News
News
వీడియోలు ఆటలు
X

Ravanasura Movie Review - 'రావణాసుర' రివ్యూ : రవితేజ సినిమా ఎలా ఉందంటే?

Ravi Teja's Ravanasura Review In Telugu : రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన 'రావణాసుర' నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?

FOLLOW US: 
Share:

సినిమా రివ్యూ : రావణాసుర
రేటింగ్ : 2.25/5
నటీనటులు :రవితేజ, సుశాంత్, జయరామ్, శ్రీరామ్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు.
సినిమాటోగ్రఫీ : విజయ్ కార్తీక్ కన్నన్!
కథ, మాటలు : శ్రీకాంత్ విస్సా
సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో (డిక్కా డిష్యూం)
నిర్మాతలు : అభిషేక్ నామా, రవితేజ
కథనం, దర్శకత్వం : సుధీర్ వర్మ 
విడుదల తేదీ: ఏప్రిల్ 7, 2022

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటించిన తాజా సినిమా 'రావణాసుర'. ఫస్ట్ టైమ్ ఆయన నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేయడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. 'ధమాకా' వంటి సాలిడ్ కమర్షియల్ సక్సెస్ తర్వాత రవితేజ సోలో హీరోగా నటించిన చిత్రమిది. మధ్యలో 'వాల్తేరు వీరయ్య' విజయం ఉంది. అంచనాల నడుమ విడుదలైన 'రావణాసుర' (Ravanasura Review) ఎలా ఉంది?

కథ (Ravanasura Story) : క్రిమినల్ లాయర్ కనక మహాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా) దగ్గర రవీంద్ర (రవితేజ) జూనియర్. ఆయన దగ్గరకు హారిక (మేఘా ఆకాష్) వచ్చి తన తండ్రి కేసు టేకప్ చేయమని అడుగుతుంది. ఆమె ఓ పెద్ద ఫార్మా కంపెనీకి సీఈవో. రిసార్టులో ఓ వ్యక్తిని ఆమె తండ్రి మర్డర్ చేసిన వీడియోలతో సహా సాక్ష్యాలు ఉంటాయి. తాను ఆ మర్డర్ చేయలేదని, అసలు మర్డర్ జరిగిన రాత్రి తనకు ఏం జరిగిందో గుర్తు లేదని ఆయన (సంపత్ రాజ్) చెబుతాడు. నగరంలో అటువంటి మర్డర్స్ కొన్ని జరుగుతాయి. సిటీ కమిషనర్ హత్యకు గురి అవుతారు. హారికను రేప్ చేసి మర్డర్ చేస్తారు. వరుస హత్యల వెనుక ఉన్నది ఎవరు? పోలీసులు సాకేత్ (సుశాంత్) దగ్గరకు ఎందుకు వెళతారు? అతను ఎవరు? రెండు నెలల్లో రిటైర్ కానున్న ఏసీపీ హనుమంతురావు (జయరామ్) ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఆయనకు ఏం తెలిసింది? అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి.    

విశ్లేషణ (Ravanasura Movie Review) : ఇంకా క్లుప్తంగా కథను చెబితే... సిటీలో కొన్ని వరుస హత్యలు జరుగుతాయి. వాటిని ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది సినిమా. అంతకు మించి ఏం చెప్పినా స్పాయిలర్ అవుతుంది. దర్శకుడు సుధీర్ వర్మ అంత కంటే పెద్ద స్పాయిలర్ ట్రైలర్‌లో చెప్పారు. 'వాడు క్రిమినల్ లాయర్ కాదు... లా చదివిన క్రిమినల్' - ఈ ఒక్క డైలాగులో మొత్తం కథ ఉంది. అంతకు మించి ఏం చెప్పలేం!
  
'రావణాసుర' ప్రారంభం ఆసక్తిగా ఉంది. తొలుత కామెడీ సీన్లు ఓకే అనిపిస్తాయి. ఆ తర్వాత ఎవరు మర్డర్ చేస్తున్నారు? అనేది తెలిసిన తర్వాత దర్శకుడు సుధీర్ వర్మ కొన్ని సీన్లను బాగా డీల్ చేశారు. అయితే... ఒక్కటే డౌట్ కొడుతూ ఉంటుంది. మటన్ కొట్టినట్లు మర్డర్స్ చేయడం మరీ అంత ఈజీనా? అని! అసలు సినిమాలో స్టార్టింగ్ టు ఎండింగ్... ఎక్కడా లాజిక్స్ లేవు. ఇంటర్వెల్ తర్వాత మేజర్ ట్విస్ట్ రివీల్ చేస్తుంటే... ఇప్పటికే ఇటువంటి సినిమాలు తెలుగులో చాలా చూసేశామని అనిపిస్తుంది. రొటీన్ కథ, కథనం, సన్నివేశాలను దాటి మరీ స్క్రీన్ చూసేలా చేసిన క్రెడిట్ రవితేజది. ఆయన డిఫరెంట్ యాక్టింగ్, యాటిట్యూడ్ చూపించారు. 

సుధీర్ వర్మ సినిమాల్లో టైటిల్ సాంగ్స్, థీమ్ సాంగ్స్ బావుంటాయి. 'రావణాసుర' థీమ్ సాంగ్ దానిని పిక్చరైజ్ చేసిన విధానం బావుంది. భీమ్స్ మ్యూజిక్ అందించిన 'డిక్కా డిష్యూం' ఓకే. మిగతా పాటలు సోసోగా ఉన్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం ఓకే. విలనిజం చూపించే సన్నివేశాల్లో రీరికార్డింగ్ ఇరగదీశారు. సినిమాటోగ్రఫీ బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే.   

నటీనటులు ఎలా చేశారు? : రవితేజ అంటే హుషారు అంటుంటారు. విక్రమ్ సింగ్ రాథోడ్ లాంటి సీరియస్ రోల్స్, 'శంభో శివ శంభో' లాంటి సినిమాలో పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న రోల్స్ చేశారు. 'రావణాసుర'లో అయితే సీరియస్‌గా సాగే విలనిజాన్ని చూపించారు. తనదైన శైలి కామెడీ చేశారు. డ్యాన్సులు చేశారు. అయితే... హైలైట్ మాత్రం రవితేజ విలనిజమే! ఆయన నటన ముందు మిగతా ఆర్టిస్టులపై ప్రేక్షకుల చూపు అంతగా పడదు. ఉన్నంతలో రవితేజతో కొన్ని సీన్లలో 'హైపర్' ఆది, ఫరియా అబ్దుల్లా బాగా చేశారు. సుశాంత్ పాత్రకు స్టార్టింగులో ఇచ్చిన ఇంపార్టెన్స్ తర్వాత ఉండదు. అయితే, ఆయన స్టైలింగ్ బావుంది. పాత్ర పరిధి మేరకు నటుడిగా బాగా చేశారు. మేఘా ఆకాష్, అనూ ఇమ్మాన్యుయేల్, పూజితా పొన్నాడ, నవ్యా స్వామి తదితరులు ఉన్నారంటే ఉనాన్రన్తే! క్యారెక్టర్ ఆర్టిస్టుల తరహాలో కొన్ని సీన్లలో కనబడతారు. 

Also Read : మీటర్ రివ్యూ - కిరణ్ అబ్బవరం ఊర మాస్ ‘మీటర్’ ఎలా ఉంది? రీడింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుందా?

చివరగా చెప్పేది ఏంటంటే? : మాంచి యాక్షన్ థ్రిల్లర్ చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగించి... కాసేపటికి రొటీన్ కథను మీకు ఈ విధంగా చెప్పామని క్లారిటీ ఇచ్చి... అంత కంటే రొటీన్ క్లైమాక్స్ చూపించిన సినిమా 'రావణాసుర'. నటుడిగా రవితేజ హిట్టు. సినిమాయే డౌటే! 

Also Read : 'జాన్ విక్ 4' రివ్యూ : కీనూ రీవ్స్ హాలీవుడ్ సినిమా ఎలా ఉందంటే?

Published at : 07 Apr 2023 11:20 AM (IST) Tags: Ravi Teja ABPDesamReview Sudheer Varma  Ravanasura Movie Review Ravanasura Review Telugu

సంబంధిత కథనాలు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Nenu Student Sir Review: నేను స్టూడెంట్ సర్ రివ్యూ: ఈ స్టూడెంట్‌ను థియేటర్లలో చూడవచ్చా? ఆకట్టుకున్నాడా?

Nenu Student Sir Review: నేను స్టూడెంట్ సర్ రివ్యూ: ఈ స్టూడెంట్‌ను థియేటర్లలో చూడవచ్చా? ఆకట్టుకున్నాడా?

Chakravyuham Movie Review - 'చక్రవ్యూహం' రివ్యూ : ఆస్తి కోసం ఒకరు, ప్రేమ కోసం మరొకరు - మర్డర్ మిస్టరీలో దోషి ఎవరు?

Chakravyuham Movie Review - 'చక్రవ్యూహం' రివ్యూ : ఆస్తి కోసం ఒకరు, ప్రేమ కోసం మరొకరు - మర్డర్ మిస్టరీలో దోషి ఎవరు?

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?

Spiderman: Across The Spiderverse Review: స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్ రివ్యూ: యానిమేటెడ్ స్పైడర్ మ్యాన్ ఆకట్టుకున్నాడా? నిరాశ పరిచాడా?

Spiderman: Across The Spiderverse Review: స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్ రివ్యూ: యానిమేటెడ్ స్పైడర్ మ్యాన్ ఆకట్టుకున్నాడా? నిరాశ పరిచాడా?

టాప్ స్టోరీస్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Tom Holland  on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!