Prabhas Kalki Trivia: 'కల్కి'తో తండ్రి కల నెరవేర్చిన ప్రభాస్ - ఆగిపోయిన సినిమా టైటిల్‌తోనే హిట్!
Is Kalki Shelved?: ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' ఇండియన్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటి. కల్కి టైటిల్‌తో ప్రభాస్ కంటే ముందు ఆయన తండ్రి ఓ సినిమా స్టార్ట్ చేశారు. అది ఏమైందో తెల్సా?

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. రూ. 1100 కోట్ల కలెక్షన్స్‌తో తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 'బాహుబలి 2' తర్వాత ప్రభాస్ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా కల్కి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే కల్కి సినిమాతో తన తండ్రి సూర్యనారాయణ రాజు (Prabhas Father Uppalapati Surya Narayana Raju) కలను ప్రభాస్ నెరవేర్చాడు. అది ఎలాగో తెలుసా?
ప్రభాస్ తండ్రి నిర్మాణంలో 'కల్కి'...
మధ్యలో ఆగిన సినిమా - ఎందుకంటే?
'కల్కి' టైటిల్‌తో 1989 - 90 టైమ్‌లో ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు ఓ సినిమా నిర్మించాలని ప్లాన్ చేశారు. కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో ప్రయోగాత్మకంగా 'కల్కి' చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నారు. కే రాఘవేంద్ర రావుతో పాటు పలువురి వద్ద సుదీర్ఘ కాలం కో డైరెక్టర్‌గా పనిచేసిన సునీల్ వర్మకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. అప్పటికే సంగీత దర్శకుడిగా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోన్న కీరవాణికి మ్యూజిక్ డైరెక్టర్‌గా కల్కి మూవీతో ఇండస్ట్రీకి పరిచయం చేయాలని సూర్యనారాయణ రాజు భావించారు. ఆయన్ను సంగీత దర్శకుడిగా ఫిక్స్ చేశారు. నటీనటుల ఎంపిక పూర్తయ్యింది. కొంత భాగం షూటింగ్ జరిగిన తర్వాత కల్కి ఆగిపోయింది.
'కల్కి' సినిమాను పూర్తి చేయాలని ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ ఫలించలేదు. దాంతో ఆ చిత్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆగిపోయిన తన తండ్రి సినిమా టైటిల్‌తో ప్రభాస్ సినిమా చేయడమే కాకుండా హిట్టు కూడా కొట్టారు. అలా తండ్రి కలను ప్రభాస్ నెరవేర్చాడు. 'కల్కి'తో పరిచయం కావాల్సిన కీరవాణి చివరకు 'మనసు మమత'తో మ్యూజిక్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. సునీల్ వర్మ కూడా... 'ఆత్మ బంధం'తో పాటు మరికొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు.
Also Read: 'కాంత' రివ్యూ: దుల్కర్ vs సముద్రఖని... మధ్యలో భాగ్యశ్రీ, రానా - మహానటి రేంజ్‌లో ఉందా?
కృష్ణం రాజు సోదరుడైన సూర్యనారాయణ రాజు ఉప్పలపాటి 'బొబ్బిలి బ్రహ్మన్న', 'తాండ్ర పాపారాయుడు', 'త్రిశూలం', 'మనవూరి పాండవులు'తో పాటు పలు సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఎక్కువగా కృష్ణంరాజుతోనే సినిమాలు నిర్మించారు. సూర్యనారాయణ రాజు 2010లో కన్ను మూశారు.
ప్రీ ప్రొడక్షన్ పనుల్లో 'కల్కి 2'
'కల్కి 2898 ఏడీ'లో భైరవ పాత్రలో తన నటన, కామెడీ టైమింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లతో ప్రభాస్ అదరగొట్టారు. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ వంటి లెజెండ్స్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు ప్రభాస్. 'కల్కి 2898 ఏడీ'కి సీక్వెల్ కూడా రాబోతుంది. 2026లో ఈ సీక్వెల్ సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 ఉన్నాయి. అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే.
Also Read: కార్తీక దీపం సీరియల్ దర్శకుడితో పవన్ కళ్యాణ్ సినిమా - అనౌన్స్ చేశారు కానీ...





















