Madam Chief Minister Movie : మహిళ ముఖ్యమంత్రి అయితే? - 'మేడమ్ చీఫ్ మినిస్టర్' షురూ!
డాక్టర్ సూర్య రేవతి మెట్టకూరు నటిస్తూ... స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందిస్తున్న సినిమా 'మేడమ్ చీఫ్ మినిస్టర్'. ఈ సినిమా శనివారం పూజతో మొదలైంది.
ఎన్నికలకు ముందు రాజకీయ నేపథ్యంలో చిత్రాలు రావడం సహజం. వెండితెరపై ఎన్నికల వేడి ఆల్రెడీ మొదలైంది. కొత్త సినిమాలకు సైతం కొబ్బరికాయ కొడుతూ... సెట్స్ మీదకు తీసుకు వెళుతున్నారు. ఆ జాబితాలో 'మేడమ్ చీఫ్ మినిస్టర్' చిత్రం మొదలైందని అనుకోవాలి. అయితే... ఇది పొలిటికల్ సినిమా కాదని, పబ్లిక్ సినిమా అని డా. సూర్య రేవతి మెట్టకూరు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
సూర్య రేవతి స్వీయ దర్శక నిర్మాణంలో...
డా. సూర్య రేవతి మెట్టకూరు (Surya Revathi Mettakuru) కథానాయికగా నటిస్తూ.... స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కిస్తున్న సినిమా 'మేడమ్ చీఫ్ మినిస్టర్' (Madam Chief Minister Telugu Movie). ఎస్.ఆర్.పి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోంది. ఆ సంస్థలో తొలి చిత్రమిది. ఇందులో సుహాస్ మీరా, ఎస్.బి. రామ్ ప్రధాన తారాగణం. అన్నపూర్ణ స్టూడియోలో శనివారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం అయ్యింది. అనంతరం సూర్య రేవతి మెట్టకూరుపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి తెలంగాణ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా - బాలీవుడ్ హీరోయిన్
ఐదు భాషల్లో 'మేడమ్ చీఫ్ మినిస్టర్'
తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 'మేడమ్ చీఫ్ మినిస్టర్' చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సూర్య రేవతి మెట్టకూరు తెలిపారు. ఈ సినిమా కథ, తీయడానికి స్ఫూర్తినిచ్చిన అంశాల గురించి ఆమె మాట్లాడుతూ ''ప్రస్తుతం మన సమాజం ఉన్న పరిస్థితులను వెండితెరపై చూపించాలని అనిపించింది. సినిమా సమాజంపై ప్రభావం చూపిస్తుంది. అందుకని, ఇన్నాళ్లు సేవా కార్యక్రమాలు చేసిన నేను ఈ మార్గాన్ని ఎంపిక చేసుకున్నా. 'మేడమ్ చీఫ్ మినిస్టర్' సందేశాత్మక సినిమా కాదు... కమర్షియల్ హంగులతో కూడిన కొత్త సినిమా. యువతకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా. ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన ఇండియా చాలా గొప్పది. అది చెప్పాలని నా ప్రయత్నం. మహిళ ముఖ్యమంత్రి అయితే అనేది చిత్ర కథాంశం'' అని చెప్పారు.
Also Read : రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ - నిర్మాత కుమార్తె?
ఐదు గ్రామాలను దత్తత తీసుకున్నా!
తన నేపథ్యం గురించి సూర్య రేవతి మెట్టకూరు మాట్లాడుతూ ''నేను అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేశా. ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చేశాక... పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డాక్టరేట్ చేశా. అమెరికాలో ఓ కంపెనీ ప్రారంభించాను. అక్కడ ఉన్నా సరే మన దేశాన్ని మరువలేదు. తొలుత ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నా. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్‌తో సమానంగా అభివృద్ధి చేశా. ఇప్పటికే ఐదు గ్రామాలను దత్తత తీసుకున్నా. నా సంపాదనలో 20 శాతం సమాజం కోసం ఖర్చు చేస్తున్నా. ఏడేళ్లుగా చేస్తున్న నా సేవలను గుర్తించి రాష్ట్రపతి నుంచి అవార్డు వచ్చింది. ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీ ఛైర్ పర్సన్ శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు సత్కరించారు'' అని తెలిపారు.
ఈ చిత్రానికి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ : ఎం. వెంకట చందు కుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత & ప్రొడక్షన డిజైనర్ : రామకృష్ణ పాలగాని, కూర్పు : సురేశ దుర్గం, ఛాయాగ్రహణం : వల్లెపు రవికుమార్, సాహిత్యం : పూర్ణాచారి, సంగీత దర్శకత్వం : కార్తీక్ బి.కొండకండ్ల, మాటలు - స్క్రీన్ ప్లే : సుహాస్ మీరా, కథ - నిర్మాణం - దర్శకత్వం : సూర్య రేవతి మెట్టకూరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial