News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

మంచు విష్ణు ‘కన్నప్ప' నుంచి తప్పుకున్న కృతి సనన్ సోదరి - కారణం?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' నుండి బాలీవుడ్ బ్యూటీ నుపూర్ సనన్ హీరోయిన్ గా తప్పుకున్నారు. ఈ విషయాన్ని మంచి విష్ణు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

FOLLOW US: 
Share:

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమాని ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగస్టు నెలలో శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్వయంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇందులో ఆయన ఓ కీలక పాత్ర కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. హిందీ మహాభారతం సీరియల్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ మంచి విష్ణు డ్రీం ప్రాజెక్టు 'కన్నప్ప'ను తెరకెక్కిస్తున్నారు.

ఈ ప్రాజెక్టులో పాన్ ఇండియా హీరో ప్రభాస్ సైతం ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే కదా. రీసెంట్‌గా జరిగిన పూజా కార్యక్రమాలకు కూడా నుపుర్ సనన్ హాజరయ్యారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మంచు విష్ణు స్వయంగా తెలియజేశారు.

ఈ మేరకు తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. "దురదృష్టం. లవ్లీ లేడీ నుపుర్ సనన్ కన్నప్ప ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. మరొక హీరోయిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. షెడ్యూల్స్ కి నుపుర్ సనన్ డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడమే కారణం. ఆమె ఇతర ప్రాజెక్టుకి ఆల్ ది బెస్ట్" అని తన ట్వీట్ లో పేర్కొన్నారు మంచు విష్ణు. దీంతో ఈ ట్వీట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నుపుర్ సనన్ స్థానంలో ఏ హీరోయిన్ ని మేకర్స్ ఫైనల్ చేస్తారనేది చూడాలి. రవితేజ నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరావు' సినిమాతో నుపుర్ సనన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మరోవైపు 'కన్నప్ప'లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కీలకపాత్ర పోషిస్తున్నారనే విషయంతో ఈ ప్రాజెక్టుపై ఒక్కసారిగా హైప్ పెరిగింది. సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే కనుక నిజమైతే కన్నప్ప సినిమాకు ఇది చాలా ప్లస్ అవుతుందని అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మంచి విష్ణు మార్కెట్ పూర్తిగా డౌన్ ఫాల్ లో ఉంది. కాబట్టి మంచి విష్ణు హీరోగా నటించే కన్నప్పలో ప్రభాస్ నటిస్తే ఖచ్చితంగా ప్రభాస్ క్రేజ్ తో ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ దక్కే అవకాశం ఉంది.

నిజానికి ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు హీరోగా బాపు దర్శకత్వంలో 1976లో వచ్చిన 'భక్తకన్నప్ప' బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాని రీమేక్ చేయాలన్నది ప్రభాస్ చిరకాల కోరిక. అప్పట్లో తన పెద్ద నాన్నతో కలిసి ఈ ప్రాజెక్ట్ చేయాలని డార్లింగ్ ప్రయత్నించినా అది కుదరలేదు. కృష్ణంరాజు కూడా ప్రభాస్ ను భక్తకన్నప్పగా చూడాలని అనుకున్నారు, కానీ అది జరగలేదు. మరి నిజంగానే ప్రభాస్ కన్నప్పలో శివుడిగా నటిస్తున్నాడా? అనేది తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.

Also Read : యాంకర్‌ మెడలో దండేసిన నటుడు, వెంటనే ఆమె ఆ దండ తీసి ఏం చేసిందో చూడండి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 21 Sep 2023 08:27 PM (IST) Tags: Manchu Vishnu Nupur Sanon Mohan Babu Kannappa Movie Kannappa Manchu Vishnu's Kannappa

ఇవి కూడా చూడండి

Calling Sahasra Review - కాలింగ్ సహస్ర రివ్యూ: కంఫర్ట్ జోన్ బయటకు 'సుడిగాలి' సుధీర్ - సినిమా ఎలా ఉందంటే?

Calling Sahasra Review - కాలింగ్ సహస్ర రివ్యూ: కంఫర్ట్ జోన్ బయటకు 'సుడిగాలి' సుధీర్ - సినిమా ఎలా ఉందంటే?

Atharva Movie Review - అథర్వ సినిమా రివ్యూ: హీరోయిన్‌ను మర్డర్‌ చేసిందెవరు? క్లూస్‌ టీమ్‌లో హీరో ఏం చేశాడు?

Atharva Movie Review - అథర్వ సినిమా రివ్యూ: హీరోయిన్‌ను మర్డర్‌ చేసిందెవరు? క్లూస్‌ టీమ్‌లో హీరో ఏం చేశాడు?

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Randeep Hooda: మణిపూర్ యువతిని పెళ్లాడిన బాలీవుడ్ హీరో - వెడ్డింగ్ ఫొటోలు వైరల్

Randeep Hooda: మణిపూర్ యువతిని పెళ్లాడిన బాలీవుడ్ హీరో - వెడ్డింగ్ ఫొటోలు వైరల్

Animal Movie Leak : 'యానిమల్' మూవీకి భారీ షాక్ - రిలీజైన కొన్ని గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్ లీక్

Animal Movie Leak : 'యానిమల్' మూవీకి భారీ షాక్ - రిలీజైన కొన్ని గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్ లీక్

టాప్ స్టోరీస్

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు

Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం