అన్వేషించండి

Meter Review: మీటర్ రివ్యూ: కిరణ్ అబ్బవరం ఊర మాస్ ‘మీటర్’ ఎలా ఉంది? రీడింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుందా?

కిరణ్ అబ్బవరం ‘మీటర్’ సినిమా ఎలా ఉంది?

సినిమా రివ్యూ : మీటర్
రేటింగ్ : 1.5/5
నటీనటులు : కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, సప్తగిరి, పోసాని కృష్ణమురళి తదితరులు
ఛాయాగ్రహణం : వెంకట్ సి దిలీప్, సురేష్ సరంగం
సంగీతం : సాయి కార్తీక్
నిర్మాత‌ : చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు
రచన, ద‌ర్శ‌క‌త్వం : రమేష్ కదూరి
విడుదల తేదీ : మార్చి 30, 2023

టాలీవుడ్‌లో చకచకా సినిమాలు చేసే యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ సంవత్సరం ఇప్పటికే ‘వినరో భాగ్యము వీర కథ’తో హిట్టు కొట్టిన కిరణ్ మరో రెండు నెలల్లో ‘మీటర్’ అంటూ ఫుల్ మాస్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా ట్రైలర్, టీజర్లను ఫుల్ మాస్ ‘మీటర్’ కనిపించేలా కట్ చేశారు. మరి కిరణ్ అబ్బవరం మాస్ అటెంప్ట్ ఎలా ఉంది? టాలీవుడ్‌లో యంగ్ మాస్ హీరోగా కిరణ్ అబ్బవరం మారాడా? ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది?

కథ: అర్జున్ కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం) తండ్రి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. కానిస్టేబుల్ గా పని చేస్తూ తన నిజాయితీ కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కుంటూ ఉంటాడు. కొడుకుని ఎస్సై చేయాలనేది ఆయన కల. కానీ అర్జున్ కి పోలీస్ అవ్వడం అసలు ఇష్టం ఉండదు. అనుకోకుండా సెలక్షన్ క్లియర్ చేసి ఎస్సై అయిపోతాడు అర్జున్. డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు డిస్మిస్ అవ్వాలా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా హోం మినిస్టర్ కంఠం బైరెడ్డితో (పవన్) అర్జున్ కళ్యాణ్‌కి క్లాష్ వస్తుంది. ఎలక్షన్స్‌లో అధికారంలోకి రావడానికి బైరెడ్డి చేసిన స్కామ్ ఏంటి? దాని వల్ల పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎలా ఎఫెక్ట్ అయింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: ప్రస్తుతం తెలుగులో మాత్రమే కాదు అన్ని భాషల్లోనూ హీరోలు మాస్ ఇమేజ్ మంత్రం జపిస్తున్నారు. కిరణ్ అబ్బవరం తన రెండో సినిమా ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ నుంచే ప్రతి సినిమాలోనూ అంతే ఇంతో మాస్ అప్పీల్ ఉండేలా చూసుకుంటున్నాడు. ‘మీటర్’ సినిమాతో ఈ మాస్ మీటర్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాడు. ప్రతి సీనూ ఎంట్రీ సీన్ లాగా, ప్రతి డైలాగ్‌లోనూ పంచ్‌లు, ప్రాసలు ఉండే చాలా జాగ్రత్త పడ్డారు. ‘మనం చదివేసిన బుక్ షెల్ఫ్‌లో ఉంటుందేమో కానీ అది ఇచ్చిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం చాలా హైలో ఉంటుంది.’ ఇలాంటి డైలాగులు అడుగడుగునా వినిపిస్తూనే ఉంటాయి.

సినిమాలో ఏమాత్రం కొత్తదనం లేకుండా చాలా జాగ్రత్తపడ్డారు. ఆవారాగా తిరిగే హీరో సడెన్‌గా పోలీస్ అవ్వడం, తన జీవితం మొత్తంలో అబ్బాయిలను అసహ్యించుకునే హీరోయిన్ ఒక్క పాటలోనే హీరోని లవ్ చేయడం, స్టేట్ సీఎంని కూడా వణికించే విలన్... హీరో ముందు పిల్లిలా మారిపోవడం ఇలా ఇప్పటికే చాలా సార్లు చూసేసిన సీన్లు ఇందులో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా క్లైమ్యాక్స్‌లో ట్రంప్, కిమ్ సెగ్మెంట్ చూశాక ఈ ఐక్యూ లెవల్స్ ఉన్న క్యారెక్టరైజేషన్లతో రెండు గంటల సినిమా తీశారా అనిపిస్తుంది.

సినిమా ఫస్టాఫ్ అంతా పోలీస్ అవ్వకుండా ఉండటానికి హీరో చేసే ప్రయత్నాలు, పోలీస్ అయ్యాక జాబ్ నుంచి డిస్మిస్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు, హీరోయిన్‌తో లవ్ ట్రాక్ ఇలా సాగుతుంది. ఒక ట్విస్ట్(?)తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇస్తారు. ఇక సెకండాఫ్‌లో హీరో, విలన్‌ల మధ్య ఫేస్ ఆఫ్ ఉంటుంది. ఇందులో కిరణ్ అబ్బవరం చేసిన యాక్షన్, ఎలివేషన్ సీన్లు ఇంతకు ముందు చాలా పెద్ద హీరోల సినిమాల్లో కూడా కనిపిస్తాయి. కానీ వాళ్లు కూడా ఇప్పుడు అలాంటి సీన్లు చేయకుండా మారుతున్న ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్లు సినిమాలు ఎంచుకుంటున్నారు. సినిమా నిడివి రెండు గంటల ఏడు నిమిషాలు మాత్రమే కావడం ప్లస్ పాయింట్.

సాయి కార్తీక్ సంగీతం అందించిన పాటల్లో ఒక్కటి కూడా ఆకట్టుకోదు. నేపథ్య సంగీతం కూడా సోసోగానే ఉంటుంది. వెంకట్ సి.దిలీప్, సురేష్ సరంగం సినిమాటోగ్రఫీ పర్లేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే... అర్జున్ కళ్యాణ్ పాత్రలో కిరణ్ అబ్బవరం అదరగొట్టాడు. ఇంతకు ముందు చేసిన సినిమాల కంటే మంచి ఎనర్జీ ఇందులో కనిపించింది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు విభిన్న కథలు ఎంచుకుంటే బాగుంటుంది. హీరోయిన్ అతుల్య రవి పాటలకే పరిమితం అయింది. నెగిటివ్ రోల్‌లో కనిపించిన పవన్ రొటీన్ విలనిజాన్నే చూపించాడు. హీరో తండ్రి పాత్ర చేసిన నటుడు చక్కగా చేశాడు. సప్తగిరి, పీఏ పాత్రలో కనిపించిన గోపిల కామెడీ అక్కడక్కడా ఆకట్టుకుంటుంది.

ఓవరాల్‌గా చెప్పాలంటే... కిరణ్ అబ్బవరం మీటర్‌లో మాస్ ఉన్నప్పటికీ, ఆడియన్స్ రేంజ్‌కు తగ్గ రీడింగ్‌ను రీచ్ అవ్వలేదు. కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా అయితే కాదు. ఓటీటీలో వచ్చాక ఓపిక ఉంటే చూడవచ్చు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget