అన్వేషించండి

PKSDT Title & First Look : టైమ్ వచ్చేసింది 'బ్రో' - పవన్, సాయి తేజ్ ఫస్ట్ లుక్ రెడీ, రేపే రిలీజ్!

PK SDT movie titled BRO : పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా టైటిల్ రేపు అనౌన్స్ చేయనున్నట్లు తెలిపారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి ఓ సినిమా చేశారు. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఆ సినిమా టైటిల్ అనౌన్స్ చేయనున్నారు. అలాగే, ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయనున్నారు. 

పవన్... సాయి తేజ్... బ్రో!
PKSDT Title & First Look Tomorrow : పవన్ కళ్యాణ్, సాయి తేజ్ సినిమాకు 'బ్రో' టైటిల్ ఖరారు చేసినట్లు తెలిసింది. ఆ టైటిల్ రేపు (మే 18, బుధవారం) అనౌన్స్ చేయనున్నారు. 'టైమ్ వచ్చేసింది' అంటూ చిత్ర బృందం ఓ పోస్టర్ విడుదల అచ్చేసింది. 'బ్రో' టైటిల్ ఉంచుతారా? లేదంటే 'టైమ్' అని పెడతారా? అనేది రేపు చూడాలి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by People Media Factory (@peoplemediafactory)

ఆల్రెడీ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ గ్లింప్స్ ఇచ్చిన 'హై'లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఈ సినిమా లుక్ కోసం ఎదురు చూస్తున్నారు. 'ఉస్తాద్...', 'ఓజీ' సినిమాల కంటే ముందు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : 'ఆదిపురుష్' టీమ్ భయపడుతోందా? - ప్రభాస్ ఫ్యాన్స్‌లో భయం భయం!

జూలై 28న సినిమా విడుదల!
ప్రముఖ నటుడు, ఇంతకు ముందు తెలుగులో మాస్ మహారాజా రవితేజ 'శంభో శివ శంభో'కు దర్శకత్వం వహించిన సముద్రఖని 'బ్రో' మూవీకి దర్శకుడు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. జూలై 28న ఈ  చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేశారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన 'రొమాంటిక్' కథానాయిక కేతికా శర్మ (Ketika Sharma) కనిపించనున్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్ కీలక పాత్ర చేస్తున్నారు.

ఫిబ్రవరి 22న హైదరాబాదులో చిత్రీకరణ ప్రారంభించారు. ఈ సినిమాకు రోజుకు రెండు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు జనసేన పదవ వార్షికోత్సవ సభలో పవన్ తెలిపారు. ఈ సినిమాకు ఆయన 20 నుంచి 25 రోజులు షూటింగ్ చేశారని తెలిసింది. ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయ్యింది.

Also Read పూరి జగన్నాథ్ హర్టు - ఒక్క రూపాయి కూడా వెనక్కి ఇచ్చేది లేదట!

Vinodhaya Sitham Telugu remake title : కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది 'వినోదయ సీతమ్' సినిమాలో మెయిన్ కాన్సెప్ట్. తెలుగులో భగవంతుని పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా సాయి ధరమ్ తేజ్ నటించనున్నారు. పవన్ మోడ్రన్ దేవుడి పాత్ర చేయడం రెండోసారి. ఇంతకు ముందు 'గోపాల గోపాల'లో మోడ్రన్ శ్రీ కృష్ణుని పాత్ర చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కొంత సేపే ఉంటుంది. 

'వినోదయ సీతం' రీమేక్ కాకుండా... 'హరి హర వీర మల్లు', హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్ స్టర్' సినిమాలు పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాయి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న 'హరి హర వీర మల్లు' చిత్రీకరణ చాలా వరకు పూర్తి అయ్యింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget