By: ABP Desam | Updated at : 16 Aug 2023 06:09 PM (IST)
మీరా జాస్మిన్
కథానాయిక మీరా జాస్మిన్ (Meera Jasmine) గుర్తున్నారా? గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ సరసన 'మహారథి'లోనూ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోడీగా 'గుడుంబా శంకర్' సినిమాలోనూ నటించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ (Telugu Film Industry)లో మంచి చిత్రాలు చేశారామె. ఆ తర్వాత కనుమరుగు అయ్యారు. ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చారు. కొత్తగా మరో సినిమాకు సంతకం చేశారు. ఆ సినిమా ఏది? అందులో హీరో ఎవరు? వంటి వివరాల్లోకి వెళితే...
యువ హీరో శ్రీ విష్ణుతో...
Meera Jasmine in Sree Vishnu Ritu Varma movie : 'సామజవరగమన' సినిమాతో ఈ ఏడాది కామెడీ హిట్ అందుకున్న యువ కథానాయకుడు శ్రీ విష్ణు. ఇప్పుడు ఆయన 'స్వాగ్' (Swag Telugu Movie) పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. అందులో రీతూ వర్మ హీరోయిన్. ఆమె కాకుండా మరో కథానాయికకు కూడా చోటు ఉందట. ఆ పాత్రకు మీరా జాస్మిన్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది.
తెలుగు, తమిళ 'విమానం'లో నటించినా...
మీరా జాస్మిన్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆమె ఎప్పుడూ ఇండస్ట్రీకి దూరంగా లేరు. నటనకు గ్యాప్ కూడా ఇవ్వలేదు. అయితే, 2014 తర్వాత మీరా జాస్మిన్ చేసిన సినిమాల సంఖ్య చూస్తే... నాలుగు అంటే నాలుగే. అవి కూడా మలయాళ సినిమాలు. తెలుగులో సినిమా చేసి అయితే పదేళ్ళు అవుతోంది.
Also Read : చిరంజీవి అభిమాని సినిమా - ట్రైలర్ విడుదల చేసిన రామ్ చరణ్
సముద్రఖని, మాస్టర్ ధృవన్, అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు, తమిళ ద్విభాషా సినిమా 'విమానం'. అందులో మీరా జాస్మిన్ నటించారు. ఎయిర్ హోస్టెస్ పాత్రలో కనిపించారు. అయితే... అది అతిథి పాత్ర తరహాలో ఉంటుంది. ఇప్పుడీ శ్రీ విష్ణు 'స్వాగ్'లో మీరా జాస్మిన్ పాత్ర నిడివి ఎక్కువే ఉంటుందట.
Also Read : చిరంజీవికి డబ్బే ముఖ్యమైతే 'ఆచార్య'కు తిరిగి ఇస్తారా? 'ఏజెంట్'కు అనిల్ సుంకర ఇచ్చారా?
'మోక్ష' (2013) తర్వాత మీరా జాస్మిన్ తెలుగులో సినిమాలు చేయలేదు. మొన్న 'విమానం'లో తళుక్కున మెరిశారు. అయితే, అంతకు ముందు స్టార్స్ సరసన నటించారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు... రవితేజ, గోపీచంద్, రాజశేఖర్, శ్రీకాంత్, శివాజీ వంటి హీరోలతో మీరా జాస్మిన్ నటించారు. శివాజీతో చేసిన 'అమ్మాయి బాగుంది'లో ఆమెది డ్యూయల్ రోల్. ఆ సినిమా మంచి పేరు తీసుకు వచ్చింది. రవితేజ 'భద్ర' కూడా తెలుగులో పెద్ద హిట్. 'గోరింటాకు'లో రాజశేఖర్ చెల్లెలి పాత్రలో మీరా జాస్మిన్ అభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది. డబ్బింగ్ సినిమా 'పందెం కోడి' కూడా మీరాకు మంచి హిట్ ఇచ్చింది.
ఇన్‌స్టాలో గ్లామరస్ ఎంట్రీ
తెలుగు ప్రేక్షకులు ఆల్మోస్ట్ మీరా జాస్మిన్ (Meera Jasmine)ను మర్చిపోయిన సమయంలో సోషల్ మీడియాలో ఆమె ఎంట్రీ హాట్ టాపిక్ అయ్యింది. తెలుగు సినిమాల్లో గానీ, ఆ సమయంలో ఇతర భాషల్లో చేసిన సినిమాల్లో గానీ మీరా జాస్మిన్ పద్ధతిగా కనిపించారు. డ్రస్సింగ్ ట్రెడిషనల్ గా ఉండేది. ఎప్పుడూ అందాల ప్రదర్శన చేసింది లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకుల చూపు తనవైపు తిప్పుకున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్
Actor Nagabhushana: కన్నడ హీరో కార్ యాక్సిడెంట్ - పుట్‌పాత్ మీద భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
త్రివిక్రమ్ చేతుల మీదుగా పులగం చిన్నారాయణ రచించిన 'జై విఠలాచార్య' పుస్తకావిష్కరణ
Ghost Trailer : 'కేజీఎఫ్' ని తలపించేలా 'ఘోస్ట్' ట్రైలర్ - గ్యాంగ్‌స్టర్‌గా శివన్న విధ్వంసం
Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు
PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు
Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'
/body>