Megha Akash: పొలిటిషియన్ కుమారుడితో హీరోయిన్ మేఘా ఆకాష్ పెళ్లి - సైలెంట్‌గా నిశ్చితార్థం, ఇంతకి వరుడు ఎవరంటే..!
Megha Akash Engagement: నితిన్ హీరోయిన్ మేఘా ఆకాష్ సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆలస్యంగా షేర్ చేసింది.ప్రస్తుతం ఆమె నిశ్చితార్థం ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Megha Akash Engaged With Boyfriend: టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ పెళ్లి పీటలు ఎక్కబోతోంది. సైలెంట్ నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఈ శుభవార్తను ఆలస్యంగా ప్రకటించింది మేఘా. ఎంగేజ్‌మెంట్ కు సం బంధించిన ఫోటోలను శనివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఎంగేజ్‌మెంట్ జరిగినట్టు ప్రకటించింది. దీంతో ఆమె ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. మేఘా ఆకాష్ తన ప్రియుడు సాయి విష్ణుని నిశ్చితార్థం చేసుకన్నట్టు సమాచారం.
ఇక రెండు రోజుల క్రితమే నిశ్చతార్థం చేసుకున్న మేఘా పెళ్లికి ఇండస్ట్రీ ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు కూడా ఇస్తుంది. తాజాగా ఆమె సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి స్వయంగా కాబోయే భర్తతో వెళ్లి పెళ్లి ఆహ్వానించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సడెన్‌గా మేఘా ఆకాష్ పెళ్లి కబురు చెప్పడంతో అభిమానులు, నెటిజన్లు సర్‌ప్రైజ్ అవుతున్నారు.
కాబోయే వరుడు ఎవరంటే..
మేఘా ఆకాష్ తన ప్రియుడు సాయి విష్ణుతో ఏడుడుగులు వేయబోతుంది. ఆరేళ్లుగా వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారట. సాయి విష్ణు ఓ పొలిటిషియన్ కొడుకు అని సమచారం. వచ్చే నెలలలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మేఘా ఆకాష్ కాబోయే భర్తతో కలిసి ఇండస్ట్రీ ప్రముఖులకు స్వయంగా ఇన్వీటేషన్ ఇస్తుంది. కాగా తెలుగు అమ్మాయి అయిన మేఘా ఆకాశ్ నటిగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. హీరోయిన్‌గా గ్లామరస్ పాత్రలు చేసింది. లేడీ ఒరియంటెడ్ రోల్స్ చేసి నటిగా మంచి గుర్తింపు పొందింది. 2017లో నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన 'లై' చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరోసారి నితిన్‌తోనే మళ్లీ 'చల్ మోహనరంగా' చిత్రంతో జోడికట్టింది.
View this post on Instagram
ఈ సినిమా తన గ్లామర్, నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ, ఆమె ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాకపోవడంతో తమిళ సినిమాలవైపు దృష్టి పెట్టింది. రెండు భాషల్లోనూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసింది. తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేసింది. అలా కోలీవుడ్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేట’ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత తమిళంలో వరుసగా 'వందా రాజావాదాన్ వరువేన్', 'ఎన్నై నోక్కిపాయుం తోట్టా', 'వడకుపట్టి రామస్వామి','బూమరాంగ్' వంటి హిట్ చిత్రాల్లో నటించింది. రీసెంట్‌గా విజయ్ ఆంటోని 'తుఫాన్' సినిమాలో అలరించిన మేఘ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలకు సంతకం చేసినట్టు సమాచారం.
Also Read: నెల రోజుల్లోపే ఓటీటీకి వస్తున్న అల్లు శిరీష్ 'బడ్డీ' మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..!