Pawan Kalyan in Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లోకి పవర్ స్టార్ మాస్ ఎంట్రీ - అప్పుడే అంతమంది ఫాలోవర్సా?
పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు ఇన్‌స్టాగ్రామ్‌లోకి అరంగేట్రం చేశారు. “ఏలుగెత్తు, ఎదిరించు, ఎన్నుకో.. జై హింద్” అనే స్లోగన్ ను పవన్ కళ్యాణ్ తన ఇన్ స్టా బయోలో చేర్చగా, ఇప్పటివరకు 5లక్షకు పైగా ఫాలోవర్స్ వచ్చారు.
Pawan Kalyan on Instagram : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చేశారు. అయితే, ఆయన కేవలం అకౌంట్ మాత్రమే స్టార్ట్ చేశారు. ఇంకా ఎలాంటి పోస్టు పెట్టలేదు. అయితే, పవన్ కళ్యాణ్ ఇన్‌స్టా అకౌంట్ ప్రారంభించిన కొన్ని క్షణాల్లోనే ఫాలోవర్స్ రావడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు 5 లక్షల మంది పవన్ కళ్యాణ్ అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు. పవన్ కళ్యాణ్ యూజ్ చేసే అఫిషియల్ ట్విట్టర్ ఖాతాకు ఉన్న ప్రొఫైల్ చిత్రాన్నే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ప్రొఫైల్ కు కూడా సెట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రాజకీయ అభిప్రాయాలతో పాటు సినిమాలకు సంబంధించిన కొత్త విషయాలను పంచుకుంటారని నెటిజన్స్ భావిస్తున్నారు. ఇక ఆయన ఇన్ స్టా బయోలో “ఏలుగెత్తు, ఎదిరించు, ఎన్నుకో .. జై హింద్!” అనే స్లోగన్ ను చేర్చారు. ఈ నేపథ్యంలో సినిమా కంటే పొలిటికల్ అప్‌డేట్స్ మాత్రమే ఈ అకౌంట్లో ఉంటాయా అనే సందేహం కూడా ఫ్యాన్స్‌లో ఉంది.
పవన్ కళ్యాణ్ త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌లో అరంగేట్రం చేయనున్నట్లు ఆయన సోదరుడు నటుడు నాగేంద్ర బాబు ఇటీవలే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. హి ఈజ్ కమింగ్ టూ బ్లాస్ట్ అనే క్యాప్షన్ తో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ వర్క్ కమిట్మెంట్స్..
పవన్ కళ్యాణ్ తన రాజకీయ కమిట్‌మెంట్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, ఆ ఏడాది వరుస సినిమాలు చేస్తున్నారు. వరుసగా నాలుగు విడుదలలను లైనులో ఉంచారు. ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ఫాంటసీ కామెడీ, 'బ్రో'లో స్క్రీన్‌ను పంచుకున్న పవన్ కళ్యాణ్.. ఈ సినిమా జులై 28న సినిమా హాళ్లలో విడుదల కానుంది. కాగా ఈ సినిమాపై ఇప్పటికే సినీ అభిమానుల్లో విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రాఫర్ కాగా, నవీన్ నూలి ఎడిటర్ గా ఉన్నారు. వినోదయ సీతమ్ అనే తమిళ సినిమాను తెలుగులో బ్రో అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. మంచి కంటెంట్‌తో వచ్చి తమిళ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తెలుగులో సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్- సుజీత్ కాంబినేషన్ లో వస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓజి' (OG), హరీష్ శంకర్ డైరెక్షన్ లో రాబోయే యాక్షన్ కామెడీ 'ఉస్తాద్ భగత్ సింగ్'తో పాటు క్రిష్ జాగర్లమూడితో పీరియాడికల్ యాక్షన్-అడ్వెంచర్ డ్రామా 'హరి హర వీర మల్లు' లైనప్ లో ఉన్నాయి. పవన్ ఈ సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. వీలు చిక్కినప్పుడు మూవీస్‌కు డేట్స్ ఇస్తూ తన షెడ్యూల్‌ను కంప్లీట్ చేస్తున్నారు. ‘బ్రో’ మినహా మిగతా సినిమాలేవీ వేగంగా ముందుకెళ్లడం లేదు. చూస్తుంటే ఆయా చిత్రాల విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.
Read Also : Trivikram Srinivas: ఓవైపు పవన్ మూవీ, మరోవైపు బన్నీ సినిమా - మహేష్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న గురూజీ
Join Us on Telegram: https://t.me/abpdesamofficial