Balakrishna - Boyapati Srinu: బాలకృష్ణ... బోయపాటి శ్రీను... డబుల్ హ్యాట్రిక్ లోడింగ్... అఫీషియల్‌గా అనౌన్స్ చేశారోచ్
NBK110 Movie: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ కొత్త సినిమా ప్రకటించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
'సింహ'తో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ మొదలు అయ్యింది. బాలయ్య నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో... ఆ అంశాలతో పాటు బలమైన కథ, క్యారెక్టరైజేషన్‌లతో సినిమా తీసి భారీ విజయం సాధించారు బోయపాటి. ఆ తర్వాత వాళ్ల కలయికలో వచ్చిన 'లెజెండ్', 'అఖండ' సైతం భారీ విజయాలు సాధించాయి. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత ఈ కాంబినేషన్‌లో డబుల్ హ్యాట్రిక్ సినిమాకు నేడు శ్రీకారం చుట్టారు.
బాలకృష్ణ బర్త్ డే... కొత్త సినిమా కబురు!
జూన్ 10... బాలకృష్ణ బర్త్ డే (Balakrishna Birthday)! ఈ సందర్భంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన హీరోగా నటించబోయే కొత్త సినిమాను అధికారికంగా వెల్లడించారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తోంది. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. 'లెజెండ్' చిత్ర నిర్మాణంలోనూ వారు భాగస్వాములు. నిర్మాణ వ్యయం పరంగా రాజీ పడకుండా ఉన్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను భారీ ఎత్తున తీయాలని ఆచంట సోదరులు నిర్ణయించుకున్నారు. ఈ చిత్రానికి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరించనున్నారు.
Also Read: బాలకృష్ణ బర్త్ డే స్పెషల్... ఆయన కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన టాప్ 5 మూవీస్ ఏవో తెలుసా?
The Lethal Combo that sets the screens on fire is Back 🔥🔥
— 14 Reels Plus (@14ReelsPlus) June 10, 2024
The two Forces - 'GOD OF MASSES' #NandamuriBalakrishna & #BoyapatiSreenu reunite for #BB4 🌋🌋
Happy Birthday Balayya Babu ❤️🔥
Produced by @RaamAchanta #GopiAchanta under @14ReelsPlus banner ❤️
Presented by… pic.twitter.com/Oj9b1j9bvS
Balakrishna 110th Film: హీరోగా బాలకృష్ణ 110వ చిత్రమిది (NBK110 Movie). శ్రీను బోయపాటి దర్శకత్వంలో మూడో సినిమా అయితే... నిర్మాతలతో రెండోది! ఆగస్టు తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
బాలకృష్ణ, బోయపాటి సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు... ప్రేక్షకులు అందరికి వాళ్లిద్దరి సినిమాలపై ఆసక్తి ఉంటుంది. ఈ కాంబోలో వచ్చిన సినిమాల్లో డైలాగులు ఎప్పుడూ హిట్టే. సమాజంలో సమస్యలను సూటిగా ఎత్తి చూపాయి. మరి, తాజా సినిమాలో బోయపాటి ఎటువంటి తూటాలు పేలుస్తారో? 'సింహా', 'లెజెండ్', హిందూ ధర్మ ప్రాముఖ్యాన్ని వివరించిన 'అఖండ'... మూడు సినిమాల్లోనూ రాజకీయాల ప్రస్తావన కనిపిస్తుంది. మరి, కొత్త సినిమాలో ఏ మేరకు ఉంటుందో చూడాలి.
బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా బోయపాటి శ్రీను సినిమా ప్రకటనతో పాటు అభిమానులకు మరొక కానుక సైతం సిద్ధంగా ఉంది. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా వీడియో గ్లింప్స్ విడుదల కానుంది.