Coolie First Review: కూలీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సినిమా చూశాక దర్శకుడితో సూపర్ స్టార్ ఏం చెప్పారంటే?
Rajinikanth On Coolie: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ సినిమా 'కూలీ'. ఆగస్టు 14న థియేటర్లలోకి వస్తుంది. అయితే, ఆల్రెడీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సూపర్ స్టార్ సినిమా చూసి ఏం చెప్పారంటే?

ఆగస్టు 14న థియేటర్లలోకి రావడానికి సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) రెడీగా ఉన్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన సినిమా 'కూలీ' (Coolie). సినిమా విడుదలకు సరిగ్గా నెల ఉంది. అయితే... హీరోకి సినిమా చూపించారు దర్శకుడు. మరి, సూపర్ స్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
నాకు మరో దళపతి - రజనీకాంత్
Rajinikanth reviews Coolie: రజనీకాంత్ సినిమాల్లో తనకు 'దళపతి' చాలా ఇష్టమని దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెలిపారు. 'కూలీ'లో ఆ బ్యాలెన్స్ చూపించేందుకు ప్రయత్నించానని ఆయన పేర్కొన్నారు. ఇంకా లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ... ''డబ్బింగ్ స్టూడియోలో రజనీకాంత్ గారు 'కూలీ' చూశారు. ఆ తర్వాత నన్ను హగ్ చేసుకున్నారు. 'నాకు దళపతిలా అనిపించింది' అని చెప్పారు. ఆ రోజు రాత్రి నేను ప్రశాంతంగా నిద్రపోయాను'' అని చెప్పారు.
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన 'విక్రమ్' బాక్సాఫీస్ బరిలో భారీ విజయం సాధించింది. కార్తీ 'ఖైదీ' ఆయనకు దర్శకుడిగా పేరు తీసుకు వచ్చినా... దళపతి విజయ్ హీరోగా తీసిన 'మాస్టర్', 'లియో' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి నంబర్స్ నమోదు చేశారు. దాంతో రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్ సినిమా అనేసరికి ప్రేక్షకులు అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: వీరమల్లు సెన్సార్ పూర్తి... పవన్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రన్ టైమ్ ఎంతంటే?
రజనీకాంత్ కోసం తాను మొదట వేరే కథ రాశానని లోకేష్ కనగరాజ్ వివరించారు. తాజాగా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ''నేను మొదట రజనీ సార్ కోసం ఒక ఫాంటసీ ఫిల్మ్ రాశా. ఆయన విన్న వెంటనే ఓకే చెప్పారు. అయితే అది సెట్స్ మీదకు వెళ్ళడానికి కనీసం ఏడాదిన్నర పడుతుంది. అందుకని 'కూలీ' రాశా. రజనీ గారి కోసం మనం ఎటువంటి కథ అయినా రాయొచ్చు. ఆయనది లార్జర్ దేన్ లైఫ్ ఇమేజ్. ఈ సినిమాలో నేను కొత్త టెక్నీక్స్, స్టైల్స్ ట్రై చేశా. అయినా సరే ఇది సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాయే'' అని చెప్పారు.
Also Read: శ్రీలీల ఫ్యాన్స్‌కు పండగ... 'మాస్ జాతర'లో దుమ్ములేపే డాన్స్ నంబర్
'కూలీ' సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, కన్నడ స్టార్ ఉపేంద్ర తదితరులు నటించారు. ఇందులో బుట్ట బొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ 'మోనికా' చేసిన సంగతి తెలిసిందే. ప్రజెంట్ ఆ పాట ట్రెండ్ అవుతోంది. సన్ పిక్చర్స్ పతాకం మీద కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రమిది.





















