News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Sreeleela Upcoming Movies : వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు - ప్రతి పండక్కి, నెలలో శ్రీ లీల సినిమా!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు క్రేజీ హీరోయిన్ ఎవరు? అంటే... ఒక్క శ్రీ లీల పేరు చెప్పాలి. వచ్చే ఐదు నెలలు, అన్ని పెద్ద పండగలకు ఆమె సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.

FOLLOW US: 
Share:

ఇప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమ (Telugu Film Industry)లో క్రేజీ హీరోయిన్ ఎవరు? అని ప్రశ్నిస్తే... వినిపించే ఏకైక పేరు బహుశా శ్రీ లీల (Sreeleela)ది మాత్రమే అవుతుంది ఏమో? ప్రస్తుతం ఆమె చేతిలో సుమారు డజను సినిమాలు ఉన్నాయి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి... యంగ్ హీరోలు రామ్, నితిన్, విజయ్ దేవరకొండ, పంజా వైష్ణవ్ తేజ్ వరకు పలువురు హీరోలతో శ్రీ లీల సినిమాలు చేస్తున్నారు. 

వినాయక చవితి నుంచి రాబోయే సంక్రాంతి వరకు... ప్రతి పండక్కి, ప్రతి నెలలో శ్రీ లీల సినిమా విడుదల కానుంది. థియేటర్లలో ఆమె సందడి చేయనుంది. అన్నీ మాంచి క్రేజ్ ఉన్న సినిమాలే. ప్రతి సినిమాలో శ్రీ లీల డ్యాన్స్ ఎలివేట్ అయ్యే పాటలు కూడా ఉన్నాయి. రాబోయే ఐదు నెలల్లో ఐదుసార్లు థియేటర్లలో ప్రేక్షకులను పలకరించడానికి శ్రీ లీల సిద్ధమయ్యారు. ఆ సినిమాలు ఏవో ఒక్కసారి చూడండి.

వినాయక చవితికి 'స్కంద'తో షురూ
యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేనికి జోడీగా శ్రీ లీల నటించిన సినిమా 'స్కంద' (Skanda The Attacker). బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రమిది. సెప్టెంబర్ 15న విడుదల కానుంది. అదీ పాన్ ఇండియా స్థాయిలో! సెప్టెంబర్ 18న వినాయక చవితి. ఆ పండక్కి థియేటర్లలో శ్రీ లీల సందడి ఉంటుందన్నమాట!

విజయ దశమికి 'భగవంత్ కేసరి'తో...
వినాయక చవితి సందడి ముగిసిన తర్వాత విజయ దశమికి మళ్ళీ 'భగవంత్ కేసరి' (Bhagavath Kesari)తో థియేటర్లలోకి రానున్నారు శ్రీ లీల. ఆ సినిమాలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. అయితే... శ్రీ లీలది కీలక పాత్ర. అది ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆమె అభిమానులకు కిక్ ఇచ్చే మ్యాటర్ ఏమిటంటే... శ్రీ లీల మాంచి డ్యాన్స్ నంబర్ చేశారట. అక్టోబర్ 19న సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. 

దీపావళికి 'ఆదికేశవ'తో మళ్ళీ...
నిజం చెప్పాలంటే... ముందు ప్లానింగ్‌లో దీపావళికి శ్రీ లీల సినిమా లేదు. పంజా వైష్ణవ్ తేజ్ జోడీగా ఆమె నటించిన 'ఆదికేశవ' (Aadikeshava Movie) ఈపాటికి విడుదల కావాలి. అయితే, పలు వాయిదాలు పడి దీపావళి బరిలో నిలిచింది. ఆ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 

క్రిస్మస్ కానుకగా నితిన్ 'ఎక్స్‌ట్రా'
క్రిస్మస్ సీజన్ కూడా శ్రీ లీల మిస్ కావడం లేదు. డిసెంబర్ 23న నితిన్ 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్' (Extra Ordinary Man 2023 movie) ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో శ్రీ లీల హీరోయిన్. ఆ సినిమాలో ఓ పాట విడుదలైంది. హారిస్ జయరాజ్ మంచి మెలోడీ అందించారు. 'కిక్' రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 'కిక్' తర్వాతలో ఉంటుందని చెబుతున్నారు. 

సంక్రాంతికి 'గుంటూరు కారం'తో...
సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు... 2023లో రాబోయే నాలుగు నెలల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న శ్రీ లీల సినిమాలు ఒక ఎత్తు. ఆ తర్వాత 2024 సంక్రాంతికి వస్తున్న సినిమా మరో ఎత్తు. సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం'లో (Guntur Kaaram Movie) ఆమె నటిస్తున్నారు. తొలుత పూజా హెగ్డే ప్రధాన కథానాయిక అనుకున్నా... తర్వాత జరిగిన పరిణామాల కారణంగా శ్రీ లీలకు ఆ అవకాశం లభించింది. 

Also Read  ఝలక్ ఇచ్చిన అనసూయ - సోషల్ మీడియా నెగిటివిటీకి కాదు, ఏడ్చింది అందుకేనట!

ఈ ఐదు సినిమాలు మాత్రమే కాదు... పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', విజయ్ దేవరకొండతో ఓ సినిమా శ్రీ లీల చేతిలో ఉన్నాయి. కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. మరికొన్ని సినిమాల్లో ఆమెతో ప్రత్యేక గీతాలు చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాబోయే ఏడాది అంతా థియేటర్లలో శ్రీ లీల హవా కంటిన్యూ అయ్యేలా ఉంది. 

Also Read 'భగవంత్ కేసరి' ప్రీ రిలీజ్ బిజినెస్ - బాలకృష్ణ ముందున్న టార్గెట్ ఎంతంటే?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 19 Aug 2023 09:42 PM (IST) Tags: Sreeleela upcoming movies Guntur kaaram Movie Bhagavanth Kesari Adikeshava Movie Skanda Movie Sreeleela New Movies Sreeleela Upcoming Releases Sreeleela Festival Releases Extraordinary Man 2023 Movie

ఇవి కూడా చూడండి

Baby Movie: ‘బేబీ’ నిర్మాత సంతోషం - దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్, భలే బాగుంది.. మీరూ చూడండి

Baby Movie: ‘బేబీ’ నిర్మాత సంతోషం - దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్, భలే బాగుంది.. మీరూ చూడండి

Vijay Antony: పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్

Vijay Antony: పాన్ ఇండియా రేంజ్‌లో విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ‘హిట్లర్’, ఆసక్తికరంగా మోషన్ పోస్టర్

Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ సినిమాకు సీక్వెల్ - తెలుగు, కన్నడలో ఒకేసారి రిలీజ్

Sapta Sagaralu Dhaati: ‘సప్త సాగరాలు దాటి’ సినిమాకు సీక్వెల్ - తెలుగు, కన్నడలో ఒకేసారి రిలీజ్

Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?

Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?

Vijay Antony: మూవీ ప్రమోషన్స్‌ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్

Vijay Antony:  మూవీ ప్రమోషన్స్‌ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్

టాప్ స్టోరీస్

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?