Nara Rohith: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌పై నారా రోహిత్ రియాక్షన్ అదేనా? సింపుల్‌గా హర్ట్ చేయకుండా చెప్పేశారా?
Sundarakanda 2025: నారా రోహిత్ సోలో హీరోగా నటించిన 'సుందరకాండ' వినాయక చవితికి ఆగస్టు 27న థియేటర్లలోకి వస్తుంది. ఈవెంట్‌లో రోహిత్ ట్రోలింగ్ గురించి పరోక్షంగా స్పందించారు.

Nara Rohith reacts to Jr NTR Fans Trolling?: యంగ్ హీరో నారా రోహిత్ మీద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. 'వార్ 2', 'కూలి'... రెండిట్లో ఏ సినిమా చూస్తారని అడగ్గా... ''స్నేహితులు కూలీ టికెట్ బుక్ చేశారు'' అని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఎన్టీఆర్ అభిమానులకు నచ్చలేదు. దాంతో ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. తాజాగా రోహిత్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆ విమర్శలకు పరోక్షంగా బదులు ఇచ్చినట్లు అయింది. ఆ వివరాల్లోకి వెళితే...
నా మీద కోపంతో ట్వీట్లు చేస్తున్నారు!
నారా రోహిత్ సోలో హీరోగా నటించిన సినిమా 'సుందరకాండ' (Sundarakanda Movie 2025). వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన 'కూలీ' గురించి మాట్లాడినది. తాజాగా జరిగిన 'సుందరకాండ' ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం రాత్రి నిర్వహించారు. ఆ వేడుకలో పరోక్షంగా ట్రోలింగ్ పట్ల మెచ్యూరిటీతో మాట్లాడారు నారా రోహిత్.
''చాలా మంది నామీద కోపంతో ట్వీట్లు చేస్తున్నారు. అందుకు మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. కానీ సినిమా అంటే నేను ఒక్కడిని మాత్రం కాదు. చాలా మంది పని చేశారు. నా మీద కోపం ఉంటే రాయండి... మీకు సినిమా నచ్చకపోతే రాయండి... నేను ఏమీ అనుకోను. నిజంగా సినిమాకు వెళ్లి మీకు నచ్చింది రాయండి.మీకు నచ్చకపోయినా... మీకు నచ్చినట్టు రాయండి'' అని నారా రోహిత్ చెప్పారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా వస్తున్న ట్వీట్లు చూస్తే... 'వార్ 2' కంటే 'కూలీ' చూస్తానని చెప్పడం మీద కొందరు కోపంతో ట్వీట్లు చేస్తున్నట్లు అర్థం అవుతోంది. వాటి పట్ల ఆయన పరోక్షంగా రియాక్ట్ అయ్యారని అనుకోవాలి.
Also Read: పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ వీడియో... ఫ్రీగా హరిహర వీరమల్లు ఫస్ట్ ఫైట్ చూడొచ్చు... లింక్ క్లిక్ చేయండి
'సుందరకాండ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (Sundarakanda Pre Release Event)కు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. నారా రోహిత్ గురించి ఆయన మాట్లాడుతూ... ''నారా రోహిత్ గనుక నిజంగా కోరుకునే ఉంటే పెద్ద పెద్ద దర్శకులతో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలలో సినిమాలు చేసి ఉండేవారు. కమర్షియల్ కథానాయకుడిగా ఉన్నత స్థాయికి వెళ్లేవారు. ప్రేక్షకులకు ఎప్పుడూ ఒక డిఫరెంట్ సినిమా అందించాలని రోహిత్ తాపత్రయపడుతూ ఉంటారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి'' అని చెప్పారు. 'సుందరకాండ' సినిమాలో నారా రోహిత్ సరసన శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘాని హీరోయిన్లు. ఈ సినిమాతో వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వినాయక చవితికి ఒక్క రోజు ముందు ఆగస్టు 26న హైదరాబాద్ సిటీలో 'సుందరకాండ' ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఎర్లీ షో రిపోర్ట్స్ అమెరికా నుంచి కాకుండా ఇండియా నుంచి వస్తాయన్నమాట.
Also Read: పరదా వర్సెస్ శుభం కలెక్షన్లు... ఓపెనింగ్ డే రిజల్ట్ క్లియర్... సమంత క్రేజ్ ముందు అనుపమ వెలవెల!





















