Nandamuri Tejaswini : తెరపైకి బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని - జ్యువెలరీ యాడ్‌తో ఎంట్రీ
Balakrishna Daughter: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఓ జ్యువెలరీ యాడ్‌తో అరంగేట్రం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Balakrishna Nandamuri Tejaswini Lead In Jewellery Add : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్విని తెరపైకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఓ ఫేమస్ జ్యువెలరీ యాడ్‌లో ఆమె మెరిశారు. తమ సంస్థకు తేజస్విని బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నట్లు సదరు జ్యువెలరీ సంస్థ వెల్లడించింది.
యాడ్‌లో తేజస్విని న్యూ లుక్‌లో అదరగొట్టారు. తనదైన డ్యాన్స్‌తోనూ యాడ్‌కు ఓ సరికొత్త జోష్ తీసుకొచ్చారు. రోల్స్ రాయిస్ ఖరీదైన కారులో నగలతో సింపుల్ లుక్‌లో తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. 'నా ఆత్మవిశ్వాసం, నా ఆనందం, నా ఉత్సాహం, నా అనుబంధం, నా సంతోషం... మన సంస్కృతి సంప్రదాయాలు, మన ఆభరణాలు' అంటూ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు.
Nandamuri Tejaswini
— S U N N Y (@NSTC9999) October 31, 2025
Balayya Kuthuru ….😍
pic.twitter.com/7OGWkTZOYR
ఈ యాడ్ ప్రమోషనల్ వీడియోకు డి.యమునా కిషోర్ దర్శకత్వం వహించగా... మ్యూజిక్ లెజెండ్ ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందించారు. తేజస్విని ప్రమోషన్స్, విజువల్స్ గ్రాండ్ లుక్, అద్భుతమైన బీజీఎం అదిరిపోయింది. తమ జ్యువెలరీ సంస్థకు తేజస్విని బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం పట్ల సంస్థ డైరెక్టర్లు, ఫేమస్ డిజైనర్ నాగిని ప్రసాద్, మతుకుమిల్లి శ్రీమణి, శ్రీదుర్గా కాట్రగడ్డ సంతోషం వ్యక్తం చేశారు.
బాలకృష్ణ వారసుల్లో ఇద్దరు కుమార్తెలను సినిమాల్లోకి తీసుకురాలేదు. చదువు పూర్తి కాగానే వారికి పెళ్లిళ్లు చేశారు. పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి ఏపీ మంత్రి లోకేశ్ భార్య. చిన్న కుమార్తె తేజస్విని బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించిన 'అన్ స్టాపబుల్' టాక్ షోతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ షోకు ఆమె క్రియేటివ్ హెడ్‌తో పాటు ఇతర బాధ్యతలను నిర్వర్తించారు. అలాగే సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి నిర్మాతగా కూడా మారారు. ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి జ్యువెలరీ యాడ్‌లో మెరిశారు. రాబోయే రోజుల్లో సినిమాల్లోనూ నటిస్తారో లేదో తెలియాల్సి ఉంది.
ఇక నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా రోజుల క్రితం ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఆయన న్యూ లుక్ చూసి ఫిదా అయ్యారు. మూవీ కోసమే ఆ లుక్ అంటూ కామెంట్ చేశారు. ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కోసం ఆయన ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ప్రారంభంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండొచ్చని సమాచారం.
బ్రాండ్ అంబాసిడర్ - నందమూరి తేజస్విని, డైరెక్టర్ - డి.యమునా కిషోర్, మ్యూజిక్ - ఎస్ఎస్ తమన్, ఎడిటర్ - నవీన్ నూలి, DOP - అయంకా బోస్, ఆర్ట్ డైరెక్టర్ - అవినాష్ కోళ్ల, సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ - దబూ రత్నానీ, కొరియోగ్రాఫర్ - బ్రింద.





















