Lokesh Kanagaraj: ఆ మూవీ వేరే లెవల్ - బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌తో సినిమాపై లోకేశ్ కనగరాజ్ ఏమన్నారంటే?
Aamir Khan: స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌తో మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మూవీ వేరే లెవల్‌లో ఉంటుందని త్వరలోనే పట్టాలెక్కే ఛాన్స్ ఉందన్నారు.

Lokesh Kanagaraj Movie With Aamir Khan: స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ రజినీకాంత్ 'కూలీ' మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌తో మూవీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌పై ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
ఆ మూవీ వేరే లెవల్ అంతే...
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌తో ఓ మూవీ చేయబోతున్నట్లు లోకేశ్ తెలిపారు. ఇది బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ అని... పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ అందరినీ అలరించేలా ఈ మూవీ ఉంటుందని చెప్పారు. కొన్నేళ్ల క్రితమే స్టోరీ రాశానని... త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు వెల్లడించారు. గతంలోనూ ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ లోకేశ్‌తో మూవీపై క్లారిటీ ఇచ్చారు. ఆయనతో ఓ మూవీ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 'కూలీ' మూవీలో ఆమిర్ కీలక రోల్ పోషించారు.
స్టార్స్ లుక్స్... వెరీ సీక్రెట్
'కూలీ' మూవీ యాక్షన్ థ్రిల్లర్ అని... కమర్షియల్ అయినా ఎమోషన్ ఎక్కువగా ఉంటుందని లోకేశ్ తెలిపారు. రజినీకాంత్ సార్ మూవీ చూసి 'మరో దళపతిలా ఉంది' అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారని అన్నారు. 'సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకూ స్టార్స్ లుక్స్ రివీల్ చేయలేను. ఆగస్ట్ 2న ట్రైలర్ రిలీజ్ చేస్తాం. హార్బర్ బ్యాక్ డ్రాప్‌లో స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండే స్టోరీ ఇది. ఇప్పటివరకూ ఎప్పుడూ నటించని రోల్‌లో నాగార్జున సర్ చేశారు. ఆయన్ను ఒప్పించేందుకు చాలా టైం పట్టింది. ఓ రోల్ కోసం పహాద్ ఫాజిల్‌ను అనుకున్నా... ఆయన బిజీగా ఉండడంతో సౌబిన్ సాహిర్‌ను తీసుకున్నా. ఆగస్ట్ 14న మూవీ రిలీజ్ కానుంది.' అంటూ వివరించారు.
Also Read: గ్రేట్ ఎపిక్ 'రామాయణ' బడ్జెట్ ఎంతో తెలుసా? - కచ్చితంగా షాక్ కావాల్సిందే
లెర్నింగ్ దశలోనే ఉన్నా...
ఇటీవల ఓ ఈవెంట్‌లో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ చేసిన కామెంట్స్‌పై లోకేశ్ రియాక్ట్ అయ్యారు. 'లియో' మూవీలో ఓ చిన్న రోల్ ఇచ్చి తన టైం వృథా చేశారంటూ కామెంట్ చేయగా... దీనిపై లోకేశ్ స్పందించారు. 'తాను సరదాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో మరో విధంగా వైరల్ అయ్యాయని సంజయ్ దత్ నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను గొప్ప డైరెక్టర్‌ను కాదు. ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాను. భవిష్యత్తులో సంజయ్ దత్‌కు గొప్ప పాత్ర ఇస్తాను. నా మిస్టేక్ సరిదిద్దుకుంటాను.' అని అన్నారు.
నెక్స్ట్ మూవీస్ ఇవే...
లోకేశ్ అంటేనే ఓ సినిమాటిక్ యూనివర్స్ మనకు గుర్తొస్తుంది. లియో, విక్రమ్, ఖైదీ, మాస్టర్ వంటి మూవీస్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయన తన తర్వాత ప్రాజెక్టులపై క్లారిటీ ఇచ్చారు. 'కూలీ' రిలీజ్ తర్వాత కార్తితో 'ఖైదీ 2' తెరకెక్కించనున్నట్లు తెలిపారు. అది పూర్తైతే ఆమిర్ ఖాన్ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉందన్నారు. ఆ తర్వాత సూర్యతో 'రోలెక్స్' మూవీ చేయనున్నట్లు చెప్పారు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌తో 'విక్రమ్ 2', విజయ్‌తో 'మాస్టర్ 2', 'లియో 2' సినిమాలు... హీరోల డేట్స్ లభిస్తే చేస్తానని క్లారిటీ ఇచ్చారు.





















