ నటనతో అలరించబోతున్నారు. ఇదిలా ఉంటే ప్రియాంక మోహన్ ఈ చిత్రంతో పాటు తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన ఓజీలో నటిస్తున్న సంగతి తెలిసింది. పవన్ సరసన ఆమె హీరోయిన్‌గా నటించనుంది. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. త్వరలోనే ఆయన తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నట్టు ఇటీవల డైరెక్టర్ శంకర్ తెలిపారు.
Also Read: పొలిటిషియన్ కుమారుడితో హీరోయిన్ మేఘా ఆకాష్ పెళ్లి - సైలెంట్‌గా నిశ్చితార్థం, ఇంతకి వరుడు ఎవరంటే..!