Kushi Movie Run Time : 'ఖుషి' సెన్సార్ పూర్తి - విజయ్ దేవరకొండ, సమంత సినిమా రన్ టైమ్ ఎంతంటే?
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషి' సినిమా సెన్సార్ పూర్తి అయ్యింది. సినిమాకు సెన్సార్ బోర్డు ఏం సర్టిఫికెట్ ఇచ్చింది? రన్ టైమ్ ఎంత?
'ది' విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన సినిమా 'ఖుషి' (Kushi Movie). మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. సెప్టెంబర్ 1న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో... పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతోంది. విడుదలకు పది రోజుల ముందు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.
'ఖుషి'కి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటి?
Kushi movie censor certificate : 'ఖుషి' సినిమాకు సెన్సార్ బోర్డు 'యు/ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే... పెద్దలతో పాటు పిల్లలు కూడా సినిమా చూడొచ్చు అన్నమాట. ఇంకా ఈ సినిమా రన్ టైమ్ విషయానికి వస్తే... 165 నిమిషాలు (Kushi Run Time)! అంటే... రెండు గంటల 45 నిమిషాలు అన్నమాట. మూడు గంటలకు ఒక్క పావుగంట తక్కువ.
'ఖుషి' పాటలు అన్నీ హిట్టు!
'ఖుషి' సినిమాలో అన్ని పాటలను చిత్ర దర్శకుడు శివ నిర్వాణ స్వయంగా రాసిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహెబ్ అడగటం, కరోనా కారణంగా కొంత సమయం లభించడంతో పాటలన్నీ రాశానని, అలాగని తన తదుపరి చిత్రాల్లో పాటలు రాసే ఉద్దేశం లేదని, అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని శివ నిర్వాణ చెప్పారు. నిజం చెప్పాలంటే... సినిమాలో పాటలు అన్ని హిట్ అయ్యాయి. సినిమాపై అంచనాలు పెంచాయి.
Also Read : అవును, పవన్ కళ్యాణ్ సినిమాలో - కన్ఫర్మ్ చేసిన హీరోయిన్
విజయ్ దేవరకొండ, సమంత డ్యాన్స్ అదుర్స్!
సినిమా విడుదలకు 15 రోజుల ముందు 'ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్' పేరుతో ఆగస్టు 15న హైదరాబాద్‌లో భారీ ఫంక్షన్ నిర్వహించారు. అందులో హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, సమంత చేసిన పెర్ఫార్మన్స్ ప్రేక్షకుల దృష్టిని అమితంగా ఆకర్షించింది. సినిమాపై అంచనాలు పెంచింది. ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా కథ ఏమిటనేది అందులో క్లారిటీ ఇచ్చేశారు.
Also Read : 'యశోద' నిర్మాత చేతికి '800' - ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ రిలీజ్ ఎప్పుడంటే?
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, ఆలీ, శరణ్య పొన్నవణ్నన్, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి మేకప్ : బాషా, కాస్ట్యూమ్ డిజైనర్స్ : రాజేష్ - హర్మన్ కౌర్ - పల్లవి సింగ్, కళా దర్శకత్వం : ఉత్తర కుమార్ - చంద్రిక, పోరాటాలు : పీటర్ హెయిన్, రచనా సహకారం : నరేష్ బాబు .పి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : దినేష్ నరసింహన్, కూర్పు : ప్రవీణ్ పూడి, ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్, సంగీతం : హేషమ్ అబ్దుల్ వాహబ్, సి.ఇ.ఓ : చెర్రీ, ఛాయాగ్రహణం : జి. మురళి, నిర్మాతలు : నవీన్ యేర్నేని - రవిశంకర్ యలమంచిలి, కథ, కథనం, కొరియోగ్రఫీ, దర్శకత్వం : శివ నిర్వాణ.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial