Thammudu First Day Collection: బాక్సాఫీస్ మీద నితిన్ గురి తప్పింది... 'తమ్ముడు' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Thammudu Box Office Collection: నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన 'తమ్ముడు'కు రివ్యూస్ బాలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందంటే?

Thammudu Collections Day 1: 'భీష్మ' తర్వాత హీరో నితిన్ కెరీర్‌తో సరైన హిట్ లేదు. 'తమ్ముడు'కు ముందు చేసిన 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' అయితే డిజాస్టర్ అయింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ అంతంత మాత్రమే. అందుకని, 'తమ్ముడు'తో భారీ హిట్ అందుకుంటాడని ఆశిస్తే... ఈ సినిమా కూడా డిజప్పాయింట్ చేసింది. ఆడియన్స్ రెస్పాన్స్ మాత్రమే కాదు... బాక్స్ ఆఫీస్ నంబర్స్ కూడా డిజప్పాయింట్ చేసేలా ఉన్నాయ్.
'తమ్ముడు' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత?
'తమ్ముడు' మొదటి రోజు కలెక్షన్స్ అటు ఇటుగా రెండు కోట్ల రూపాయలు. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం అయితే... మొదటి రోజు షేర్ కోటి కంటే తక్కువ. హీరోగా నితిన్ కెరీర్‌కు 'తమ్ముడు' డేంజర్ బెల్స్ మోగించిందని కలెక్షన్స్ చూసిన డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారట.
Also Read: 'తమ్ముడు' రివ్యూ: అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా? నితిన్ సినిమా హిట్టా? ఫట్టా?
తెలుగు రాష్ట్రాల్లో అక్యుపెన్సీ ఎంతంటే?
'తమ్ముడు' సినిమా చూసేందుకు థియేటర్లకు వచ్చిన జనాలు తక్కువ. అటు ఏపీ, ఇటు తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 600 స్క్రీన్లలో సినిమా రిలీజ్ చేస్తే 20 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉంది. హైదరాబాద్ సిటీలో శుక్రవారం 387 షోలు వేస్తే... 23 శాతం అక్యుపెన్సీ మాత్రమే నమోదు చేసింది. వరంగల్, విశాఖ వంటి ప్రాంతాల్లో కాస్త 30 శాతం ఆక్యుపెన్సీ వచ్చింది. చెన్నై కూడా పర్వాలేదు. అక్కడ 20 శాతం అక్యుపెన్సీ ఉంది. బెంగళూరు అయితే మరీ దారుణం. అక్కడ 266 షోలు వేస్తే ఆక్యుపెన్సీ 8.25 శాతం మాత్రమే అట.
#Thammudu vs #3BHK
— ABP Desam (@ABPDesam) July 5, 2025
Daily Sales On BMS
Thursday: 9.84k (Thammudu), 8.41 (3BHK)
Friday: 26.64k (Thammudu), 30.46k (3BHK) pic.twitter.com/dO9M1f2mrb
వీకెండ్ తర్వాత సినిమాకు స్కోప్ ఉంటుందా?
బుక్ మై షో వంటి టికెట్ యాప్స్ చూస్తే... శుక్రవారం సిద్ధార్థ్ '3 బీహెచ్‌కే' కంటే కాస్త తక్కువ సేల్స్ నమోదు చేసింది 'తమ్ముడు'. తమిళ్, తెలుగులో రిలీజ్ కావడం సిద్ధూ సినిమాకు ప్లస్ అయితే కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ అయింది నితిన్ సినిమా. మొదటి రోజు ఫ్లాప్ టాక్ రావడంతో ఫస్ట్ వీకెండ్ తర్వాత సినిమాకు స్కోప్ ఉంటుందా? అనేది ఇప్పుడు సందేహంగా మారింది.





















