News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Muttiah Muralitharan Biopic : 'యశోద' నిర్మాత చేతికి '800' - ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ రిలీజ్ ఎప్పుడంటే?

Muttiah Muralitharan Biopic 800 Release Update: లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 ఆలిండియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్నారు.

FOLLOW US: 
Share:

లెజెండరీ క్రికెటర్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan) జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం '800'. ఈ చిత్రానికి ఎంఎస్ శ్రీపతి (MS Sripathy) దర్శకుడు. బుకర్ ప్రైజ్ (2022) విన్నర్ షెహన్ కరుణతిలకతో కలిసి స్క్రిప్ట్ రాశారాయన. ఈ బయోపిక్ (800 Movie)లో మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్, మురళీధరన్ భార్య మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు.

'యశోద' నిర్మాత చేతికి '800'
800 Movie Distribution Rights : '800' పాన్ ఇండియా థియేట్రికల్ (డిస్ట్రిబ్యూషన్) హక్కులను ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ (Sivalenka Krishna Prasad) సొంతం చేసుకున్నారు. తమిళంలో రూపొందించిన చిత్రమిది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నారు. ఏడాదిన్నర పాటు చిత్ర బృందం అంతా ఎంతో శ్రమించి... చెన్నై, కొచ్చిన్, చంఢీగఢ్, శ్రీలంక, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలోని ప్రదేశాల్లో చిత్రీకరణ చేశారు. చిత్ర నిర్మాణానికి భారీగా ఖర్చు అయినట్లు సమాచారం. 

Also Read : శంకర్ ఎప్పుడు చెబితే అప్పుడు - చేతులు ఎత్తేసిన 'దిల్' రాజు

సమంత ప్రధాన పాత్రలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన 'యశోద' చిత్రానికి జాతీయ స్థాయిలో మంచి స్పందన లభించింది. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో కొత్త కథాంశంతో వచ్చిన సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత శ్రీదేవి మూవీస్ విడుదల చేస్తున్న చిత్రమిది.   

అక్టోబర్‌లో '800' విడుదలకు సన్నాహాలు
800 Movie Release Updates : సెప్టెంబర్‌లో '800' బయోపిక్ ట్రైలర్, అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని శివలెంక కృష్ణప్రసాద్  తెలిపారు. ఇంకా ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ''ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో నిజ జీవితంలో ఆయన ఎదుర్కొన్న ఎన్నో సంఘటనలు, ఎత్తుపల్లాలు చాలా భావోద్వేగ భరితంగా ఉంటాయి. అటువంటి పరిస్థితులను అధిగమిస్తూ... 800 వికెట్లు తీసి వరల్డ్ రికార్డ్ సాధించిన ఘనత మురళీధరన్ సొంతం. బాల్యం నుంచి ఆయన ప్రయాణం, ఆయన పడిన స్ట్రగుల్స్, అన్నీ సినిమాలో ఉంటాయి. ఇటువంటి చిత్రాన్ని ఆలిండియా స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గత ఏడాది మా 'యశోద'ను జాతీయ స్థాయిలో విడుదల చేసి నిర్మాతగా విజయం అందుకున్నాను. ఇప్పుడీ '800' చిత్రాన్ని కూడా జాతీయ స్థాయిలో పంపిణి చేసి విజయం సాధిస్తానని చాలా నమ్మకంగా ఉన్నాను. '800' చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్నాయి. రీ రికార్డింగ్, గ్రాఫిక్ వర్క్స్ జరుగుతున్నాయి'' అని చెప్పారు.

Also Read ప్రతి పండక్కి, ప్రతి నెలలో శ్రీ లీల సినిమా... వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు  

మధుర్ మిట్టల్, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో నరెన్, నాజర్, వేల్ రామమూర్తి, రిత్విక, వడివుక్కరసి, అరుల్ దాస్, హరి కృష్ణన్, శరత్ లోహితశ్వ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు : ప్రవీణ్ కెఎల్, ఛాయాగ్రహణం : ఆర్.డి. రాజశేఖర్, సంగీతం : జిబ్రాన్, రచన - దర్శకత్వం : ఎంఎస్ శ్రీపతి.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 22 Aug 2023 05:48 PM (IST) Tags: Sivalenka Krishna Prasad muttiah muralitharan biopic Yashoda Movie Producer 800 Movie Updates 800 All India Distribution Rights Muttiah Muralitharan Biopic Release Update Muttiah Muralitharan Biopic Trailer 800 Pan Indian Theatrical Rights

ఇవి కూడా చూడండి

Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?

Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?

Vijay Antony: మూవీ ప్రమోషన్స్‌ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్

Vijay Antony:  మూవీ ప్రమోషన్స్‌ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్

Shiva Rajkumar: హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్

Shiva Rajkumar: హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్

‘సలార్’ రిలీజ్ డేట్, ‘పెదకాపు 1’ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘సలార్’ రిలీజ్ డేట్, ‘పెదకాపు 1’ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Tiger Nageswara Rao Movie : రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'లో తమిళ బ్యూటీ - ఎవరో తెలుసా?

Tiger Nageswara Rao Movie : రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'లో తమిళ బ్యూటీ - ఎవరో తెలుసా?

టాప్ స్టోరీస్

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Disney Password Sharing: ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ - నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్న డిస్నీ!

Disney Password Sharing: ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ - నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్న డిస్నీ!

Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?

Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?