Ramayana Movie: గ్రేట్ ఎపిక్ 'రామాయణ' బడ్జెట్ ఎంతో తెలుసా? - కచ్చితంగా షాక్ కావాల్సిందే
Ramayana Budget: మహా ఇతిహాసం 'రామాయణ' బడ్జెట్ గురించి ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా ఈ మూవీ నిలవనున్నట్లు చెప్పారు.

Nitesh Tiwari's Ramayana Shocking Budget: 'రామాయణ'... ఈ మహా ఇతిహాసం కోసం బాలీవుడ్ సహా ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ విజువల్ వండర్ అనేలా ఉంది. గ్రాఫిక్ వర్క్స్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తుండగా... నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు.
వామ్మో... బడ్జెట్ ఎంతో తెలుసా?
ఈ మూవీని రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. రెండు పార్టులుగా 'రామాయణ' తెరకెక్కిస్తుండగా... తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో మూవీ బడ్జెట్‌కు సంబంధించి నమిత్ మల్హోత్రా అధికారిక ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు $500 మిలియన్లు అంటే రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.
తక్కువ బడ్జెట్... బిగ్ మూవీ
'రామాయణ' రెండు పార్టులు పూర్తయ్యే సరికి రూ.4 వేల కోట్ల బడ్జెట్ అవుతుందని తెలిపారు నమిత్. 'ప్రపంచం చూడాల్సిన గొప్ప స్టోరీ రామాయణ. వరల్డ్‌లోనే అతి పెద్ద చిత్రాన్ని మేము నిర్మించబోతున్నాం. కొన్ని హాలీవుడ్ చిత్రాల బడ్జెట్ కంటే ఇది తక్కువే. తక్కువ ఖర్చుతో పెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ మూవీ డబ్బు కోసం చేస్తుంది కాదు. మన రాముడి గురించి ప్రపంచానికి చెప్పాలని అనుకున్నాం.' అని చెప్పారు.
Also Read: కూలీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... సినిమా చూశాక దర్శకుడితో సూపర్ స్టార్ ఏం చెప్పారంటే?
వరల్డ్‌లోనే భారీ బడ్జెట్
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ చూసుకుంటే ఇప్పటివరకూ ఇంత భారీ బడ్జెట్‌తో మూవీస్ తీసింది లేదు. ఇండియన్ మూవీస్‌లో ఏ చిత్రాల బడ్జెట్ కూడా ఇప్పటివరకూ రూ.1000 కోట్లు దాటలేదు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి', 'RRR' మూవీస్ కూడా రూ.వందల కోట్ల బడ్జెట్‌తోనే కంప్లీట్ అయ్యాయి. తాజాగా... నిర్మాత చెప్పిన లెక్కల ప్రకారం 'రామాయణ' ప్రపంచ సినిమాల్లోనే అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీగా నిలవనున్నట్లు తెలుస్తోంది.
హాలీవుడ్ రేంజ్‌లో...
'రామాయణ' మూవీని హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిస్తుండగా... ప్రపంచవ్యాప్తంగా 20 భాషల్లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అక్కడి సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచస్థాయికి మరోసారి ఉన్నతంగా తీసుకెళ్లేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై హైప్ పదింతలైంది.
రోల్స్... స్టార్స్
ఈ మూవీలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తుండగా... పాన్ ఇండియా స్టార్ యశ్ రావణుడిగా చేస్తున్నారు. లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. రావణుడి భార్య మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్, బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హనుమంతుని పాత్రలో చేస్తున్నారు. దశరథుని భార్య, రాముడి తల్లి కౌశల్యగా ఇందిరా కృష్ణన్, కైకేయి పాత్రలో లారా దత్తా నటిస్తున్నారు. శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త విద్యుత్జిహ్వగా వివేక్ ఒబెరాయ్, మంధర పాత్రలో షీబా చద్దా రాణి చేస్తున్నారు.
ఈ మూవీ కోసం దాదాపు 10 వేల మంది నటీనటులు, టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నట్లు నితేశ్ తివారి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌ను 2026 దీపావళికి, రెండో పార్ట్‌ను 2027 దీపావళికి రిలీజ్ చేయనున్నారు.






















