Priyanka Jawalkar : హీరోయిన్ ఇమేజ్ వాడుకున్నారు, కానీ ప్రమోషన్స్‌కి పిలవలేదు... 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' మూవీ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన ప్రియాంక జవాల్కర్
Priyanka Jawalkar : 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' మూవీలో హీరోయిన్‌గా నటించిన ప్రియాంక జవాల్కర్ తాజాగా ఈ సినిమా వివాదంపై స్పందించారు. ప్రమోషన్స్‌కి తనను ఎవ్వరూ పిలవలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

తెలుగు అమ్మాయి ప్రియాంక జవాల్కర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' మూవీ వివాదంపై స్పందించింది. అప్పట్లో తనను ఎవ్వరూ ప్రమోషన్స్ కోసం పిలవలేదని, తనకసలు ప్రమోషన్స్ గురించి తెలియకపోవడంతో అటెండ్ కాలేదని వెల్లడించింది.
'ఎస్ఆర్ కళ్యాణ మండపం' కాంట్రవర్సీపై క్లారిటీ
తెలుగు చిత్ర సీమలో తెలుగమ్మాయిలు చాలా తక్కువ అని చెప్పాలి. అందులోనూ ఫేమ్, నేమ్ వచ్చాక కూడా ఆశించిన అవకాశాలు రాని హీరోయిన్ల లిస్టులో ప్రియాంక జవాల్కర్ కూడా ఉన్నారు. షార్ట్ ఫిలిమ్స్‌తో హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన ఈ బ్యూటీ.. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'ట్యాక్సీవాలా' సినిమాతో హీరోయిన్‌గా టర్న్ తీసుకుంది. ఈ మూవీ హిట్ కావడంతో ఆ తర్వాత పలు అవకాశాలు ఆమె ఇంటి తలుపుతట్టాయి. అనంతరం 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' మూవీతో మంచి హిట్టును తన ఖాతాలో వేసుకుంది ఈ అమ్మడు. ఇక ఇటీవల 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషించింది. ఈ మూవీ సక్సెస్ కావడంతో తాజాగా ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో తన సినిమాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. అందులో భాగంగానే 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' మూవీ కాంట్రవర్సీ గురించి కూడా స్పందించింది.
ఇంటర్వ్యూలో "ప్రతి సినిమాలోనూ మీకు ఒక సాంగ్ వర్కౌట్ అవుతుంది. ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీలో సాయికుమార్ ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేయడం, కిరణ్ అబ్బవరం హీరోగా నటించడం వంటి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. కట్ చేస్తే 'ట్యాక్సీవాలా' హీరోయిన్ అని చెప్పి ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా చేశారు. మీ ఇమేజ్‌ని బాగా యూజ్ చేసుకున్నారు. కానీ ప్రమోషన్స్‌లో మీరు కనిపించలేదు. ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ ప్రమోషన్ టైమ్‌లో మీరు ఎందుకు కనిపించలేదు?" అని ప్రశ్నించగా... ప్రియాంక స్పందిస్తూ "నాకు సరిగ్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాలేదు. కాబట్టి నేను సాంగ్స్, అవి ఇవి... ప్రమోషన్స్‌లాగా ఏవో జరుగుతున్నాయి అనుకున్నాను. పిలిస్తే ప్రమోషన్స్‌కి వెళ్ళేదాన్ని. వాళ్ళు ఎప్పుడు పిలిచారంటే సినిమా రిలీజ్ అయ్యి, సక్సెస్ అయ్యాక పిలిచారు. ముందు ఇంటర్వ్యూస్‌కి పిలవలేదు అని ఫీలయ్యాను. ఇక రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యాక పిలిచినా పాయింట్ ఏంటి? అని అనిపించింది. కాల్ అయితే వచ్చింది కానీ చాలా ఆలస్యంగా... అది కూడా మూవీ ఆహాలో రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఆహా వాళ్లు అడిగిన ప్రమోషన్స్ కోసం అనుకుంటా" అంటూ క్లారిటీ ఇచ్చింది.
ఆ ఒక్క హోప్ నన్ను నడిపిస్తుంది
ఇక ప్రియాంక తన కెరీర్లో ఇంత భారీ గ్యాప్ రావడానికి గల కారణం ఏంటో కూడా వివరించింది."రియాల్టీ ఏంటంటే... ఇది చెయ్ అని నాకు ఒకరు చెప్పలేదు. నా పర్సనల్ ఛాయిస్. నిజానికి ఇంత ఇంత గ్యాప్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ప్రతిరోజూ ఆశే నన్ను నడిపిస్తుంది. అలాగని కాంప్రమైజ్ అయ్యి, ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తానా అంటే అస్సలు చేయను. అలాంటప్పుడు కొన్నిసార్లు ఏడుస్తాను. కొన్నిసార్లు బ్యాడ్‌గా ఫీల్ అవుతాను మరికొన్నిసార్లు హోప్‌తో అలా నడుస్తుంది. ఒకవేళ మధ్యలో గివ్ అప్ ఇచ్చి ఉంటే మ్యాడ్ స్క్వేర్ వచ్చి ఉండేది కాదేమో. ఈ మూవీ కలెక్షన్స్ నేను నటించిన అన్ని సినిమాలు కంటే ఎక్కువగా ఉన్నాయి" అంటూ గివ్ అప్ ఇవ్వొద్దని చెప్పుకొచ్చింది.





















