అన్వేషించండి

Buddy OTT: నెల రోజుల్లోపే ఓటీటీకి వస్తున్న అల్లు శిరీష్‌ 'బడ్డీ' మూవీ - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..!

Buddy OTT Release: అల్లు శిరీష్‌ 'బడ్డీ'మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుంది. ఈ సినిమా విడుదలైన నెల రోజుల లోపే ఈ సినిమా డిజిటల్‌ ప్రీమియర్‌కు రావడంతో ఓటీటీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Allu Sirish Buddy OTT Release and Streaming Date Fix: అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ తనయడిగా, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సోదరుడిగా ఇండస్ట్రీలో హీరో అడుగుపెట్టాడు అల్లు శిరీష్. కానీ, హీరోగా అతడి కెరీర్ ఆశించిన విధంగా లేదని చెప్పాలి. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో వస్తున్నా ఆమె పెద్దగా ఆదరణ పొందడం లేదు. చివరిగా 'ఏబీసీడీ', 'ఊర్వశివో రాక్షసివో' సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారాయి. దీంతో లాంగ్‌ గ్యాప్ తీసుకున్న శిరీష్‌ సరికొత్త కాన్సెప్ట్‌తో బడ్డీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ముందు నుంచి ఈ మూవీ విడుదల విషయంలో ఆటంకాలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. కానీ, ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్‌ అందుకోలేకపోయింది. థియేటర్లో విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాకు ప్రేక్షకాదరణ లేకపోవడంతో తక్కువ టైంలోనే థియేటర్ల నుంచి వెనుతిరిగింది. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్‌ ప్రీమియర్‌కు రెడీ అయ్యింది. అది కూడా విడుదలైన నెల రోజుల లోపే ఈ సినిమా ఓటీటీకి వస్తుండటం గమనార్హం.

ఆ రోజు నుంచి స్ట్రీమింగ్

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ బడ్డీ ఓటీటీ రైట్స్‌ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ ఢిల్‌ జరిగింది. థియేట్రికల్‌ రిలీజ్‌ ముందే బడ్డీని డిజిటల్‌ రైట్స్‌ దక్కించుకున్నట్టు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటన కూడా ఇచ్చేసింది. మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యింది. దీంతో ఒప్పందం ప్రకారం బడ్డీని ఓటీటీలో రిలీజ్‌ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్‌ సిద్ధమైంది. ఆగస్టు 30వ తేదీని నుంచి  ఈ సినిమాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు తాజాగా ప్రకటన ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్‌. కాగా మూవీ విడుదటైన నెల రోజుల లోపే ఈ సినిమా డిజిటల్‌ ప్రీమియర్‌ వస్తుండటంతో డిజిటల్‌ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

సరికొత్త కథతో 

శామ్ ఆంటోన్ దర్శకత్వంలో యాక్షన్ ప్యాకెడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా 'బడ్డీ' సినిమా తెరకెక్కింది. ఇందులో శిరీష్‌ సరసన గాయత్రి భరద్వాజ్‌, ప్రిషా రాజేష్‌ సింగ్‌లు హీరోయిన్లుగా నటించారు. అజ్మల్ అమీర్ కీలక పాత్ర పోషించగా.. ముఖేష్ కుమార్, కమెడియన్‌ అలీ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాలో ఒక టెడ్డీ బేర్ కీలక పాత్రలో కనిపించడంతో మూవీపై అంచనాలు నెలకొన్నాయి. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మించారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన ఈ చిత్రానికి కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించారు. ప్రముఖ డీవోపీ ఆర్ సెంథిల్ టెడ్డీకి ఆర్ట్ డైరెక్టర్ గా, రూబెన్ ఎడిటర్ గా వర్క్ పనిచేశారు. 

Also Read: నేను సెలబ్రిటీ మాత్రమే - పబ్లిక్‌ ప్రాపర్టీని కాదు - ఫోటోగ్రాఫర్లతో గొడవపై స్పందించిన తాప్సీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
Telangana Wineshops: తెలంగాణ‌లో నిలిచిపోయిన మ‌ద్యం స‌ర‌ఫ‌రా, అసలేం జరిగిందంటే!
తెలంగాణ‌లో నిలిచిపోయిన మ‌ద్యం స‌ర‌ఫ‌రా, అసలేం జరిగిందంటే!
Sai Durgha Tej: అలాంటి కామెంట్స్ దారుణం! సోషల్ మీడియాను తగలబెట్టేస్తా - ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో తేజ్  
అలాంటి కామెంట్స్ దారుణం! సోషల్ మీడియాను తగలబెట్టేస్తా - ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో తేజ్  
Bitcoin Price: బిట్‌కాయిన్‌కు బూస్ట్ ఇచ్చిన ట్రంప్ - ఒక్కరోజులోనే ఆల్ టైమ్ రికార్డ్!
బిట్‌కాయిన్‌కు బూస్ట్ ఇచ్చిన ట్రంప్ - ఒక్కరోజులోనే ఆల్ టైమ్ రికార్డ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Elon Musk Key Role Donald Trump Win | ట్రంప్ విజయంలో కీలకపాత్ర ఎలన్ మస్క్ దే | ABP DesamTrump Modi Friendship US Elections 2024 లో ట్రంప్ గెలుపు మోదీకి హ్యాపీనే | ABP DesamUsha Chilukuri vs Kamala Harris |  Donald Trump విక్టరీతో US Elections లో తెలుగమ్మాయిదే విక్టరీ | ABP DesamUsha Vance Chilukuri on Donald Trump Win | US Elections 2024 లో ట్రంప్ గెలుపు వెనుక తెలుగమ్మాయి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక లేనట్లే - రఘురాజు అనర్హత రద్దు చేసిన హైకోర్టు
Telangana Wineshops: తెలంగాణ‌లో నిలిచిపోయిన మ‌ద్యం స‌ర‌ఫ‌రా, అసలేం జరిగిందంటే!
తెలంగాణ‌లో నిలిచిపోయిన మ‌ద్యం స‌ర‌ఫ‌రా, అసలేం జరిగిందంటే!
Sai Durgha Tej: అలాంటి కామెంట్స్ దారుణం! సోషల్ మీడియాను తగలబెట్టేస్తా - ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో తేజ్  
అలాంటి కామెంట్స్ దారుణం! సోషల్ మీడియాను తగలబెట్టేస్తా - ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ లో తేజ్  
Bitcoin Price: బిట్‌కాయిన్‌కు బూస్ట్ ఇచ్చిన ట్రంప్ - ఒక్కరోజులోనే ఆల్ టైమ్ రికార్డ్!
బిట్‌కాయిన్‌కు బూస్ట్ ఇచ్చిన ట్రంప్ - ఒక్కరోజులోనే ఆల్ టైమ్ రికార్డ్!
Honda Activa: రూ.10 వేలు కట్టి యాక్టివా కొనేయచ్చు - నెలవారీ ఈఎంఐ ఎంత?
రూ.10 వేలు కట్టి యాక్టివా కొనేయచ్చు - నెలవారీ ఈఎంఐ ఎంత?
AP Cabinet: ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు ఆమోదం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లుకు ఆమోదం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
US New President Donald Trump: మిత్రమా! ప్రజల కోసం కలిసి పని చేద్దాం; ట్రంప్‌నకు మోదీ ట్వీట్, ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ
మిత్రమా! ప్రజల కోసం కలిసి పని చేద్దాం; ట్రంప్‌నకు మోదీ ట్వీట్, ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ
Vasamsetti Subhash: చంద్రబాబు తిడతారు, అవసరమైతే కొడతారు: తనకు సీఎం క్లాస్‌పై మంత్రి వాసంశెట్టి సుభాష్‌
చంద్రబాబు తిడతారు, అవసరమైతే కొడతారు: తనకు సీఎం క్లాస్‌పై మంత్రి వాసంశెట్టి సుభాష్‌
Embed widget