అన్వేషించండి

Chiranjeevi : డీప్ ఫేక్ ఫోటోస్, వీడియోస్ - మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ ఏంటంటే?

Chiranjeevi Deep Fake Video : ప్రజలు, సెలబ్రిటీలకు తలనొప్పిగా మారిన డీప్ ఫేక్, సైబర్ నేరాలపై మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయ్యారు. టెక్నాలజీని మంచి కోసం వాడాలని సూచించారు.

Megastar Chiranjeevi Reacts On Deep Fake Video : మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా డీప్ ఫేక్ వీడియోస్ బారిన పడిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన ఆయన తాజాగా ఈ అంశాలపై రియాక్ట్ అయ్యారు. టెక్నాలజీని మంచి కోసం వాడుకోవాలని సూచించారు. తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో జరిగిన ఏక్తా దివస్ కార్యక్రమానికి హాజరైన ఆయన పోలీస్ వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు.

భయపడాల్సిన అవసరం లేదు

దేశాన్ని ఏకం చేసి మనకు అందించిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ వంటి గొప్ప వ్యక్తుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చిన మెగాస్టార్... తెలంగాణలో పోలీస్ వ్యవస్థ చాలా బలంగా ఉందని ప్రశంసించారు. ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారని, అందరూ ధైర్యంగా ఉండాలని ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. 'డీప్ ఫేక్ అంశాన్ని ఇప్పటికే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాను. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు.

డీప్ ఫేక్, సైబర్ నేరాలకు ఎవరూ భయపడాల్సిన పని లేదు. దీనిపై ఓ చట్టం తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు. సెలబ్రిటీలు, పాలిటీషియన్స్‌తో పాటు సామాన్యులకు సైతం డీప్ ఫేక్ వీడియోస్, ఫోటోస్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కొత్త చట్టం త్వరగా జరగాలని కోరుకుంటున్నా. పోలీసులు చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. వీటి నుంచి ప్రజలకు రక్షణ కల్పిస్తారు. టెక్నాలజీని మంచికే ఉపయోగించాలి.' అని తెలిపారు.

Also Read : ఓటీటీలో కొత్త లోక Vs కాంతార చాప్టర్ 1 - ఒకే రోజు రెండు బ్లాక్ బస్టర్స్... మీరు ఏ మూవీ చూస్తారు?

అయితే, రెండు రోజుల క్రితం చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారంటూ ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఓ X అకౌంట్‌ను తన కంప్లైంట్‌‌కు జత చేశారు. ఇటీవల హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ తనపై ఇలాంటి పోస్టులు పెడుతున్నారని చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా... అనుమతి లేకుండా చిరు ఫోటోలను కానీ, వాయిస్ కానీ ఉపయోగించడానికి వీల్లేదని కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ కామర్స్ సైట్స్, కొన్ని డిజిటల్ మీడియా సంస్థలు తన పేరు వాడుకుంటున్నారంటూ ఆయన కోర్టును ఆశ్రయించగా... చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన పేరును వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించవద్దని వార్నింగ్ ఇచ్చింది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Telangana Mass Killing: కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Telangana Mass Killing:షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Embed widget