News
News
వీడియోలు ఆటలు
X

Pawan Kalyan OG Update : పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్ డేట్ - ఓజీ షూటింగ్ ఫొటోలు వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. సుజీత్ డైరెక్షన్ లో వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'ఓజీ' మూవీ షూటింగ్ జెట్ స్పీడులో దూసుకుపోతోంది. దీనికి సంబంధించిన టెస్ట్ షూట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి..

FOLLOW US: 
Share:

Pawan Kalyan : చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) సెట్స్ పై కనిపించనున్నారు. ప్రస్తుతం నిమిషం గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ .. రీసెంట్ గా 'గబ్బర్ సింగ్' (Gabbar Singh) డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustad Bhagat Singh) సినిమా షూటింగ్ మొదలైంది. ఇక తాజాగా 'సాహో' (Sahoo) డైరెక్టర్‌ సుజీత్ (Sujeet) డైరెక్షన్ లో రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ 'ఓజీ' (OG) సంబంధించి ఓ సూపర్బ్ అప్ డేట్ వచ్చేసింది. 

'ఓజీ' సినిమా టెస్ట్ షూట్ లో  ప్రస్తుతం బిజీగా ఉందని సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేశారు. దీంతో ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఫొటోస్ షేర్ అవడంతో ఓజీ పనులు తెరవెనుక శరవేగంగా కంప్లీట్ అవుతున్నాయని తెలుస్తుంది. ఈ స్పూడులో పోతే.. 'ఓజీ' మూవీ షూటింగ్ త్వరలోనే పూర్తవనుంది. 

'ఓజీ' సినిమా కంటే ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు (Hari Hara Veeramallu)’ కు సైన్ చేశారు. సినిమా షూటింగ్ కూడా సగం వరకు కంప్లీట్ అయింది. కానీ ఆ తర్వాత కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మిగతా షూటింగ్ ఆగిపోయిందనే వార్తలు అప్పట్లో బాగా వినిపించాయి. దీని తర్వాత ‘వినోదయసిత్తం (Vinoda Sittam)’ అనే రీమేక్‌ మూవీకి పవన్ ఓకే చేశారు. ఓకే చేయడమే కాదు.. కేవలం 22 రోజుల డేట్స్ లోనే తన పార్ట్ షూట్ పూర్తి చేశారు. దాని తర్వాత ఏప్రిల్ 5న హరీష్ శంకర్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను పవన్ స్టార్ట్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోందని సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ ఇటీవలే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇక ఆ తర్వాతే పవన్ 'ఓజీ'కి ఓకే చేశారు. 

ఓ పక్క రాజకీయాలు, మరో పక్క సినిమాలతో బిజీగా గడుపుతున్న ఆయన.. లైనప్ లో ఉన్న మూవీస్ అన్నీ ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే.. ఫ్యాన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు పవన్. ఈ సమయంలోనే 'ఓజీ'కి సంబంధించిన అప్ డేట్ రావడంతో పవర్ స్టార్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో త్వరలోనే తమ అభిమాన హీరోను థియేటర్లలో చూస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read : మళ్ళీ ఫారిన్ టూర్ వేసిన రామ్ చరణ్, ఉపాసన - ఎక్కడికి వెళ్ళారంటే?

ఇదిలా ఉండగా పవన్ రాజకీయాల విషయానికొస్తే.. ఇటీవలే వరంగల్ నిట్ లో జరిగిన 'స్ప్రింగ్ స్ర్పీ' కార్యక్రమంలో హాజరయ్యారు. సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని... డబ్బు కోసమో, మరేదో కారణంతో కాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టంచేశారు. తాను కళాశాలలు, యూనివర్సిటీలకు వెళ్లకపోయినా నిత్య విద్యార్థినేనంటూ వ్యాఖ్యానించారు. ప్రతికూల పరిస్థితులను చూసి వెనకడుగు వేయొద్దని, నేడు విఫలమైనా రేపు తప్పకుండా గెలిచి తీరుతామంటూ హితవు చేశారు. పేటెంట్లు వచ్చినంత మాత్రాన ఆవిష్కరణ గొప్పది కాదన్న ఆయన.. సమాజానికి అది ఎంతవరకు మేలు చేస్తుందన్నదే ముఖ్యమంటూ పవన్ మాట్లాడారు. లక్షల మంది కలరా బాధితుల ప్రాణాలు నిలిపిన, నిలుపుతున్న ‘ఓఆర్‌ఎస్‌’ ద్రావణాన్ని కనుగొన్న డాక్టర్‌ దిలీప్‌ లాంటి వారు చేసిన ఆవిష్కరణలు గొప్పవని పవన్ స్పష్టంచేశారు.

Also Read : 'ఐ లవ్ యు ఇడియట్' రివ్యూ : తెలుగులో శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రిలీజ్ చేశారా?

Published at : 08 Apr 2023 04:20 PM (IST) Tags: Harish Shankar Pawan Kalyan OG Ustad Bhagat Singh Sujeet

సంబంధిత కథనాలు

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Adipurush: రూ.1000 కోట్ల క్లబ్ లో 5 ఇండియన్ సినిమాలు - 'ఆదిపురుష్'కి ఆ జాబితాలో చేరే ఛాన్స్ ఉందా?

Adipurush: రూ.1000 కోట్ల క్లబ్ లో 5 ఇండియన్ సినిమాలు - 'ఆదిపురుష్'కి ఆ జాబితాలో చేరే ఛాన్స్ ఉందా?

Korean Thrillers: ఈ కొరియన్ థ్రిల్లర్ సినిమాలను ఒక్కసారి చూస్తే చాలు, జీవితంలో మరిచిపోలేరు - ఓ లుక్ వేసేయండి

Korean Thrillers: ఈ కొరియన్ థ్రిల్లర్ సినిమాలను ఒక్కసారి చూస్తే చాలు, జీవితంలో మరిచిపోలేరు - ఓ లుక్ వేసేయండి

Nawazuddin Siddiqui: లీడ్ యాక్టర్స్‌తో కలిసి తింటుంటే, కాలర్ పట్టుకొని బయటకు లాక్కెళ్లారు - నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ

Nawazuddin Siddiqui: లీడ్ యాక్టర్స్‌తో కలిసి తింటుంటే, కాలర్ పట్టుకొని బయటకు లాక్కెళ్లారు - నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ

టాప్ స్టోరీస్

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?