Mahesh Babu In GYM : జిమ్‌లో మహేష్ బాబు - ఆ బైసెప్స్ చూశారా? ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయో!
మహేష్ బాబును అభిమానులు చాలా మంది గ్రీకు వీరుడితో పోలుస్తారు. ఎందుకంటే? ఆయన అందం అటువంటిది. అందం మాత్రమే కాదు... ఫిట్నెస్ విషయంలోనూ ఆయన్ను స్ఫూర్తిగా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)ను గ్రీకు వీరుడిగా పోల్చే అభిమానులు చాలా మంది ఉన్నారు. ఆయన అందం చూసి అసూయ, ఈర్ష్య వంటివి వ్యక్తం చేసే ప్రేక్షకులు కూడా ఉన్నారు. అంత ఎందుకు? హీరో హీరోయిన్లలో కొందరు మహేష్ అందం కొంచెం తమకు ఇస్తే బాగుంటుందని సరదాగా చెప్పిన వాళ్ళు ఉన్నారు.
మహేష్ బాబు అందం వెనుక తల్లిదండ్రులు ఇందిరా దేవి, కృష్ణ నుంచి వచ్చిన జీన్స్‌తో పాటు ఆయన కష్టం కూడా ఉంది. మహేష్ బాబు డైట్ పక్కాగా ఫాలో అవుతారు. తిండి విషయంలో ఆయనకు చాలా లిమిట్స్ ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయం... జిమ్ & వర్కవుట్స్! క్రమం తప్పకుండా జిమ్ చేయడం మహేష్ బాబుకు అలవాటు. అందుకే, ఎప్పుడూ సేమ్ ఫిజిక్ మైంటైన్ చేస్తూ ఉంటారు. లేటెస్టుగా వర్కవుట్ చేస్తున్న ఫోటోలను మహేష్ పోస్ట్ చేశారు.
ఇప్పుడు మహేష్ బాబు ఆర్మ్స్ ఎక్స్‌ర్‌సైజ్స్ చేస్తున్నారు. ఆయన పోస్ట్ చేస్తే ఫోటోను బైసెప్స్ బాగా కనపడుతున్నాయి. బహుశా... 'గుంటూరు కారం' ఫైట్స్ కోసం ఆయన కష్టపడుతున్నారేమో!?
Also Read : చిరంజీవి అభిమాని సినిమా - ట్రైలర్ విడుదల చేసిన రామ్ చరణ్
View this post on Instagram
శుక్రవారం నుంచి గుంటూరు సెట్స్‌లో...
'అతడు', 'ఖలేజా' తర్వాత గురూజీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. గురువారం నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి అంతా సిద్ధం అయ్యింది. ఆ తర్వాత రోజు శుక్రవారం నుంచి మహేష్ బాబు కూడా షూటింగులో జాయిన్ అవుతారని యూనిట్ సన్నిహిత వర్గాల కథనం.
ఒక్క షర్ట్ రేటు 75 వేలా?
కింద పోస్టులో ఫోటో చూశారుగా... మహేష్ బాబు చాలా మాసీగా కనిపిస్తున్నారు. అయితే... ఆ షర్ట్ మాత్రం చాలా కాస్ట్లీ! ఫార్ ఫెచ్ (farfetch) కంపెనీకి చెందిన R13 బ్లీచ్ వాష్ ప్లైడ్ లాంగ్ స్లీవ్ షర్ట్ వేశారు మహేష్. అదీ క్లాసిక్ బ్లాక్ కలర్! దాని రేటు అక్షరాలా 74,509 రూపాయలు. ఒక్క షర్ట్ రేటు అంతా? అని కొందరు నోరెళ్ళ బెడుతుంటే... మరి కొందరు సూపర్ స్టార్ షర్ట్ అంటే ఆ మాత్రం రేటు ఉంటుందని చెబుతున్నారు.
మహేష్ బాబు పుట్టినరోజు నాడు మరో స్టిల్ కూడా విడుదల చేశారు. అందులో రెడ్ కలర్ చెక్ షర్ట్ వేసుకున్నారు. దాని రేటు కేవలం మూడు వేల రూపాయలే అని టాక్. అటువంటి షర్ట్స్ ఆన్‌లైన్‌లో మూడు వేలకు వస్తున్నాయట.
Also Read : మీరా జాస్మిన్‌కు తెలుగులో మరో ఛాన్స్ - ఈసారి యంగ్ హీరోతో...
View this post on Instagram
'గుంటూరు కారం'లో మహేష్ సరసన యువ కథానాయికలు శ్రీ లీల, మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. సూపర్ స్టార్ సినిమా వాళ్ళిద్దరికీ తొలిసారి అవకాశం వచ్చింది. ఆ కారణంతో ఇద్దరూ ఆనందంతో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మారింది ఏమైనా ఉందంటే... అది 'గుంటూరు కారం' విడుదల తేదీ! తొలుత ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నట్లు తెలిపారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఒక్క రోజు ముందుకు వచ్చారు. జనవరి 12న విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial