అన్వేషించండి

Naga Chaitanya: నేషనల్ అవార్డ్స్ కాదు... ఆడియన్స్‌ని అలరించడం నాకు మోస్ట్ ఇంపార్టెంట్ - నాగచైతన్య ఇంటర్వ్యూ

నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకున్న చిత్రం ‘తండేల్’. ఫిబ్రవరి 7న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను హీరో నాగచైతన్య మీడియాకు తెలియజేశారు. ఆయన ఏం చెప్పారంటే...

Naga Chaitanya Interview: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, డ్యాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’ (Thandel Movie). ‘కార్తికేయ’ సిరీస్ చిత్రాల దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో... మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై 'బన్నీ' వాసు నిర్మించారు. ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌ని చిత్ర యూనిట్ యమా జోరుగా నిర్వహిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు ప్రమోషన్స్ నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా బుధవారం చిత్ర హీరో నాగచైతన్య మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ...

‘‘నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రొడక్షన్, హై బడ్జెట్ మూవీ ‘తండేల్’. క్యారెక్టర్, కథ అన్ని రకాలుగా బిగ్ స్పాన్ వున్న సినిమా ఇది. ఫిబ్రవరి 7న విడుదలకు వస్తున్న ఈ సినిమాపై చాలా ఎక్సయిట్‌మెంట్ వుంది. ఆల్రెడీ అంతా సినిమా చూశాం. అందరం చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాం. సెకండాఫ్ అయితే యునానిమస్‌గా చాలా బాగా చెప్పారు. నాకు కూడా ఎమోషనల్ హై ఇచ్చింది. చివరి 30 నిమిషాలు వెరీ శాటిస్‌ఫ్యాక్షన్. క్లైమాక్స్ సినిమా చూసిన అందరికీ గ్రేట్ ఎమోషనల్ హై ఇస్తుంది. ‘దూత’ వెబ్ సిరీస్ సమయంలో ఈ కథ విన్నాను. బన్నీ వాసు గీతా ఆర్ట్స్‌లో ఈ కథను హోల్డ్ చేశారని తెలిసింది. డెవలప్ చేసి మంచి షేప్ వస్తే చెప్పమన్నాను. నేను మొదట విన్నప్పుడు ఒక డాక్యుమెంటరీలా అనిపించింది. సినిమాటిక్ వెర్షన్‌లోకి తీసుకురావడానికి చాలా వర్క్ చేయాలి. అలా వర్క్ చేసిన తర్వాత ఎక్స్‌లెంట్‌గా కథ సిద్ధమైంది. గీతా ఆర్ట్స్‌లో చేసిన ‘100 పర్సెంట్ లవ్’ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందని అనుకుంటున్నాను. ఒక యాక్టర్‌గా నాకు ఈ సినిమా మంచి దారి చూపిస్తుందని భావిస్తున్నాను. గీతా ఆర్ట్స్‌లో మళ్ళీ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. యాక్టర్‌కి మంచి రిలీజ్ ఇస్తారు. వాళ్ళ ప్రొడక్ట్, దాని పని చేసే తీరు అంతా చాలా బావుంటుంది. ఈ కథ గీతా ఆర్ట్స్ దగ్గర వుండటం నాకు డబుల్ బొనాంజా.

Also Read: విశాల్‌తో పెళ్లా... పదిహేనేళ్లుగా అతనితో రిలేషన్‌లో ఉన్నాను - షాకిచ్చిన అభినయ

‘తండేల్’ కథ మొదట నాకు ఓ ఐడియాగా చెప్పారు. పాత్రకు తగ్గట్టుగా మారాలంటే అక్కడి వాళ్ల రియల్ లైఫ్ స్టయిల్ తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి వాళ్ళని నేరుగా కలవాలని వెళ్లాం. మొత్తం హోం వర్క్ చేశాక నేను చేయగలనని కన్వెన్స్ అయిన తర్వాత ఈ జర్నీ మొదలైంది. ప్రతి సినిమాతో ఇంకా బెటర్ అవ్వాలని ప్రతి నటుడికి వుంటుంది. అయితే ఈ కథ రియల్ లైఫ్ క్యారెక్టర్ కాబట్టి ఇంకా మోటివేట్ అయ్యాను. యాక్టర్‌గా నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళే అవకాశం ఈ సినిమాలో నాకు కనిపించింది. దాదాపు ఎనిమిది నెలలు స్క్రిప్ట్, నా ట్రాన్స్‌ఫర్మేషన్ మీదే వున్నాను. అలాగే శ్రీకాకుళం యాస కోసం ట్యూషన్ తీసుకున్నాను. యాస రియల్లీ ఛాలెజింగ్‌గా అనిపించింది. నాకు ఎప్పటి నుంచో రియల్ లైఫ్ స్టొరీస్ ఆధారంగా సినిమా చేయాలని వుండేది. అది ఈ సినిమాతో తీరింది. పైగా ఇది మన తెలుగోళ్ళ కథ. ఇది నాకు స్ఫూర్తిని ఇచ్చింది. రూటెడ్‌గా వుండే కథలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను. ఈ సినిమా కోసం రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌ని కలిసినప్పుడు చాలా ఎమోషనల్‌గా అనిపించింది. వాళ్లతో చాలా టైం స్పెండ్ చేశాను. వాళ్ళలో ఒక నిజాయితీ కనిపించింది. నిజాయితీ ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలం. ఇందులో రాజు ఫైటర్. జైల్లో ఉన్నప్పుడు బాధని ఓర్చుకుని తన వారికోసం ఎలా పోరాటం చేశాడు.. ఎలా బయటికి వచ్చాడనేది చాలా గొప్పగా వుంటుంది. తన ప్రేమకథే తనకి బలాన్ని ఇస్తుంది.

డైరెక్టర్ చందూతో నాకు ఇది మూడో సినిమా. తనతో ట్రావెల్ అవ్వడమంటే ఇష్టం. నన్ను కొత్తగా ప్రజెంట్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాడు. నా కోసమే ఆలోచిస్తుంటాడు. ఈ సినిమా కమర్షియల్‌గా తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు. సాయిపల్లవితో నాకు రెండో సినిమా. ఆమె ఫెంటాస్టిక్ యాక్టర్. పల్లవితో యాక్ట్ చేయడం ఇష్టం. తనలో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ వుంటుంది. క్యారెక్టర్‌ని డీప్‌గా అర్థం చేసుకుంటుంది. ఒక ఆర్టిస్ట్ అలా వున్నప్పుడు మన పెర్ఫార్మెన్స్ కూడా ఎన్ హ్యాన్స్ అవుతుంది. సాయిపల్లవితో డ్యాన్స్ చేయాలంటే కష్టపడాలి. అయితే చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాం. శివుని సాంగ్ థీమ్ కూడా శివ పార్వతుల లవ్ స్టోరీ మీద వుంటుంది. మా క్యారెక్టర్స్ కూడా సినిమాలో శివ పార్వతుల నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు. అందుకే ఆ సాంగ్ ఆ థీమ్‌లో పెట్టారు. దేవిశ్రీ ఇచ్చిన బుజ్జితల్లి పాట ఈ సినిమాని గ్రౌండ్ లెవల్‌లోకి తీసుకెళ్ళిపోయింది. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దేవితో వర్క్ చేయడం ఎప్పుడూ ఆనందంగా వుంటుంది. తనతో చేసిన ప్రతి సినిమా ఆడియో పరంగా సూపర్ హిట్.    

‘తండేల్’ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ వెనుక మిగతా లేయర్స్ వుంటాయి. శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్లి అక్కడ బోట్స్‌ని లీజ్‌కి తీసుకొని ఫిషింగ్ చేసుకొని అక్కడే అమ్మి తిరిగివస్తారు. ‘తండేల్’ అంటే లీడర్. ఇది గుజరాతీ వర్డ్. సినిమాని దాదాపు సముద్రంలో షూట్ చేశాం. రియల్ లొకేషన్‌లో షూట్ చేయడం మా పెర్ఫార్మెన్స్‌‌కి కూడా ప్లస్ అవుతుంది. జైలు ఎపిసోడ్స్ చాలా ఎమోషనల్‌గా వుంటాయి. సినిమా షూటింగ్ సమయంలో చాలా విషయాలు జరిగాయి. ఒకసారి బోట్ కొలాప్స్ అయిపోయింది. కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసి కెమెరామెన్‌తో పాటు అందరినీ తీసుకెళ్ళారు. ఇలాంటివి షూటింగ్ టైమ్‌లో చాలా జరిగాయి. శామ్ దత్ బ్యూటీఫుల్ విజువల్స్ ఇచ్చారు. ‘విరూపాక్ష’ చూసి ఆయనతో వర్క్ చేయాలని అనుకున్నాను. లక్కీగా కుదిరింది, నెక్స్ట్ సినిమా కూడా ఇదే టీంతో వర్క్ చేయాలనేంతగా ఈ టీమ్‌తో ప్రేమలో పడిపోయాను.

లవ్ స్టొరీతో పాటు సర్వైవల్ డ్రామా చేయడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ప్రతి హానెస్ట్ లవ్ స్టోరీలో ఒక పెయిన్ వుంటుంది. ఇందులో ఆ పెయిన్‌ని బాగా ప్రజెంట్ చేశాం. ఎమోషనల్ హై చాలా కొత్తగా వుంటుంది. ఒక యాక్టర్‌గా నాకు చాలా తృప్తిని ఇచ్చిన సినిమా ఇది. ఆమీర్ ఖాన్ గారికి ట్రైలర్ చాలా నచ్చింది. 7న వాళ్ళ అబ్బాయి సినిమా రిలీజ్ వున్నప్పటికీ ట్రైలర్ నచ్చి మొన్న జరిగిన ఈవెంట్‌కి వచ్చారు. అలాగే కార్తి గారు కూడా కంటెంట్ నచ్చే వచ్చారు.

రియల్ లైఫ్ కథ‌లకు అవార్డ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ నేను అవార్డ్స్ గురించి ఇంకా ఆలోచించలేదు. అరవింద్‌గారు మాత్రం, సినిమా రిలీజ్ తర్వాత నేషనల్ అవార్డ్స్‌కి పంపిస్తానని అన్నారు. నేను అయితే అంత వరకు ఆలోచించలేదు. నేషనల్ అవార్డ్స్‌ కాదు.. ఆడియన్స్‌ని అలరించడం నాకు మోస్ట్ ఇంపార్టెంట్. అరవింద్‌గారితో నాకు చాలా మంచి బాండింగ్ వుంది. అరవింద్ గారు, వాసు, నేను ఎప్పటినుంచో ట్రావెల్ అవుతున్నాం. ఈ సినిమా అందరికీ మంచి మెమరబుల్ మూమెంట్‌ని ఇస్తుందని భావిస్తున్నాను’’ అని నాగచైతన్య చెప్పుకొచ్చారు.

Also Readవందకు పైగా సినిమాల్లో నటించిన పుష్పలత ఇకలేరు... యాక్టింగ్ మానేశాక ఏం చేశారు? కూతురూ హీరోయినే అని తెల్సా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Bhimavaram DSP Jayasurya transfer: పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?

వీడియోలు

Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Bhimavaram DSP Jayasurya transfer: పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Bangladesh Bengali Language: ముస్లింలే కానీ బంగ్లాదేశ్‌లో ఎవరికీ ఉర్దూ రాదు- వారి భాష బెంగాలీనే - దేశం ఏర్పాటుకూ కారణం అదే !
ముస్లింలే కానీ బంగ్లాదేశ్‌లో ఎవరికీ ఉర్దూ రాదు- వారి భాష బెంగాలీనే - దేశం ఏర్పాటుకూ కారణం అదే !
Embed widget