Shruti Haasan: నన్ను నేనే ఎక్కువగా లవ్ చేస్తా - రిలేషన్, మ్యారేజ్‌పై శ్రుతి హాసన్ ఏమన్నారంటే?
Shruti Haasan Interview: సింగిల్ లైఫ్, మ్యారేజ్‌పై హీరోయిన్ శ్రుతి హాసన్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Shruti Haasan About Her Single Life: తనను తానే ఎక్కువగా ప్రేమిస్తానని స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ అన్నారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో తన సింగిల్ లైఫ్, రిలేషన్, మ్యారేజ్ వంటి అంశాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
సింగిల్ లైఫ్ అంటే...
30 ఏళ్లు వచ్చినా ఇంకా సింగిల్ లైఫ్‌లోనే ఎందుకు ఉండాల్సి వచ్చింది అన్న ప్రశ్నకు శ్రుతి హాసన్ క్లారిటీ ఇచ్చారు. తనతో తానే ఓ రిలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు. తాను ఒంటరిగానే ఉన్నా అది ఒంటరితనం కాదని అన్నారు. 'నేను ఇప్పుడు నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నా. నా సొంత వ్యక్తిగా మారేందుకు నేను జీవితం అంతా చాలా శ్రమించాను. ఒంటరిగా ఉండడం అంటే విరామం కాదు ఓ వేడుక.' అని చెప్పారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... శ్రుతి హాసన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా కెరీర్‌లో సొంతంగా తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుని దూసుకెళ్తున్నారని అంటున్నారు. ఒంటరి జీవితం, పెళ్లి, రిలేషన్ షిప్‌పై ఆమె అభిప్రాయాలను అందరూ గౌరవిస్తున్నారు.
Also Read: కూలీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సినిమా చూశాక దర్శకుడితో సూపర్ స్టార్ ఏం చెప్పారంటే?
పెళ్లంటే భయం
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్ పెళ్లిపై కీలక కామెంట్స్ చేశారు. తనకు లవ్ అంటే నమ్మకమేనని... అయితే పెళ్లంటే మాత్రం భయం అని తెలిపారు. మ్యారేజ్ రిలేషన్ దానికి సంబంధించిన విలువలను గౌరవిస్తానని... కానీ వాటిని ధ్రువీకరించేందుకు ఓ చట్టపరమైన పేపర్ అవసరం లేదనేదే తన ఒపీనియన్ అని అన్నారు. 'నా కెరీర్‌లో ముందుకెళ్లడానికి పాపులారిటీ సంపాదించుకోవడానికి నేను చాలా శ్రమించాను. పెళ్లి అనేది ఓ బాధ్యత. ఆ గుర్తింపును ఓ కాగితం ముక్కతో ముడిపెట్టాలనే ఆలోచనే భయం అనిపిస్తుంది.
పెళ్లంటే ఇద్దరు మనుషులు భవిష్యత్తును పంచుకోవడం. అది ఓ లైఫ్ లాంగ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పటికే ఓసారి పెళ్లికి దగ్గరగా వెళ్లాను. అనుకోని కారణాలతో ఆ బంధం మధ్యలోనే ముగిసిపోయింది.' అని తెలిపారు.
సినిమాల విషయానికొస్తే... శ్రుతిహాసన్... రీసెంట్‌గా రజినీకాంత్ 'కూలీ' మూవీలో నటించారు. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించగా... సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తలైవాతో పాటు శ్రుతి హాసన్, కింగ్ నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, ఆమిర్ ఖాన్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా స్థాయిలో ఆగస్ట్ 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.






















