News
News
వీడియోలు ఆటలు
X

Ram Charan Upasana : మళ్ళీ ఫారిన్ టూర్ వేసిన రామ్ చరణ్, ఉపాసన - ఎక్కడికి వెళ్ళారంటే? 

రామ్ చరణ్, ఉపాసన దంపతులు మళ్ళీ ఫారిన్ టూర్ వేశారు. ఈసారి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే? 

FOLLOW US: 
Share:

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో ఎక్కువగా ఫారిన్ టూర్లు వేస్తూ ఉంటారని ఇండస్ట్రీ జనాలు సరదాగా అంటుంటారు. ప్రస్తుతం ఘట్టమనేని ఫ్యామిలీ పారిస్ ట్రిప్ వేశారు. మహేష్ విషయాన్ని కాసేపు పక్కన ఉంచితే... రామ్ చరణ్ చాలా సైలెంట్‌గా ఫారిన్ టూర్లకు వెళ్లి వస్తున్నారు. 

మాల్దీవుల్లో చరణ్ అండ్ ఉపాసన!
ఇప్పుడు రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన (Upasana Konidela) మాల్దీవుల్లో ఉన్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో శనివారం మధ్యాహ్నం దంపతులు ఇద్దరూ కనిపించారు. ఈ ఏడాది చరణ్, ఉపాసన మూడో ఫారిన్ టూర్ ఇది. ఆస్కార్స్ కోసం అమెరికా వెళ్లి వచ్చారు. ఆ తర్వాత సీమంతం కోసం దుబాయ్ వెళ్లి వచ్చారు. ఇదిగో ఇప్పుడు మాల్దీవ్స్ టూర్! బహుశా... 2023 ఎండ్ అయ్యే సరికి ఎక్కువ ఫారిన్ టూర్స్ వేసిన స్టార్ రామ్ చరణ్ అవుతారేమో!?

కుటుంబం... సినిమా... రెండిటిని బ్యాలన్స్ చేస్తూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందుకు సాగుతున్నారు. పర్ఫెక్ట్ ప్లానింగుతో లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆస్కార్స్ వేడుక ముగిసిన తర్వాత అమెరికా నుంచి వచ్చిన రామ్ చరణ్ (Ram Charan)... వెంటనే 'గేమ్ చేంజర్' షూటింగులో పాల్గొన్నారు. ఇండియన్ స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కొరియోగ్రఫీ నృత్య దర్శకత్వంలో ఓ సాంగ్ చేశారు. తర్వాత దుబాయ్ ట్రిప్ వేశారు. 

రామ్ చరణ్ సినిమాలకు వస్తే... 'గేమ్ చేంజర్' తర్వాత సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత కన్నడ దర్శకుడు నర్తన్, తమిళ దర్శకుడు లోకేష్ కానగరాజ్ సినిమాలు లైనులో ఉన్నాయి. 

Also Read 'జూబ్లీ' వెబ్ సిరీస్ రివ్యూ : స్టార్ హీరోయిన్ ఎఫైర్... సెక్స్ వర్కర్‌తో డైరెక్టర్ లవ్... అదితి రావు హైదరి నటించిన వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?  

View this post on Instagram
 
A post shared by RamcharanCults (@ramcharan_crazy_fans_2.0)

దుబాయ్‌లో ఉపాసన సీమంతం
రామ్ చరణ్, ఉపాసన దంపతులు కొన్ని రోజుల క్రితం దుబాయ్‌లో ఉన్నారు. అతి కొద్ది మంది కుటుంబ స‌భ్యులు, కొంత మంది సన్నిహిత మిత్రుల సమక్షంలో ఉపాసన సీమంతం వేడుకలు జరిగాయి. ఉపాసన సోద‌రి అనుష్పాల కామినేని, సింధూరి రెడ్డి ఈ వేడుకను నిర్వ‌హించారు. ఉపాసన సీమంతం వేడుకకు ఆమె అమ్మమ్మ, డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి భార్య సుచరితా రెడ్డి కూడా పాల్గొన్నారు. హుందాగా క‌నిపించి అంద‌రి హృద‌యాల‌ను ఆమె దోచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీమంతం వేడుక వీడియో షేర్ చేశారు ఉపాసన

బేబీ బంప్‌తో కనబడుతున్న ఉపాసన
ఆస్కార్ వేడుకల నుంచి ఉపాసనను గమనిస్తే... బేబీ బంప్‌తో కనబడుతున్నారు. ఆ మధ్య జరిగిన రామ్ చరణ్ బర్త్ డే (Ram Charan Birthday) ఫొటోల్లోనూ ఉపాసన బేబీ బంప్ హైలైట్ అయ్యింది.రామ్ చరణ్ పుట్టిన రోజున ఉపాసన వేసుకున్న డ్రస్ చూశారా? బ్లూ కలర్ డ్రస్ ధరించారు. అందులో బేబీ బంప్ చాలా క్లారిటీగా కనిపించింది. దీంతో ఉపాసన ప్రెగ్నెన్సీపై అనుమానులు అన్నీ క్లియర్ అవుతాయని చెప్పవచ్చు.

Also Read : 'ఐ లవ్ యు ఇడియట్' రివ్యూ : శ్రీలీల ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే?

రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) వివాహం ఎప్పుడు జరిగిందో గుర్తు ఉందా? జూన్ 14, 2012లో వాళ్ళిద్దరి పెళ్లి జరిగింది. వివాహమైన పదకొండేళ్లకు వాళ్లిద్దరూ తల్లిదండ్రులు కానున్నారు. అపోలో ఆస్పత్రిలో ఇక్కడి వైద్యులతో పాటు కొంత మంది విదేశీ వైద్యుల పర్యవేక్షణలో డెలివరీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Published at : 08 Apr 2023 04:11 PM (IST) Tags: Ram Charan Maldives Upasana Konidela Charan-Upasana Charan Upasana

సంబంధిత కథనాలు

Pawan Kalyan Movie Kushi: ‘ఖుషి’ మూవీ చూసిన ఊర్వశి, పవర్ స్టార్ మూవీలో స్పెషల్ సాంగ్ కన్ఫామ్ అయినట్లేనా?!

Pawan Kalyan Movie Kushi: ‘ఖుషి’ మూవీ చూసిన ఊర్వశి, పవర్ స్టార్ మూవీలో స్పెషల్ సాంగ్ కన్ఫామ్ అయినట్లేనా?!

Urfi Javed: బాబోయ్ ఉర్ఫీ! టీ బ్యాగ్స్ తో డ్రెస్సా? నీ ఫ్యాషన్ సెన్స్‌కు దండం అంటున్న నెటిజన్స్!

Urfi Javed: బాబోయ్ ఉర్ఫీ! టీ బ్యాగ్స్ తో డ్రెస్సా? నీ ఫ్యాషన్ సెన్స్‌కు దండం అంటున్న నెటిజన్స్!

Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Tom Holland  on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

శర్వానంద్ పెళ్లి, ప్రశాంత్ నీల్ బర్త్‌డే అప్‌డేట్స్, ఓజీ షూటింగ్ వివరాలు - నేటి సినీ విశేషాలివే!

శర్వానంద్ పెళ్లి, ప్రశాంత్ నీల్ బర్త్‌డే అప్‌డేట్స్, ఓజీ షూటింగ్ వివరాలు - నేటి సినీ విశేషాలివే!

టాప్ స్టోరీస్

Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"

Bandi Sanjay on TDP:

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Congress: నేను ఎటు పార్టీ మారితే అటు సీఎం అవుతారు! కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

Congress: నేను ఎటు పార్టీ మారితే అటు సీఎం అవుతారు! కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

Amit Shah meets wrestlers: కేంద్ర హోంమంత్రితో రెజ్లర్ల భేటీ, చట్టం పని చట్టాన్ని చేసుకోనివ్వండన్న అమిత్‌షా

Amit Shah meets wrestlers: కేంద్ర హోంమంత్రితో రెజ్లర్ల భేటీ, చట్టం పని చట్టాన్ని చేసుకోనివ్వండన్న అమిత్‌షా