By: ABP Desam | Updated at : 21 Sep 2023 07:40 PM (IST)
Photo Credit : Anchor aishwarya/Twitter
తమిళ నటుడు కూల్ సురేష్ స్టేజ్ పై యాంకర్ తో అనుచితంగా ప్రవర్తించి తీవ్ర విమర్శల పాలయ్యాడు. 'సరక్కు' సినిమా మ్యూజిక్ లాంచ్ ఈవెంట్ కు అటెండ్ అయిన కూల్ సురేష్ స్టేజిపై మాట్లాడుతూనే పక్కనే ఉన్న మహిళా యాంకర్ మెడలో పూలమాల వేశాడు. ఇది ఊహించని యాంకర్ ఐశ్వర్య ఆ దండను విసిరేసి తన ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత మాట్లాడిన మన్సూర్ అలీ ఖాన్.. కూల్ సురేష్ చేసిన పనిని ఖండిస్తూ ఆయన తరపున క్షమాపణలు చెప్పారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవ్వడం, సదరు నటుడిపై ఓ రేంజ్ లో విమర్శలు వస్తున్నాయి. దీంతో కూల్ సురేష్ తన చర్యలకు క్షమాపణ చెబుతూ ఓ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. సినిమా ప్రమోషన్ కోసమే అలాంటి పని చేశానని చెబుతూ.. తాను ఒకరిని బాధ పెట్టినందుకు చింతిస్తున్నానని, నిజంగానే తాను చేసింది చాలా పెద్ద తప్పు అని ఒప్పుకున్నాడు. అందుకు బహిరంగంగా క్షమాపణలు కోరాడు. ఇకపై అలాంటి తప్పులు చేయనని తాజా వీడియోలో పేర్కొన్నాడు. తాజాగా యాంకర్ ఐశ్వర్య సైతం ఈ సంఘటన పై స్పందించింది.
ఈ మేరకు ఐశ్వర్య మాట్లాడుతూ.. "ఆ సంఘటన గురించి తలుచుకుంటే ఇప్పటికీ షాక్ అవుతున్నాను. ఎవరు ఊహించని సమయంలో తను నా భుజాన్ని బలవంతంగా నొక్కి అలా ప్రవర్తించాడు. ఎవరైనా అకస్మాత్తుగా బహిరంగంగా ఇలా ప్రవర్తిస్తే మీరేం చేస్తారు? చెంప పగలగొడతారు కదా! అలాగే ఇప్పుడు నేను అతని చెంప మీద ఎందుకు కొట్టలేదని ఆశ్చర్యపోతున్నాను. ఇంతకుముందు కూడా కూల్ సురేష్ షోలో నాతో అనుచితంగా ప్రవర్తించాడు. ఆయన చేసే పనులు నాకు ఎప్పటి నుంచో నచ్చడం లేదు. అందుకే అతన్ని స్టేజ్ పైకి పిలిచేప్పుడు నటుడు కూల్ సురేష్ అని మాత్రమే పిలుస్తాను. తనని అలా పిలవకూడదని అతడు చాలాసార్లు కండిషన్ పెట్టాడు. ఎందుకంటే అతడికి యూట్యూబ్ సూపర్ స్టార్ అనే బిరుదు ఉంది. ఆ బిరుదును తన పేరు ముందు పెట్టి ఎందుకు పిలవరని పలుమార్లు గొడవ కూడా పెట్టుకున్నాడు. కానీ అతని ప్రవర్తన సరిగా లేదు కాబట్టే నేను అలా పిలువనని చెప్పాను" అంటు ఐశ్వర్య గట్టిగానే హెచ్చరించింది.
అంతేకాకుండా దాన్ని మనసులో పెట్టుకొని ఈసారి దాన్ని మెడలో దండ వేసి అవమానించాలని కూల్ సురేష్ ప్లాన్ చేసినట్లు ఐశ్వర్య చెప్పింది. ఇంకోసారి తన పట్ల ఇలా చేస్తే చెంప మీద కొట్టినా కొట్టేస్తానని పేర్కొంది. కనీసం అలాంటి పని చేయలేకున్నా అతనిపై ఖచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఐశ్వర్య చెప్పుకొచ్చింది. దీంతో ఐశ్వర్య చేసిన ఈ కామెంట్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Her reaction 🤦#CoolSuresh 🤷pic.twitter.com/KzOUAa604M
— Troll Cinema ( TC ) (@Troll_Cinema) September 20, 2023
#CoolSuresh apologizes for yesterday's #Sarakku Press meet incident.. pic.twitter.com/RLIbmVAtaj
— Ramesh Bala (@rameshlaus) September 20, 2023
Also Read : 'పుష్ప' నిర్మాతలతో నవీన్ పొలిశెట్టి నెక్స్ట్ మూవీ - డైరెక్టర్ ఎవరంటే?
Calling Sahasra Review - కాలింగ్ సహస్ర రివ్యూ: కంఫర్ట్ జోన్ బయటకు 'సుడిగాలి' సుధీర్ - సినిమా ఎలా ఉందంటే?
Atharva Movie Review - అథర్వ సినిమా రివ్యూ: హీరోయిన్‌ను మర్డర్ చేసిందెవరు? క్లూస్ టీమ్‌లో హీరో ఏం చేశాడు?
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
Randeep Hooda: మణిపూర్ యువతిని పెళ్లాడిన బాలీవుడ్ హీరో - వెడ్డింగ్ ఫొటోలు వైరల్
Animal Movie Leak : 'యానిమల్' మూవీకి భారీ షాక్ - రిలీజైన కొన్ని గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్ లీక్
AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో నేడు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు
Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం
Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం
/body>