ప్రతి మనిషికి రోజుకు కనీసం 2.5 నుంచి 3.5 లీటర్ల నీళ్లు తాగడం అవసరం. నీళ్లు తాగేందుకు కూడా రోజులో కొన్ని సమయాలు మంచివని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం నిద్రలేవగానే ఒకటి రెండు గ్లాసుల నీళ్లు తాగడం వల్ల శరీరంలోని అవయవాలు చురుగ్గా మారుతాయి. నిద్ర లేవగానే నీళ్లు తాగడం వల్ల మలబద్ధకం కంట్రోల్ అవుతుంది. వ్యాయామ సమయంలో, వ్యాయామం తర్వాత నీళ్లు తాగడం వల్ల గుండె లయ సాధారణ స్థితిలో ఉంటుంది. భోజనానికి అరగంట ముందు నీళ్లు తాగాలి. ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. భోజనం తర్వాత కొద్ది నిమిషాల విరామం తర్వాత నీళ్లు తాగాలి. వెంటనే తాగొద్దు. స్నానానికి ముందు నీళ్లు తాగి స్నానం చేస్తే బీపి పెరగకుండా ఉంటుందని నిపుణుల సలహా. మధ్యాహ్న వేళ ఒకటి రెండు గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. ఇది లంచ్ తర్వాత చురుగ్గా ఉండేందుకు తోడ్పడుతుంది. నిద్రకు ఉపక్రమించే ముందు నీళ్లు తాగితే శరీరం ఉదయం వరకు డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. వీటన్నింటి కంటే ముఖ్యంగా ఎప్పుడు దాహం వేసినా వెంటనే నీళ్లు తాగాలి. ఇది శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.