Vishal 35: విశాల్ సరసర దుషారా విజయన్... 99 @ సూపర్ గుడ్ ఫిల్మ్స్ షురూ
Vishal 35th movie launch: విశాల్ సరసన దుషారా విజయన్ నటిస్తున్నారు. వీళ్ళు జంటగా నటిస్తున్న సినిమా 'సూపర్ గుడ్ ఫిలిమ్స్' సంస్థలో 99వది కావడం విశేషం. ఆ సినిమా పూజతో మొదలైంది.

కథానాయకుడిగా విశాల్ ప్రయాణం 35 సినిమాల వరకు వచ్చింది. ఆయన 35వ సినిమా తాజాగా చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆ వేడుకకు హీరో కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ఆ సినిమా స్పెషాలిటీ ఏమిటో తెలుసా?
విశాల్ సరసన దుషారా విజయన్
Vishal to romance Dushara Vijayan: దుషారా విజయన్ గుర్తు ఉన్నారా? 'రాయన్' సినిమాలో ధనుష్ సిస్టర్ రోల్ చేశారు. 'వీర ధీర శూర' సినిమాలో విక్రమ్ జంటగా నటించారు. ఇప్పుడు విశాల్ 35వ సినిమా ఆయనకు జంటగా నటించనున్నారు.
విశాల్ 35 ప్రత్యేకత ఏమిటంటే... ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరికి చెందిన సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలో 99వది. తమిళ, తెలుగు భాషల్లో అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించడంతో పాటు పలువురు కొత్త దర్శకులను పరిచయం చేసింది. ఇక, విశాల్ చిత్రానికి రవి అరసుకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించింది.
Also Read: కూలీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సినిమా చూశాక సూపర్ స్టార్ ఏం చెప్పారంటే?

చెన్నైలో సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విశాల్ 35వ సినిమా ప్రారంభోత్సవానికి దర్శకులు వెట్రిమారన్, శరవణ సుబ్బయ్య (సిటిజన్), మణిమారన్ (NH4), వెంకట్ మోహన్ (అయోగ్య), శరవణన్ (ఎంగేయుమ్ ఎప్పోదుం)తో పాటు హీరోలు కార్తీ, జీవా తదితరులు హాజరు అయ్యారు.
Also Read: శ్రీలీల ఫ్యాన్స్‌కు పండగ... 'మాస్ జాతర'లో దుమ్ములేపే డాన్స్ నంబర్
టోటల్ షూటింగ్ డేస్ 45 మాత్రమే...
చెన్నైలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాను 45 రోజుల సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేస్తామని చెప్పారు. Vishal 35th movie cast and crew: విశాల్, దుషారా విజయన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో తంబి రామయ్య, అర్జై ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్: వాసుకి భాస్కర్, కూర్పు: ఎన్‌బి శ్రీకాంత్, కళా దర్శకుడు: జి. దురైరాజ్,ఛాయాగ్రహణం: రిచర్డ్ ఎం. నాథన్, సంగీత దర్శకుడు: జి.వి. ప్రకాష్ కుమార్, నిర్మాణ సంస్థ: సూపర్ గుడ్ ఫిల్మ్స్, నిర్మాత: ఆర్‌బి చౌదరి, దర్శకుడు: రవి అరసు.





















