అన్వేషించండి

Pranam Devaraj Telugu Debut : తెలుగు తెరకు కన్నడ వారసుడు - హీరోగా ప్రణం దేవరాజ్

Vairam Teaser : ప్రముఖ నటుడు దేవరాజ్ తనయుడు ప్రణవ్ దేవరాజ్ తెలుగు తెరకు హీరోగా పరిచయం కానున్నారు. ఆయన 'వైరం' సినిమా టీజర్ నేడు విడుదలైంది.

కన్నడ నటుడు అయిన దేవరాజ్(Actor Devaraj) తెలుగు చిత్రాల్లోనూ నటించారు. మెగాస్టార్ చిరంజీవి 'ఎస్పీ పరశురామ్', నట సింహం బాలకృష్ణ 'బంగారు బుల్లోడు', 'సమరసింహారెడ్డి', కింగ్ నాగార్జున 'నేటి సిద్ధార్థ', గోపీచంద్ 'యజ్ఞం', 'లక్ష్యం' సినిమాల్లో నటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అనే నేను'లో ప్రతిపక్ష పార్టీ నేత పాత్రలో కనిపించారు. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకంటే... దేవరాజ్ తనయుడు తెలుగు తెరకు హీరోగా పరిచయం అవుతున్నారు.

దేవరాజ్ తనయుడు ప్రణం దేవరాజ్ (Pranam Devaraj) తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'వైరం' (Vairam Movie). సాయి శివం జంపాన దర్శకత్వం వహించారు. యువాన్స్ నాయుడు సమర్పణలో శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి పిక్చర్, సంస్కృతి ప్రొడక్షన్స్, సర్తాక్ పిక్చర్స్ పతాకాలపై జె. మల్లికార్జున నిర్మిస్తున్నారు. సినిమా కార్యక్రమాలు అన్నీ పూర్తి అయ్యాయి. కాశీ విశ్వనాథ్, బెనర్జీ టీజర్ విడుదల చేశారు. శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి సంస్థ లోగోను దేవరాజ్, చంద్ర దేవరాజ్ ఆవిష్కరించారు.

నా కుమారుడినీ ఆదరించండి - దేవరాజ్
''తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు. ఇప్పుడు హీరోగా వస్తున్న నా కుమారుడిని, ఈ సినిమా అదే విధంగా ఆదరించాలని కోరుకుంటున్నా. కన్నడలో టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. తెలుగు టీజర్ సైతం బాగుంటుందని చెబుతున్నారు. సంతోషంగా ఉంది. KGFలో నటించిన 'గరుడ' రామ్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినందుకు సంతోషంగా ఉంది. త్వరలో విడుదల కానున్న సినిమాను సైతం ఆదరించాలని కోరుకుంటున్నా'' అని దేవరాజ్ చెప్పారు. ''నా తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదు. తెలుగు ప్రేక్షకులు మా నాన్న దేవరాజ్ గారిని ఆదరించినట్టు... 'వైరం'తో నన్నూ ఆదరించాలని కోరుకుంటున్నా'' అని హీరో ప్రణం దేవరాజ్ చెప్పారు. 

తెలుగు, కన్నడ ద్విభాషా చిత్రమిది
''దర్శకుడు సాయి చెప్పిన కథ నచ్చడంతో దేవరాజ్ గారికి చెప్పాం. కథపై నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చిన ఆయనకు, ప్రణం దేవరాజ్ గారికి థాంక్స్. సినిమా బాగా వచ్చింది. త్వరలో సినిమాను విడుదల చేస్తాం'' అని చిత్ర నిర్మాత జె. మల్లికార్జున అన్నారు. ''తెలుగులో, కన్నడలో... రెండు భాషల్లో తీసిన ద్విభాషా చిత్రమిది. ప్రణం దేవరాజ్ హీరోగా నటించడం సంతోషంగా ఉంది. 'గరుడ' రామ్  ఈ సినిమా చేస్తారా? లేదా? అనుకున్నా. ఆయనకు కథ నచ్చి చేశారు. అందరి సహకారంతో సినిమా బాగా వచ్చింది'' అని చిత్ర దర్శకుడు సాయి శివన్ జంపాన చెప్పారు.

Also Read : 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ : నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల 'పాప' ఎలా ఉందంటే?

Pranam Devaraj Telugu Debut : తెలుగు తెరకు కన్నడ వారసుడు - హీరోగా ప్రణం దేవరాజ్ 
ప్రణం దేవరాజ్, మోనల్ జంటగా, విన్ను మద్ది పాటి, 'గరుడ' రామ్, కాశీ విశ్వనాథ్, శత్రు, 'చమ్మక్' చంద్ర, భద్రం తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కూర్పు : అజయ్ ఎం కుమార్, కళ : రవి కుమార్ ఎం, ఛాయాగ్రహణం : సామల భాస్కర్, సహ నిర్మాతలు : అరిపిరాల కళ్యాణ్ శాస్త్రి, శీలం త్రివిక్రమ్ రావు, సంగీతం : మహతి స్వర సాగర్, నిర్మాత : జె. మల్లికార్జున, దర్శకుడు : సాయి శివన్ జంపాన.

Also Read : అమెరికా నుంచి ఢిల్లీకి రామ్ చరణ్, అభిమానుల ఘన స్వాగతం

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Emmanuel: హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్... శ్రీ సత్యతో రొమాన్స్... లవ్ సాంగ్ 'ఇద్దరి గుండెలపైన' లిరిక్స్
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్... శ్రీ సత్యతో రొమాన్స్... లవ్ సాంగ్ 'ఇద్దరి గుండెలపైన' లిరిక్స్
Friday OTT Movies : శుక్రవారం ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్ - ఓటీటీల్లో ఈ మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్ - ఓటీటీల్లో ఈ మూవీస్ డోంట్ మిస్
Ruku Ruku Rukmini Song Lyrics: 'రుక్కు రుక్కు' సాంగ్ లిరిక్స్... నితిన్ 'అలియాస్ రుక్మిణి'లో మెలోడీ - పూర్ణాచారి ఏం రాశారంటే?
'రుక్కు రుక్కు' సాంగ్ లిరిక్స్... నితిన్ 'అలియాస్ రుక్మిణి'లో మెలోడీ - పూర్ణాచారి ఏం రాశారంటే?
Gondhal Telugu Trailer Review : ఒక్క రాత్రిలో నవ వధువు ఊహించని వ్యూహం? - తెలుగులో వచ్చేస్తోన్న ఆస్కార్ ఎంట్రీ 'గోంధళ్'... ట్రైలర్ చూశారా?
ఒక్క రాత్రిలో నవ వధువు ఊహించని వ్యూహం? - తెలుగులో వచ్చేస్తోన్న ఆస్కార్ ఎంట్రీ 'గోంధళ్'... ట్రైలర్ చూశారా?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget