కిరణ్ అబ్బవరం, రహస్యల పెళ్లి ఫొటోలు చూశారా? టాలీవుడ్ నటులు హీరో కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ పెళ్లితో ఒక్కటయ్యారు. వీరిద్దరు గురువారం రాత్రి కర్ణాటకలోని కూర్గ్‌లో పెళ్లి చేసుకున్నారు. కూర్గ్‌లోని ఓ రిసార్ట్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి పెళ్లి జరిగింది. కిరణ్, రహస్యలకు అభిమానులు, టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కిరణ్, రహస్యాలు ‘రాజావారు రాణిగారు’ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు. అయితే, ఇరువురి పెద్దల అంగీకారం తర్వాతే కిరణ్, రహస్య పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కిరణ్ ప్రస్తుతం పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ ‘క’లో నటిస్తున్నాడు.