By: ABP Desam | Updated at : 18 Jul 2022 09:01 AM (IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఫామ్ హౌస్ వార్తల్లో నిలుస్తోంది. హైదరాబాద్ నగర శివార్లలో గల శంకర్ పల్లిలో సుమారు ఆరున్నర కోట్లు ఖరీదు చేసే స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారని, అక్కడ ఫామ్ హౌస్ కట్టుకుంటున్నారనేది సదరు వార్తల సారాంశం. ఇదేమీ కొత్త విషయం కాదు.
ఏడాది క్రితమే ఎన్టీఆర్ ఆ స్థలాన్ని కొనుగోలు చేశారు. అవును... 2021 జూలైలో ఎన్టీఆర్ ఫామ్ హౌస్ కోసం ల్యాండ్ కొన్నారు. అక్కడ ఫామ్ హౌస్ ప్లాన్ చేశారు. దానికి 'బృందావనం' అని పేరు పెట్టారు. ఎన్టీఆర్ హిట్ సినిమాల్లో 'బృందావనం' ఒకటి. ఇదీ తెలిసిందే.
లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... ఎన్టీఆర్ వ్యవసాయం చేయాలనుకోవడం! తన ఫామ్ హౌస్‌లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని యంగ్ టైగర్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలో స్టార్ట్ చేయనున్నారని సమాచారం. షూటింగ్స్ లేనప్పుడు, స్నేహితులతో కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేయాలని అనుకున్నప్పుడు ఎన్టీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్తున్నారట.
స్టార్ హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు చాలా మంది ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 'జనతా గ్యారేజ్' సినిమాలో ఎన్టీఆర్ పకృతి ప్రేమికుడిగా కనిపించిన సంగతి తెలిసిందే.
Also Read: రష్మీ గౌతమ్ పెళ్లి కుదిరింది, బావ వచ్చేస్తున్నాడు
సినిమాలకు వస్తే... 'ఆర్ఆర్ఆర్' విడుదల తర్వాత ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తూ విశ్రాంతి తీసుకుంటున్న ఎన్టీఆర్, త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేయనున్నారు.
Also Read: డెలివరీ తర్వాత ముంబై నుంచి మొదటిసారి బయటకొచ్చిన కాజల్ అగర్వాల్ - అబ్బాయ్‌తో
ఇప్పుడు కుమారి ఒంటరే - బాయ్‌ఫ్రెండ్‌తో ఆ సినిమా విడుదలకు ముందు...
NTR In Oscar Race : హాలీవుడ్ హీరోలతో పోటీ - ఎన్టీఆర్‌కు ఆస్కార్?
Balakrishna Watched Bimbisara : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో
Tollywood Latest Updates : తెలుగులోనూ ధనుష్ సినిమా, రజనీతో తమన్నా, రాజమౌళి కాళ్ళు మొక్కిన అనుపమ!
Meena Organ Donation: మీనా గొప్ప నిర్ణయం - మరణించిన తర్వాత మరొకరికి ప్రాణం పోసేలా
Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - తెలంగాణలో మరో 3 గంటల్లో భారీ వర్షాలు, ఏపీలో అక్కడ పిడుగులు పడే ఛాన్స్: IMD
Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు
iPhone 14: ఐఫోన్ 14 విషయంలో అవి రూమర్లే - వెలుగులోకి కొత్త వివరాలు!
Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్