రజినీకాంత్ తో లోకేష్ కనగరాజ్ మూవీ - రెగ్యులర్ షూటింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రజనీకాంత్ తో చేస్తున్న మూవీని 2024 ఫిబ్రవరి లో స్టార్ట్ చేసి దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తాజా సమాచారం వినిపిస్తోంది.
'విక్రమ్' సినిమాతో సౌత్ లో లోకేష్ కనకరాజ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ మూవీ గత ఎడాది విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. డిఫరెంట్ ఫిలిం మేకింగ్ తో డైరెక్టర్గా లోకేష్ తనకంటూ సొంత మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు. అంతేకాకుండా కోలీవుడ్ లో తక్కువ సమయంలో సినిమా తీసి విడుదల చేస్తున్న ఘనత కూడా ఈ డైరెక్టర్ కే దక్కుతుంది. కేవలం నెలల వ్యవధి లోనే సినిమా పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం లోకేష్ తలపతి విజయ్తో 'లియో' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ ఇయర్ స్టార్టింగ్ లో మొదలెట్టారు. దసరా సీజన్లో విడుదల చేస్తున్నారు.
'లియో' షూటింగ్ కూడా తక్కువ సమయంలోనే ముగించాడు లోకేష్ కనగరాజ్. అక్టోబర్ 19న దసరా కానుకగా 'లియో' వరల్డ్ వైడ్ గా గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఇక 'లియో' తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాని కూడా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడట ఈ డైరెక్టర్. తాజా సమాచారం ప్రకారం రజనీకాంత్ తో చేయబోయే ప్రాజెక్ట్ ని 2024 ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెట్టి, దీపావళి కానుకగా సినిమాను విడుదల చేసేందుకు లోకేష్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఇక వరుస అపజయాల తర్వాత 'జైలర్' తో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న రజినీకాంత్ తదుపరి చిత్రంగా లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ ఉండడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాల నెలకొన్నాయి. దానికి తోడు కార్తీ, కమలహాసన్, విజయ్ లాంటి స్టార్స్ కి బ్లాక్ బస్టర్ అందించిన లోకేష్ రజనీకాంత్ కి కూడా గ్యారెంటీగా మరో బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో భారీ డిమాండ్ ఉన్న డైరెక్టర్స్ లో లోకేష్ కనకరాజు ముందు వరుసలో ఉంటారు. అందుకే ఈ డైరెక్టర్ తో వర్క్ చేయడానికి మన టాలీవుడ్ స్టార్స్ కూడా ఆసక్తికరపరుస్తున్నారు.
ఇక లోకేష్ కనకరాజ్ 'లియో' విషయానికి వస్తే.. లోకేష్ యూనివర్స్ లో భాగంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. దీంతో 'లియో' పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. లోకేష్ - విజయ్ ల కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో దళపతి ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. సినిమాలో తలపతి విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్, అర్జున్ సర్జ, గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మిస్కిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్. ఎస్ లలిత్ కుమార్ సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తుండగా, అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : అమెరికాలో సత్తా చాటుతున్న ‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’, మిలియన్ డాలర్లు దాటిన వసూళ్లు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial