అన్వేషించండి

NBK 109 Glimpse: ఎన్‌బీకే 109 గ్లింప్స్ వచ్చేసింది - అతడొక జాలి, దయాలేని అసురుడు.. బాలయ్య ఫ్యాన్స్ విజిల్స్ వేయాల్సిందే!

NBK 109 Glimpse: నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎన్‌బీకే 109 మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్‌లో కూల్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నారు బాలయ్య.

NBK 109 Glimpse Released: నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన అప్‌కమింగ్ సినిమాల నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇవ్వాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్నారని చాలాకాలం క్రితమే అనౌన్స్‌మెంట్ వచ్చింది. కానీ అప్పటినుంచి ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఇక ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేయడానికి బాలయ్య బర్త్‌డేనే కరెక్ట్ అని మేకర్స్ భావించారు. అందుకే జూన్ 10 ఉదయం 11.27 గంటలకు ఈ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. అందుకే బాలయ్య కనిపించేది కాసేపే అయినా ఆ స్క్రీన్‌షాట్‌ను ఫ్యాన్స్ తెగ షేర్ చేసేస్తున్నారు.

కూల్ లుక్‌లో బాలయ్య..

బాలకృష్ణ కెరీర్‌లో 109వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీని బాబీ డైరెక్ట్ చేస్తుండగా సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది. తాజాగా విడుదలయిన ఈ సినిమా గ్లింప్స్‌.. కొంతమంది రౌడీలు కత్తులతో ఒకరిపై దాడి చేయడానికి వెళ్తుండడంతో మొదలవుతుంది. ‘‘దేవుడు చాలా మంచోడయ్యా. దుర్మార్గులకు కూడా వరాలు ఇస్తాడు. వీళ్లు అంతు చూడాలంటే కావాల్సింది జాలి, దయ, కరుణ.. ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు’’ అనే డైలాగ్‌తో గ్లింప్స్ నడుస్తుంది. చివర్లో అప్పుడే ట్రైన్ నుంచి దిగిన బాలకృష్ణ.. ఆ పొగ మధ్య నుంచి నడుచుకుంటూ వస్తాడు. అదేంటి బాలయ్యను ఇంత సింపుల్‌గా చూపించి గ్లింప్స్‌ను ముగించారు అని ప్రేక్షకులు అనుకునేలోపే గుర్రంపై ఆయన గర్జించడంతో ఈ గ్లింప్స్ ముగుస్తుంది.

థమన్ సంగీతం..

ఎన్‌బీకే 109 గ్లింప్స్‌లో అక్కడక్కడా బాలయ్య ఫేస్ కనిపించకుండా సీరియస్ షాట్స్‌ను యాడ్ చేశాడు దర్శకుడు బాబీ కొల్లి. ‘మాన్‌స్టర్ వచ్చేసింది’ అంటూ ఈ మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది సితార ఎంటర్‌టైన్మెంట్స్. శ్రీకార స్టూడియోస్ ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌తో పాటు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. సూర్యదేవర నాగవంశీతో పాటు శ్రీ సౌజన్య.. ఎన్‌బీకే 109కు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. థమన్ అందించిన సంగీతం.. గ్లింప్స్‌లోనే చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలో కూడా మ్యూజిక్ అద్భుతంగా ఉండబోతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు.

 

బాలీవుడ్ విలన్‌తో ఢీ..

ఎన్‌బీకే 109కు సంబంధించిన ఇతర క్యాస్ట్ వివరాల గురించి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఈ సినిమాలో విలన్ రోల్ కోసం మాత్రం బాబీ డియోల్‌ను ఫైనల్ చేసింది మూవీ టీమ్. గత కొంతకాలంగా బాలకృష్ణ సినిమాల్లో ఎక్కువగా బాలీవుడ్ విలన్సే కనిపిస్తున్నారు. అదే విధంగా ఇందులో ‘యానిమల్’ విలన్ బాబీ డియోల్‌తో తలపడనున్నారు బాలయ్య. బాలకృష్ణ వీరాభిమానులు ఆయనను ఎటువంటి పవర్ ఫుల్ రోల్‌లో చూడాలని కోరుకుంటున్నారో.. దర్శకుడు బాబీ ఆ విధంగా ఆయన క్యారెక్టర్ డిజైన్ చేశారని, ఈ సినిమా అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఈ మూవీ కోసం ఆసక్తిగా చూడడం మొదలుపెట్టారు.

Also Read: బాలకృష్ణ... బోయపాటి శ్రీను... డబుల్ హ్యాట్రిక్ లోడింగ్... అఫీషియల్‌గా అనౌన్స్ చేశారోచ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu : 'ది ప్యారడైజ్'లో మోహన్ బాబు - శికంజా మాలిక్ రోల్‌పై డైరెక్టర్ రియాక్షన్
'ది ప్యారడైజ్'లో మోహన్ బాబు - శికంజా మాలిక్ రోల్‌పై డైరెక్టర్ రియాక్షన్
Allu Cinemas: 'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
'అల్లు సినిమాస్'లో అపశృతి... ప్రేక్షకులకు సినిమా మధ్యలో షాక్
Ustaad Bhagat Singh : మ్యాజిక్ జరిగింది... ట్రైలర్ అదిరింది - ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్‌పై మెగాస్టార్ రివ్యూ
మ్యాజిక్ జరిగింది... ట్రైలర్ అదిరింది - ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్‌పై మెగాస్టార్ రివ్యూ
Seetha Payanam OTT : ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

వీడియోలు

Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Embed widget