బాలయ్య ఏ వయస్సు నుంచి నటన ప్రారంభించారో తెలుసా? నటసింహం నందమూరి బాలయ్య టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి తిరుగులేని మాస్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. 14 ఏండ్ల వయసులోనే బాలయ్య సినిమా పరిశ్రమలోకి అరంగేట్రం చేశారు. ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన ‘తాతమ్మకల’ చిత్రంతో బాలనటుడిగా పరిచయం అయ్యారు. 1974 ఆగస్టు 30న ‘తాతమ్మకల’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి సినిమాలోనే అద్భుత నటనతో ఆకట్టుకున్నారు ఎన్టీఆర్ నట వారసుడు బాలయ్య. వెండితెరకు పరిచయమైన తక్కువ కాలంలోనే బాలయ్య స్టార్ హీరోగా ఎదిగారు. పౌరాణిక, జానపద, ఆధ్యాత్మికత, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో నటించి ఆహా అనిపించారు. 50 ఏండ్ల నట జీవితంలో ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించి అగ్రహీరోగా కొనసాగుతున్నారు. Photos Credit: @NBK_Unofficial/X