Mahesh Babu: మహేష్ బాబు వ్యాఖ్యలపై భిన్నంగా స్పందించిన బాలీవుడ్ నిర్మాత ముఖేష్ భట్

సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్‌పై చేసిన కామెంట్లను నేషనల్ మీడియా సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ముఖేష్ భట్ ఈ వ్యాఖ్యలు చేశారు.

FOLLOW US: 

బాలీవుడ్ నన్ను భరించలేదంటూ మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నిర్మాత ముఖేష్ భట్ స్పందించారు. బుధవారం ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మహేష్ బాబు చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని అన్నారు. 

‘‘మహేష్ బాబు ధరను బాలీవుడ్ భరించలేదని అనుకుంటే, అది మంచిదే. ఆయనకు నా శుభాకాంక్షలు. ఆయన్ని నేను గౌరవిస్తాను. ఆయన ప్రతిభ ఉన్న నటుడు. ఆయన గత కొన్నేళ్లుగా సృష్టించిన ప్రతిభకు ఒక విలువ ఉంది. ఆయన విజయవంతమైన నటుడు కాబట్టి తన అవసరాలకు అనుకుగుణంగా ఉంటారు. బాలీవుడ్ ఆయన అంచనాలకు అనుగుణంగా పనిచేయలేకపోవచ్చు. ఇందులో ఆయన తప్పులేదు. అది ఆయన సొంత విషయం’’ అని అన్నారు. 
 
‘మేజర్’ ట్రైలర్ లాంచ్‌లో భాగంగా మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీపై స్పందించారు. ‘‘హిందీ ఇండస్ట్రీ నుంచి నాకు ఆఫర్లు బాగానే వచ్చాయి. కానీ వారు నన్ను భరించగలరని నేను అనుకోవడం లేదు. నన్ను భరించలేని పరిశ్రమలో పని చేయడం టైం వేస్ట్ చేసుకోవడమే అవుతుంది. ఇక్కడ(టాలీవుడ్) నాకు బాగానే ఆఫర్స్ వస్తున్నాయి. పైగా ఈ ఇండస్ట్రీ నాకు మంచి గుర్తింపు, గౌరవం, స్టార్ డమ్ ఇచ్చింది. దీనిపట్ల చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే.. నా ఇండస్ట్రీని విడిచి మరేదో ఇండస్ట్రీకి వెళ్లి పని చేయాలనే ఆలోచన నాకు లేదు. సినిమాలు చేయాలని, మరింత ఎత్తుకు ఎదగాలని ఎప్పుడూ అనుకుంటాను. నా కల ఇప్పుడు నెరవేరుతోంది’’ అని అన్నారు.

Also Read: 'మురారి' ప్లేస్‌లో 'మ మ మహేశా', ముందు 'కళావతి' నచ్చలేదు - మహేష్

మహేష్ చేసిన వ్యాఖ్యలను నేషనల్ మీడియా సీరియస్‌గా తీసుకుంది. బాలీవుడ్‌పై మహేష్ బాబు తీవ్ర వ్యాఖ్యలంటూ దుమారం రేపాయి. దీంతో మహేష్ బాబు తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వక తప్పలేదు. ‘‘బాలీవుడ్‌పై ఎప్పుడూ నేను నెగటివ్ కామెంట్స్ చేయలేదు. అన్ని భాషలను నేను గౌరవిస్తా. నేను ఎప్పుడూ తెలుగు సినిమాలే చేస్తానని చెప్పను. అంతేగానీ బాలీవుడ్ సినిమాలు చేయనని చెప్పలేదు. మన తెలుగు సినిమాలు బాలీవుడ్‌కు సైతం చేరుకోవాలనేదే నా కోరిక. పదేళ్లుగా నేను అనుకుంటున్నది ఇప్పుడు నెరవేరుతోంది. మన సినిమాలు పాన్ ఇండియా స్థాయికి చేరాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. మన ఇండస్ట్రీ వదిలేసి అక్కడికి ఎందుకెళ్లాలి? అనేదే నా అభిప్రాయం. నేను ఇక్కడ హ్యాపీ. అక్కడికి వెళ్లాలనే ఆలోచన నాకు లేదు’’ అని పేర్కొన్నారు.

Also Read: ఆ నిర్ణయం నాది కాదు & గౌతమ్ వేరు, సితార వేరు! - పిల్లల గురించి మహేష్ బాబు ఏమన్నారంటే?

Published at : 11 May 2022 08:59 PM (IST) Tags: Mahesh Babu bollywood Mahesh Babu Bollywood Comments Mukesh Bhatt Mukesh Bhatt Comments

సంబంధిత కథనాలు

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!

Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?

Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!