By: ABP Desam | Updated at : 21 Sep 2023 06:59 PM (IST)
Photo Credit : Mythri Movie Makers/Twitter
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలీస్ శెట్టి ప్రస్తుతం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. 'జాతి రత్నాలు' తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న నవీన్ స్టార్ హీరోయిన్ అనుష్కతో కలిసి సినిమా చేయడంతో మొదటి నుంచే ఈ ప్రాజెక్టు పై మంచి అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుందిమ్ UV క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని పి. మహేష్ బాబు తెరకెక్కించారు. సినిమా విడుదలై మూడు వారాలు అవుతున్నా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ ఈ చిత్రానికి ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు.
ఇప్పటికే ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్స్ ని క్రాస్ చేసినట్టు తెలుస్తోంది. కలెక్షన్స్ పరంగానే కాదు సినీ సెలబ్రిటీస్ నుంచి ఈ సినిమా ప్రశంసలు అందుకుంటుంది. ఇప్పటికే రాజమౌళి, మహేష్ బాబు, రామ్ చరణ్, సమంత, రవితేజ లాంటి అగ్రతారలు సినిమా చూసి ప్రశంసలు కురిపించారు. సినిమా సక్సెస్ అవడంతో నవీన్ పోలీస్ శెట్టి ఫుల్ జోష్ లో ఉన్నాడు. హీరోగా ఈ సినిమాతో నవీన్ పోలీస్ శెట్టి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ బడా ప్రొడక్షన్ హౌస్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా పేరొందిన 'మైత్రీ మూవీ మేకర్స్' నవీన్ పొలిశెట్టితో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు.
Congratulations @NaveenPolishety for the Hat-trick blockbusters 💥💥💥
— Mythri Movie Makers (@MythriOfficial) September 21, 2023
Looking forward to work on something exciting soon!
Are you guys up for an energetic entertainer? 😎 pic.twitter.com/AzNcTsYOVb
ఈ విషయాన్ని సదరు నిర్మాతలు తాజాగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. 'మిస్ట్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న నవీన్ పొలిశెట్టి కి కంగ్రాట్యులేషన్స్ చెబుతూ.." త్వరలో నీతో వర్క్ చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. మీరంతా ఎనర్జిటిక్ ఎంటర్టైనర్ కోసం సిద్ధంగా ఉన్నారా" అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతేకాకుండా నవీన్ పోలిశెట్టి కి బొకే ని అందిస్తూ కంగ్రాచ్యులేట్ చేస్తున్న ఫోటోని షేర్ చేశారు. దీంతో మైత్రి మూవీ మేకర్స్ తో నవీన్ పోలిశెట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండబోతుందని స్పష్టం అవుతుంది. ఇక ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు.
టాలీవుడ్ లోనే అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ లో ఇంత త్వరగా సినిమా చేసే అవకాశం నవీన్ కు తగ్గడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మిగతా వివరాలు ఏవి నిర్మాతలు ప్రకటించలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్టుని అఫీషియల్ గా అనౌన్స్ చేసి మరిన్ని వివరాలు ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న 'పుష్ప 2' ని చాలా గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ ని పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. 'పుష్ప 2' తర్వాత మైత్రి మూవీ మేకర్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్ నవీన్ పోలిశెట్టితోనే ఉండనున్నట్లు సమాచారం.
Also Read : అలాంటి పాత్ర కూడా చేస్తా, ఈ సినిమాకు రిఫర్ చేసింది ఆయనే: అనసూయ భరద్వాజ్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Aishwarya Abhishek Bachchan: అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకోనున్నారా? అమితాబ్ బచ్చన్ పోస్ట్‌కు అర్థం ఏమిటీ?
Tripti Dimri: నా తల్లిదండ్రులు అలా అన్నారు - ‘యానిమల్’లోని ఇంటిమేట్ సీన్స్‌కు పేరెంట్స్ రియాక్షన్ బయటపెట్టిన తృప్తి
Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Devil Movie: ‘డెవిల్’ కోసం కళ్యాణ్‌రామ్‌కు 90 స్పెషల్ కాస్ట్యూమ్స్ - ఇటలీ నుంచి తెప్పిన మోహైర్ ఊల్‌తో!
TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన
Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం
Bhagwant Mann: 'అబద్ధాల మా నాన్న మూడోసారి తండ్రి కాబోతున్నారు' - పంజాబ్ సీఎం భగవంత్ పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు
MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!
/body>