MR Reddy: నా జీవితంలో కథే 'మిస్టర్ రెడ్డి'... ఎంతో మంది మోసం చేసినా భయపడకుండా విడుదలకు... - టీఎన్ఆర్
MR Reddy Movie Release Date: జూలై 18న థియేటర్లలోకి 'జూనియర్', 'కొత్తపల్లిలో ఒకప్పుడు' విడుదల అవుతున్నాయి. వాటితో పాటు వస్తున్న మరో సినిమా 'మిస్టర్ రెడ్డి'. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా, శ్రీ లీల హీరోయిన్‌గా నటించిన 'జూనియర్', 'కొత్తపల్లిలో ఒకప్పుడు' సినిమాలు జూలై 18న థియేటర్లలోకి వస్తున్నాయి. వాటితో పాటు శుక్రవారం విడుదల అవుతున్న మరో సినిమా 'మిస్టర్ రెడ్డి' (Mr Reddy Movie Release Date).
టీఎన్ఆర్ జీవితంలో జరిగిన కథతో...
Mr Reddy Movie Cast And Crew: టీఎన్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద గోల్డ్ మ్యాన్ రాజా (టి. నరసింహా రెడ్డి - టీఎన్ఆర్) నిర్మించిన సినిమా 'మిస్టర్ రెడ్డి'. ఆయన ప్రధాన పాత్ర పోషించగా... వెంకట్ వోలాద్రి దర్శకత్వం వహించారు. ఇందులో మహాదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి శ్రీరంగం, భాస్కర్, మల్లికార్జున్, శంకర్ మహతి, రాధిక, ఏకే మణి, ఫణి ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం జరిగింది.
తన టాలెంట్ నమ్ముకుని ఇక్కడి వరకు వచ్చానని హీరో & ప్రొడ్యూసర్ టీఎన్‌ఆర్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఎన్నో వ్యయ ప్రయాసల తర్వాత ఈ సినిమా విడుదల వరకు వచ్చింది. నన్ను ఎంతో మంది మోసం చేశారు. కానీ, ఎప్పుడూ ఎక్కడా భయపడలేదు.నా జీవితంలో జరిగిన కథే ఈ సినిమా'' అని చెప్పారు.
Also Read: కూలీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సినిమా చూశాక సూపర్ స్టార్ ఏం చెప్పారంటే?
దర్శకుడు వెంకట్ వోలాద్రి మాట్లాడుతూ... ''మేం ఒక మంచి సినిమా తీశాం. టీఎన్‌ఆర్ గారు లేకపోతే సినిమా ఇక్కడి వరకు వచ్చేది కాదు. మహదేవ్, అనుపమ, దీప్తితో పాటు ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు'' అని చెప్పారు. థియేటర్లలో ఈ సినిమా చూడాలని హీరో హీరోయిన్లు మహదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి శ్రీరంగం తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కెఎన్ భూషణ్,సంగీతం: కేఎస్ఆర్ మ్యూజికల్.
Also Read: శ్రీలీల ఫ్యాన్స్‌కు పండగ... 'మాస్ జాతర'లో దుమ్ములేపే డాన్స్ నంబర్





















