By: Satya Pulagam | Updated at : 08 Apr 2023 04:33 PM (IST)
'ఐ లవ్ యు ఇడియట్' సినిమాలో శ్రీలీల (Image Courtesy : AHA OTT)
ఐ లవ్ యు ఇడియట్
లవ్ స్టోరీ, రొమాంటిక్
దర్శకుడు: ఏపీ అర్జున్
Artist: విరాట్, శ్రీ లీల, చిక్కన్న తదితరులు
సినిమా రివ్యూ : ఐ లవ్ యు ఇడియట్
రేటింగ్ : 1/5
నటీనటులు : విరాట్, శ్రీ లీల, చిక్కన్న, అవినాష్, దత్తన్న, గిరి, భార్గవి నారాయణ్ తదితరులు.
ఛాయాగ్రహణం : అర్జున్ శెట్టి
మాటలు : టి. నాగేందర్ (తెలుగులో)
పాటలు : పూర్ణాచారి (తెలుగులో)
సంగీతం : వి. హరికృష్ణ
నిర్మాత : సాయికిరణ్ బత్తుల
కథ, కథనం, దర్శకత్వం : ఏపీ అర్జున్
విడుదల తేదీ: ఏప్రిల్ 7, 2022
'పెళ్లి సందD'తో శ్రీలీల (Sreeleela) తెలుగు చిత్రసీమకు కథానాయికగా పరిచయం అయ్యారు. అయితే, అంతకు ముందు కన్నడలో రెండు సినిమాలు చేశారు. వాటిలో మొదటి సినిమా 'కిస్'. అందులో విరాట్ హీరో. ఆయనకు అదే మొదటి సినిమా. ఈ సినిమాను 'ఐ లవ్ యు ఇడియట్' పేరుతో డబ్బింగ్ చేశారు. ప్రస్తుతం తెలుగులో శ్రీలీలకు మంచి క్రేజ్ ఉంది. అందుకని, డబ్బింగ్ చేసినట్లు ఉన్నారు. ఆహా (AHA OTT) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ (I Love You Idiot Story) : నందిని (శ్రీలీల) తల్లిదండ్రులకు కాలేజీ నుంచి ఫోన్ వస్తుంది. క్లాసులు వినకుండా పగటి కలలు కంటూ అందర్నీ డిస్ట్రబ్ చేస్తుందని కంప్లైంట్ చేస్తారు. మరోసారి కంప్లైంట్ వస్తే కాలేజీ మాన్పిస్తానని తల్లి వార్నింగ్ ఇస్తుంది. ఇంటికి ఫోన్ చేసిన కాలేజీ ప్రిన్సిపాల్ మీద కోపంతో అతడి ఫ్లెక్సీ మీద రాయితో కొడుతుంది. ఆ రాయి వచ్చి తగలడంతో మల్టీ మిలియనీర్ అర్జున్ (విరాట్) కారు డ్యామేజ్ అవుతుంది. రిపేర్ కోసం నాలుగు లక్షలు ఇవ్వమని లేదంటే 72 రోజులు అసిస్టెంట్ ఉద్యోగం చేయమని చెబుతాడు. కంప్లైంట్ ఇస్తే ఎక్కడ కాలేజీ నుంచి మాన్పిస్తారోనని అసిస్టెంట్ జాబ్ చేయడానికి ఓకే అంటుంది. అర్జున్ ప్రవర్తన చూసి అతడిని పొగరుబోతు అనుకుంటుంది నందిని. అటువంటి అమ్మాయి అతడిని ఎందుకు ప్రేమించింది? అర్జున్ స్వయంగా వచ్చి ప్రపోజ్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేసింది? వాళ్ళిద్దరూ ఎలా ఒక్కటి అయ్యారు? మధ్యలో ఎన్ని జరిగాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (I Love You Idiot Movie Review) : రవితేజ 'ధమాకా'తో తెలుగులో కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో ఓ నాయికగా చేస్తున్నారు. రామ్, నితిన్, వైష్ణవ్ తేజ్ సరసన సినిమాలు చేస్తున్నారు. బాలకృష్ణ సినిమాలో ఆమెది కీలక పాత్ర. 'ఐ లవ్ యు ఇడియట్' చూశాక... తెలుగులో శ్రీలీల క్రేజ్ క్యాష్ చేసుకోవడానికి 'కిస్'ను డబ్బింగ్ చేశారేమో అనిపించింది.
'పెళ్లి సందD', 'ధమాకా'లో శ్రీలీల క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, గ్రేస్‌ఫుల్ డ్యాన్సుల కోసం మళ్ళీ మళ్ళీ చూసిన ప్రేక్షకులు ఉన్నారు. ఆ ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసమే 'కిస్'ను 'ఐ లవ్ యు ఇడియట్'గా డబ్ చేశారేమో అనిపిస్తుంది! యాక్టింగులో బేసిక్స్ రాని టైములో శ్రీలీల చేసిన చిత్రమిది. 'శ్రీలీల ఇలా చేసిందేంటి? ఆ ఎక్స్‌ప్రెషన్ ఏంటి?' అనుకుని జాలి పడటం తప్ప ఏమీ ప్రేక్షకులు ఏమీ చేయలేరు.
కొరియన్ సినిమా '100 డేస్ విత్ మిస్టర్ యారగెంట్' స్ఫూర్తితో చేసిన సినిమా 'ఐ లవ్ యు ఇడియట్'. కాన్సెప్ట్ పక్కన పెడితే... స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తెలుగు సినిమాల్లో వచ్చేసిన చాలా సీన్లు కనబడతాయి. మనకి చక్కిలిగింతలు పెట్టుకుంటే తప్ప కామెడీ సీన్లకు నవ్వలేం. గ్రాఫిక్స్ చూస్తే నవ్వు వస్తుంది. హీరో హీరోయిన్లు విరాట్, శ్రీలీలకు తొలి సినిమా కావడంతో యాక్టింగ్ సోసోగా ఉంది. కెమిస్ట్రీ అసలు సెట్ కాలేదు. హీరో విరాట్ పాత్రకు ఎవరు డబ్బింగ్ చెప్పారో గానీ చాలా అంటే చాలా బ్యాడ్! కొన్ని క్యారెక్టర్లకు డబ్బింగ్ అసలు సెట్ కాలేదు. కొన్ని విజువల్స్, అక్కడక్కడా కొన్ని సీన్లు మాత్రమే ఓకే అనిపిస్తాయి.
ప్రతి ప్రేమ కథలో కొన్ని సీన్లు సేమ్ అనిపిస్తాయి. అయితే, కథలో కాన్‌ఫ్లిక్ట్ ఉండాలి కదా! ఆకతాయిల నుంచి తనను హీరో కాపాడిన వెంటనే హీరోయిన్ ప్రేమలో పడటం, మనసులో ప్రేమ ఉన్నా పైకి కోపం నటించడం వంటి రొటీన్ సీన్లు కోకొల్లలు. హీరో ప్రపోజ్ చేసినప్పుడు రిజెక్ట్ చేయడానికి హీరోయిన్ చెప్పిన రీజన్ విన్నాక రెండు చేతులు జేబులో పెట్టుకుని కుర్చీ లోంచి లేచి వెళ్లిపోవాలని అనిపిస్తుంది. అసలు, అప్పటి వరకు ఎంత మంది చూస్తారో? ఒకవేళ ఎవరైనా చూస్తే గ్రేట్.
చివరగా చెప్పేది ఏంటంటే? : ఓటీటీలో విడుదలైంది కాబట్టి ఫార్వర్డ్ చేసుకుంటూ చూద్దామని 'ఐ లవ్ యు ఇడియట్' స్టార్ట్ చేసినా... విసుగు తెప్పించే చిత్రమిది. సారీ శ్రీలీల... వుయ్ హేట్ థిస్ ఇడియట్!
Also Read : 'రావణాసుర' రివ్యూ : మాస్ మహారాజా రవితేజ విలనిజం బావున్నా... ఎక్కడ తేడా కొట్టిందంటే?
టాప్-5 ఎంటర్‌టైన్మెంట్ న్యూస్ - ఈ రోజు మూవీ విశేషాలివే!
Samantha: ప్రియాంక చోప్రాకు తల్లిగా సమంత, ఇవిగో ఆధారాలు!
మాస్ లుక్‌లో మహేష్, ప్రభాస్‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!
World No Tobacco Day: ఇకపై ఓటీటీలోనూ ఆ యాడ్స్ ఉండాల్సిందే - కేంద్రం కీలక నిర్ణయం
అది గతం, ఆలోచిస్తూ కూర్చోకూడదు - ‘రానా నాయుడు’ విమర్శలపై స్పందించిన వెంకటేష్
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !